salareys issue
-
‘గౌరవ’మేదీ..?
సాక్షి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పాఠశాలకు వచ్చే పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. పథకం విజయవంతంగా సాగుతున్నా.. భోజనం వండి వడ్డించే కార్మికుల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా ఉంది. నాలుగు నెలలుగా వీరికి గౌరవ వేతనం అందకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో.. వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ దసరాకైనా వేతనం అందుతుందని భావించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఇచ్చేది రూ.వెయ్యి.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహం భోజనం వండిపెట్టే కార్మికులకు గౌరవ వేతనం రూ.1000 ఇస్తున్నారు. కార్మికులు భోజనం వండి పెట్టడడంతోపాటు వడ్డించాలి కూడా. ఇన్ని పనులు చేసినా వారికి ఇచ్చే వేతనం ఎంతో తక్కువ. అదికూడా పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్ నుంచి కూడా అందడం లేదు. ఇచ్చే కొద్ది పాటి గౌరవ వేతనం కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అధికారులను అడిగినా వారు కూడా తెలియదని చెబుతున్నారు. వంట పని మానేస్తున్న కార్మికులు.. వేతనాలు సక్రమంగా అందక.. బిల్లులు సరిగా విడుదల కాక చాలా మంది కార్మికులు విధుల నుంచి తప్పుకుంటున్నారు. బయట వేరే పనిచేసుకున్నా అధికంగా డబ్బు సంపాధించవచ్చని.. ఇక్క నెల రోజులు కష్టపడి పనిచేసినా ఇచ్చేది.. వెయ్యి రూపాయలని.. అదీ సక్రమంగా అందకపోవడంతో చేసేదిలేక చాలా మంది కార్మికులు పని మానేస్తున్నారు. అదేబాటలో మరికొందరు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. జిల్లాలో 1700 మంది కార్మికులు.. జిల్లాలో మధ్యాహ్నా భోజన కార్మికులు దాదాపు 1700 మంది ఉన్నారు. వారు ప్రతి రోజు 1,11, 616 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. అయితే 2010 నుంచి కార్మికులకు గౌరవ వేతనం ఇస్తున్నారు. అప్పటి నుంచి సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతం. ఆశతో పనిచేస్తున్నాం మేము ఏళ్లతరబడి పనిచేస్తున్నాం. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అది ఎటూ సరిపోవడం లేదు. ప్రభుత్వం జీతం పెంచకపోవతుందా అన్న ఆశతో పనిచేస్తున్నాం. ఇచ్చే జీతం కూడా నెల నెల ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీతం పెంచి.. సక్రమంగా విడుదల చేసిన మమ్ములను ఆదుకోవాలి. – రమణ, మధ్యాహ్న భోజన కార్మికురాలు వంట పని మానేయమంటున్నారు.. నెలరోజులు కష్టపడి వంట చేస్తే అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎన్నోసార్లు వేతనం పెరుగుతుందని ఎదురుచూశాం.. కానీ పెంచలేదు. వంట పని మానివేయమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. ప్రభుత్వం అందరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తుంది. మాకు జీతాలైనా పెంచకపోతాతుందా.. అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతున్నాం. – స్వప్నారాణి, కార్మికురాలు -
పనిచేయమంటారు.. పైసలివ్వరు!
స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. పభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్లు)కి గత ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడుల్లో బండెడు చాకిరీ చేసినా వేతనాలు సక్రమంగా అందక అప్పుచేసి కుటుంబాలు పోషించుకుంటున్నారు. స్కావెంజర్స్ పనిచేయడం మానేస్తే పాఠశాలల్లో స్వచ్ఛతకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరు (ప్రకాశం): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాలకు నిర్మించిన మరుగుదొడ్లు శుభ్రం చేసి స్వచ్ఛతను కాపాడేందుకు ప్రతి పాఠశాలకు ఒకరి చొప్పున స్కావెంజర్‌ను నియమించారు. నియామకాలు జరిగి మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి వారు పాఠశాలలను కనిపెట్టుకుని పనిచేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఇచ్చే అరకొర వేతనాలను చెల్లించడంలో ప్రభుత్వం అలసత్యం వహిస్తోంది. జిల్లాలో 3,101 మంది కార్మికులు: జిల్లాలో ఉన్న మొత్తం 3,109 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు 3,101 మంది స్కావెంజర్లను నియమించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 33, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 2,369, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 273, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 320, మున్సిపల్ పరిధిలో 55, ఇతర పాఠశాలలు 51 ఉన్నాయి. జెడ్పీ హైస్కూళ్లలో పనిచేసే వారికి నెలకు రూ. 4 వేలు, ఎంపీయూపీ స్కూళ్లలో పనిచేసే వారికి రూ. 2,500, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే కార్మికులకు నెలకు రూ. 2 వేల చొప్పున వేతనం ఖరారు చేశారు. వారి వేతనాలను వెలుగు, మెప్మా ద్వారా చెల్లించేలా నిర్ణయించారు. ఏడాదిగా అందని వేతనాలు: గ్రామీణ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి గత ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే, మధ్యాహ్నం మరుగుదొడ్లు, పాఠశాల శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు ఎంతో కష్టపడుతున్నామని, తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాల్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పాఠశాలలో స్కావెంజర్లు లేకపోతే పాఠశాల అపారిశుద్ధ్యంతో దుర్వాశన వస్తుందని, స్కావెంజర్ ఉండటం వల్ల పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు. ఇంత పనిచేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలిసి కొంత మొత్తాన్ని ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో స్కావెంజర్లు కొద్దిసేపు పనిచేసి, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. నగర పంచాయతీల్లో మూడేళ్లుగా అందని వైనం: కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లోని మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలలను మున్సిపాలిటీ స్కూళ్లుగా మార్చలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తే స్కావెంజర్లకు గత మూడు సంవత్సరాలుగా వేతనాలు అందడం లేదు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో రెండు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 8 మండల పరిషత్ ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈఓను వేతనాల గురించి అడిగితే వెలుగు వారిపై, వెలుగు వారిని ప్రశ్నిస్తే మెప్మా వారిపై చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎప్పటికైనా జీతాలు రాకపోతాయా అన్న ఆశతో సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి పాఠశాలలను స్వచ్ఛతతో ఉంచేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మూడేళ్లుగా జీతాలు రాలేదు పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేస్తే నెలకు రూ. 4వేల వేతనం ఇస్తామని చెబితే చేరాను. మూడేళ్లుగా పనిచేస్తున్నా సక్రమంగా వేతనాలు రావడం లేదు. సారు వాళ్లు నెలకు రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇతర పనులు చేసుకునేందుకు వెళ్దామన్నా ఇక్కడి పనికి, బయట పనికి కుదరడం లేదు. అధికారులు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి. – షేక్ తహరూన్, జడ్పీ హైస్కూల్, గిద్దలూరు. మెప్మా అధికారులను అడగమంటున్నారు జీతాల గురించి అధికారులను అడిగితే వెలుగు వాళ్లపై చెప్తున్నారు. వారిని అడిగితే మెప్మా వాళ్లు ఇస్తారని అంటున్నారు. మెప్మా వాళ్లు మాకు ఎలాంటి జీతాలు రాలేదని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఈ పనినే నమ్ముకుని వేరే పనికి వెళ్లలేదు. జీతాలు ఎందుకు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారో అర్థం కావడం లేదు. జీతాలు ఇప్పించేలా చూడండయ్యా. – ఎస్.కాదర్బీ, ఎంపీపీ స్కూల్, పీఆర్ కాలనీ, గిద్దలూరు. -
ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా
నిర్మల్అర్బన్ : జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రమేశ్ డిమాండ్ చేశారు. వేతన సవరణపై యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, క్లరికల్, సూపర్వైజర్లతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెంచిన కిలోమీటర్లను తగ్గించి, తగ్గించిన ఓటిని రన్నింగ్ టైమ్‌ను పునరుద్ధరించాలన్నారు. సర్క్యులర్ ప్రకారం రూటు సర్వే చేసి, రన్నింగ్ టైమ్ ఇవ్వాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సర్క్యులర్ 01/2018ని రద్దు చేయాలన్నారు. గ్యారేజీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాల ని, అధునాతన పనిముట్లు, విడిభాగాలు సరఫరా చేయాలన్నారు. తార్నాక హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలం చెల్లిన రెగ్యులేషన్స్ మార్చాలన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన ‘చలో బస్ భవన్’ చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘం నాయకుడు కేఎంరెడ్డి, నిర్మల్ డిపో సెక్రెటరీ గంగాధర్, నాయకులు ఆర్ఎన్ రెడ్డి, పీవీఎస్‌రెడ్డి, శేఖర్, నారాయణ, అసదుల్ల, నర్సయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేకి చంద్రబాబు
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక వ్యతిరేకి అని, కార్మికుల సంక్షేమాన్ని, హక్కులను కాలరాస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్ష ముగింపులో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెకంటేశ్, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.సావిత్రి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దిల్షాద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లకు కనీసవేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే పారితోషికాలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. యూనిఫాం అలవెన్స్ నెలకు రూ.500 చొప్పున కేంద్రం మంజూరు చేస్తుంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఆశావర్కర్లకు ఇవ్వడం లేదన్నారు. ఇలా ఆశా వర్కర్ల డబ్బులను పక్కదారి పట్టిస్తోందని దుమ్మెత్తిపోశారు. టీబీ, లెప్రసీ, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధిగ్రస్తులకు చేస్తున్న సేవలకు ఇవ్వాల్సిన పారితోషికాలు మూడేళ్లుగా చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఆశావర్కర్లకు రూ.6 వేలు వేతనం ఇవ్వాలని, బకాయి పడిన యూనిఫారం అలెవన్స్, పారితోషికాలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారిని రెండవ ఏఎన్ఎంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, ఆశావర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, నాయకురాళ్లు పార్వతి, సౌభాగ్య, మంజూల, ఆనందలక్ష్మి, ఇర్ఫానా, సుజాత తదితరులు పాల్గొన్నారు. నాయకుల అరెస్ట్ ధర్నా అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నాయకురాళ్లు సావిత్రి, దిల్షాద్, వెంకటేశ్, నాగరాజు, నాగవేణి, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
‘ఆశ’ల బతుకు పోరు
జిల్లాలో 4,500 మంది ‘ఆశ’ వర్కర్లు పనికి దక్కని పారితోషికం డిమాండ్ల సాధనకు నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా గ్రామ సీమల్లో వైద్య సేవలనేసరికి ఠక్కున ప్రత్యక్షమయ్యేవారు ఆశ వర్కర్లు. చాకిరీ ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నరీతిగా తయారైంది వారి పరిస్థితి. దాంతో వారు దశలవారీగా ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాయవరం: గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా వారు ఉండాల్సిందే. ఆరోగ్య శిబిరాలు, గర్భిణులు, బాలింతలు, టీబీ పేషెంట్లకు సేవలు, 104 వాహనం వస్తే రోగులను తీసుకురావడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆధార్ సీడింగ్.. ఇలా అన్నింటికీ వారు తప్పనిసరి. వారికి జీతభత్యాలు లేవు. ఇచ్చేది గౌరవ వేతనం. అదీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆ నేపథ్యంలో దశలవారీగా ప్రభుత్వంపై పోరాటానికి వారు సిద్ధమయ్యారు. అందులో భాVýæంగా సొమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు ఆశ వర్కర్లు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల నుంచి టీఏ, డీఏలు కట్.. ప్రస్తుతం జిల్లాలోఉన్నS 120 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 4,500 మంది ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు టీఏ, డీఏలను నిలిపేసింది. ఎన్నెన్నో కష్టాలు పడి కుటుంబ నియంత్రణ ఆపరేష¯ŒS చేయిస్తే ఇచ్చే రూ.150 కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏటా వీరికి ఇవ్వాల్సిన యూనిఫాం నాలుగేళ్లుగా అందజేయలేదు. వీరు నిర్వహించే రికార్డులను పారితోషికం ఖర్చుతోనే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు విధుల్లో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్నాం. జీతభత్యాల్లేని ఉద్యోగంలా ఉంది. మేము పడుతున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. – జి.బేబి, ఆశ వర్కర్, చెల్లూరు, రాయవరం మండలం కనీసం రూ.5 వేల వేతనం ఇవ్వాలి పారితోషికం కాకుండా కనీస వేతనంగా నెలకు రూ.5వేలు చెల్లించాలి. ప్రభుత్వం మా సమస్యలను సత్వరం పరిష్కరించాలి. –ఎం.వీరలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్, కాకినాడ పోరుబాట తప్పడం లేదు.. డిమాండ్ల సాధనకు పోరుబాట తప్పడం లేదు. ఈ నెల 19న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మా డి మాండ్ల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. – చంద్రమళ్ల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆశ వర్కర్ల అసోసియేషన్, కాకినాడ. కనీస వేతనం కూడా దక్కడం లేదు ప్రభుత్వం కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం కూడా ఆశ వర్కర్లకు దక్కడం లేదు. పనికి తగ్గ పారితోషికం చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వం ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలి. – సీహెచ్.లక్ష్మి, ఆశ కార్యకర్త, రాయవరం