Salman Abedi
-
పేలుడు పదార్థాలను ఒక్కడే సీక్రెట్‌గా కొని..!
మాంచెస్టర్/లండన్: పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్పై జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో మాంచెస్టర్ నగర పోలీసులు ఇప్పటికే 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుడి దాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా పోలీసులు ఇదివరకే గుర్తించారు. అయితే నిందితుడు బాంబు పేల్చడానికి కావలసిన సామాగ్రిని తానొక్కడే కొనుగోలు చేశాడని నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిస్టు విభాగం చీఫ్ రస్ జాక్సన్ మీడియాకు తెలిపారు. వారం రోజుల కిందట మాంచెస్టర్‌లో చోటుచేసుకున్న ఈ మారణకాండలో చిన్నారులు సహా 22 మంది మృతిచెందగా, 116 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడే నాలుగు రోజుల ముందే మాంచెస్టర్‌లో సల్మాన్ అబేది అడుగుపెట్టాడు. ఈ సమయంలో పేలుడు పదార్థాలను పలు ఏరియాలలో తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసి ప్లాన్ ప్రకారమే మారణహోమం సృష్టించాడని జాక్సన్ వెల్లడించారు. దాడికి ముందు అతడు ఎవరెవరికీ ఫోన్ చేశాడు.. ఏ విషయాలపై చర్చించాడన్న దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్లూ సూట్‌కేసులో బాంబుతో సహా మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతానికి వచ్చి పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్‌లోనే అతి పెద్దదని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించాలన్న లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిటన్‌కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్‌కు నాలుగు రోజుల ముందుగానే రైల్లో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రస్ జాక్సన్ పేర్కొన్నారు. దాడి చేసిన రోజే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించగా.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఆ దుర్మార్గుడి తండ్రి, సోదరుడు అరెస్టు!
ట్రిపోలి: మాంచెస్టర్ మారణహోమంపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాంచెస్టర్‌లో జరిగిన సంగీత కచేరిపై విరుచుకుపడి.. 22మందిని పొట్టనబెట్టుకున్న సూసైడ్ బాంబర్ సల్మాన్ అబేది తండ్రిని, సోదరుడిని పోలీసులు లిబియాలో అరెస్టుచేశారు. ట్రిపోలిలోని అయిన్జరా ప్రాంతంలో బుధవారం సల్మాన్ తండ్రి రమదాన్ అబేదిని అతని ఇంటిబయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సల్మాన్ సోదరుడు హషీం అబేదిని కూడా అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం ‘రదా’ వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. హషీం అబేదికి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడు సోదరుడు సల్మాన్‌తో పలుసార్లు సంప్రదింపులు జరిపాడని, లిబియా రాజధాని ట్రిపోలిలో ఉగ్రవాద దాడులు జరపాలని అతను పథకం రచించినట్టు తెలుస్తున్నదని చెప్పారు. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత కచేరి నిర్వహిస్తుండగా ఉగ్రవాది సల్మాన్ అబేదీ అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు. -
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
-
‘మాంచెస్టర్’లో నలుగురి అరెస్ట్
► మారణహోమం ఘటనలో 119కి పెరిగిన క్షతగాత్రులు ► మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాల అనుమానం లండన్: మాంచెస్టర్ మారణహోమం కేసులో మరో నలుగురిని బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి మొత్తం సంఖ్య ఐదుకు చేరింది. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. బుధవారం దక్షిణ మాంచెస్టర్‌లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు. ఇటీవల పలుసార్లు లిబియా, సిరియాలకు వెళ్లి వచ్చాక ఉగ్రవాదులుగా మారారని బ్రిటన్ అధికారులు తెలిపారు. దాడి అనంతరం సల్మాన్ సిరియాకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాంచెస్టర్ పేలుళ్లతో పలువురు ఇతరులకు కూడా సంబంధం ఉందనీ, సల్మాన్ ఒక్కడే ఈ దాడి చేసి ఉండడని పోలీసులు, బ్రిటన్ హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బ్రిటన్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సమాచారం రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.