విషం తాగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య
హైదరాబాద్: గుర్తుతెలియని విషం తాగి ఓ సెల్యూలర్ కంపెనీ సేల్స్ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..రామంతాపూర్ బాలాజీనగర్‌కు చెందిన దేవేందర్ (38)ఓ సెల్యూలర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థికఇబ్బందులతో సమమతమవుతున్నాడు. తీవ్రమనస్తాపం చెందిన ఆయన మంగళవారం గుర్తుతెలియని విషం సేవించాడు.
గమనించిన భార్య వెంటనే చికిత్సనిమిత్తం గాంధీకి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నీలి కిరోసిన్ పట్టివేత: ఉప్పల్ పారిశ్రామికవాడలో శివకాశి పేయింట్స్ కంపెనీలో అక్రమంగా నిల్వవుంచిన 1400 లీటర్ల నీలికిరోసిన్‌ను ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమ యజమాని వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.