Salma
-
యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సల్మా సుల్తానా మాయమయ్యాక.. కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్లో యాంకర్‌గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు. సల్మా తండ్రి మరణించాక.. సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో.. సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్‌ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు. ఒకరోజు తాగిన మత్తులో.. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్‌కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ.. కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు. అస్థిపంజరం కోసం తవ్వకాలు నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నిజజీవితంలో వచ్చిన సరికొత్త ప్రమోషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ముద్దుల మేనల్లుడు ఆహిల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. చిన్నారి ఆహిల్ రాకను ఘనంగా ఆహ్వానించిన బాలీవుడ్ కండల వీరుడు తాజాగా క్యూట్ ఫోటో నొకదాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'అమ్మమ్మ సల్మా, మనవడు ఆహిల్ ' అంటూ ఒక ముచ్చటైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమ్మ సల్మా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న మేనల్లుడు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు సల్మాన్. కాగా సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, అయూష్ శర్మ దంపతులకు ఈ మార్చి 30న ఆహిల్ పుట్టాడు. ఈ నేపథ్యంలో మేనల్లుడి రాకతో మురిసిపోతున్న సల్మాన్ తన బుజ్జి మేనల్లుడు అహిల్కు ఇటీవల ఒక ఖరీదైన కారును కూడా బహుమతిగా ఇచ్చాడు. -
‘మా పెళ్లి ఎందుకు రిజిస్టర్ చేయరు?’
రాంచి: ప్రేమే నేరమౌనా, పెళ్లే భారమౌనా! అని బాధ పడుతోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ యువజంట. గత ఆరు నెలలుగా జిల్లా అధికారుల చుట్టూ కాళ్లు కందిపోయేలా తిరుగుతున్నా వారి పెళ్లిని అధికారులు రిజిస్టర్ చేయడం లేదు. ఆ భార్యాభర్తలు ఇరుమతాలకు చెందిన వారవడం వల్ల వారి పెళ్లిని రిజిస్టర్ చేస్తే రాష్ట్రంలో, ముఖ్యంగా దాద్రిలో మత ఘర్షణలు చెలరేగుతాయని అధికారులు చెబుతున్నారు. ఓ ముస్లిం కుటుంబం ఫ్రిజ్‌లో ఆవు మాంసాన్ని దాచుకున్నారనే అనుమానంతో ఆ కుటుంబానికి చెందిన ముస్లిం పెద్దను హిందూ మూకలు హత్య చేయడం, పర్యవసానంగా మత కలహాలు చెలరేగడం తెల్సిందే. 24 ఏళ్ల మనోజ్ భాటి హిందువు. 20 ఏళ్ల సల్మా ముస్లిం మతస్థురాలు. వీరిద్దరు దాద్రి పట్టణానికి సమీపంలోని చిటెహ్రా గ్రామానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్థులు. ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికోసం గతేడాది అక్టోబర్ 19వ తేదీన అలహాబాద్ నగరానికి పారిపోయారు. సల్మాకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. వారు మనోజ్ భాటిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మనోజ్‌తోపాటు అలహాబాద్ వెళ్లిన సల్మా అక్కడ హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును స్వప్నా ఆర్యగా మార్చుకున్నారు. అనంతరం ఆ జంట ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్య సమాజ్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్తో దాద్రికి తిరిగొచ్చారు. తాను మైనర్‌ను కాదని, మేజర్‌నని స్టడీ సర్టిఫికెట్, వైద్య పరీక్షల ద్వారా నిరూపించుకున్నారు. ఫలితంగా మనోజ్‌పై దాఖలైన కిడ్నాప్ కేసును పోలీసులు ఎత్తివేశారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవడం కోసం ఆ యువజంట దాద్రి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లింది. అయితే వారి పెళ్లిని రిజిస్టర్ చేయడానికి అక్కడి ఉన్నతాధికారి నిరాకరించారు. దాద్రిలో గొడవలు జరుగుతాయన్న నెపంతోనే పెళ్లి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించారని ఆ యువజంట చెబుతోంది. పెళ్లి రిజిస్టర్ చేయాలంటే అక్కడి ఉన్నతాధికారి తమను 20 వేల రూపాయల లంచం అడిగారని మనోజ్ మీడియా ముందు ఆరోపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ జంట జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ విషయంలో తాము జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్, సీనియర్ మేజిస్ట్రేట్, ఇలా అందరిని కలుసుకున్నామని, ఇంతవరకు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేక పోయారని మనోజ్ ఆరోపించారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కూడా లేఖ రాశామని, ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన వాపోయారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హిందూ మహిళలను వివాహమాడినా సమాజంలో మతాతీత పెళ్లిళ్లను ఎందుకు అనుమతించడం లేదో తనకు అర్థం కావడం లేదని మనోజ్ వ్యాఖ్యానించారు. ఏ అధికారి అయినా దాద్రి సంఘటనను సాకుగా చూపిస్తున్నారని, వాస్తవానికి ఆ సంఘటన తర్వాత ఎన్ని వదంతులు ప్రచారమైనా దాద్రిలో మతసామరస్యం దెబ్బతినలేదని మనోజ్ తెలిపారు. పైగా తమ పెళ్లి ఇరు మతాల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని అంటున్నారు. -
ఏడేళ్లుగా గృహ నిర్బంధం !
విముక్తి కల్గించిన పోలీసులు బెంగళూరు: దాదాపు ఏడేళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ బాలికను పోలీసులు రక్షించి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని డీ.జే హళ్లికి చెందిన షేక్‌సుభాన్, బాను దంపతులకు 12 మంది పిల్లలు. వీరిలో పద్నాలుగేళ్ల (ప్రస్తుతం) సల్మా (పేరుమార్చబడింది) తొమ్మిదో సంతానం. పేదరికంతో బాధపడుతున్న షేక్‌సుభాన్, బానులు బ్రిగేడ్ రోడ్డులో ఉంటున్న నస్రీన్ తాజ్ అనే ఆమెకు సల్మా (అప్పుడు ఆమెకు ఏడేళ్లు)ను దత్తత ఇచ్చారు. రెండేళ్లు నస్రీన్ తాజ్ సల్మాను బాగానే చూసుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దీంతో కాక్స్టౌన్లో నివాసం ఉంటున్న తనకు అక్క వరుస అయ్యే ఫరీదాకు.. సల్మా బాధ్యతలను నస్రీన్ అప్పగించింది. అప్పటి నుంచే సల్మా కష్టాలు మొదలయ్యాయి. ఫరీదా...ఇంటి పనులన్నింటినీ సల్మా చేత చేయించేది. చీటికి, మాటికీ కొడుతూ గాయాలపై కారం పొడిని కూడా చల్లేది. సరైన తిండి కూడా పెట్టేది కాదు. అంతే కాకుండా ఈ ఏడేళ్ల కాలంలో సల్మాను ఒంటరిగా ఒక్కసారి కూడా ఇంటి నుంచి బయటికి పంపించేది కాదు. ఎప్పుడైనా సల్మాను బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే ఫరీదా కూడా సల్మాతో పాటు ఉండేది. ఇలా దాదాపు ఏడేళ్ల కాలం పాటు సల్మాకు ఫరీదా ప్రత్యక్ష నరకం చూపించింది. ఇదిలా ఉండగా నస్రీన్ తాజ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సల్మాను చూడాలని ఉందని ఫరీదాను పదిరోజుల ముందు నస్రీన్ కోరారు. దీంతో తప్పని పరిస్థితుల్లో సల్మాను తీసుకుని ఫరీదా...నస్రీన్ ఇంటికి ఆటోలో బయలు దేరారు. హలసూరు పోలీస్‌స్టేషన్ వద్దకు ఆటో చేరుకోగానే సిగ్నల్ పడింది. దీంతో ఆటోలో ఉన్న సల్మా ఒక్కసారిగా కిందికి దిగి పోలీస్‌స్టేషన్‌లోకి పరుగెత్తింది. అక్కడ పోలీసులకు తన పరిస్థితి మొత్తం వివరించింది. హలసూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది డీ.జే హళ్లిలోని మసీదు వద్దకు వెళ్లి అక్కడి స్థానికుల సహాయంతో సల్మా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం సల్మాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరీదాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...!
యాడ్ ఫిల్మ్ మేకర్ అభయ్, కాలేజీ లెక్చరర్ అయిన సల్మా ఇద్దరూ భార్యాభర్తలు. వృత్తిపరమైన జీవితాల్లో ఇద్దరికీ అనేక సమస్యలుంటాయి. అయితే ప్రతి విషయానికి అభయ్ డీలా పడిపోతుండగా, సల్మా మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటుంది. అభయ్ ఫ్రస్టేషన్ కుటుంబ జీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. అయితే సల్మా తన సమస్యలను చక్కదిద్దుకుంటూనే అభయ్ సమస్యలకు పరిష్కారం చూపించడం, తరువాత ఆశావహ దృక్పథంతో ఇద్దరి జీవితాలు సంతోషంగా గడపడం కథ. అభయ్‌గా సౌరభ్ ఘరిపూరికర్, సల్మాగా రిచా జైన్ భార్యభార్తల మధ్య అనుబంధాన్ని, ఉండాల్సిన అవగాహన, పరిణితిని చక్కగా ప్రదర్శించారు. లామకాన్‌లో జరిగిన ఈ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది.