salve
-
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
ఆకలి బాధ తీర్చాలని ఆందోళన
రోడ్డెక్కిన దీనాపూర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఫిరంగిపురం : తమకు కడుపు నిండా శుభ్రమైన తిండి పెట్టాలని కోరుతూ దీనాపూర్ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. తాగడానికి కనీసం చుక్క నీరు...తింటానికి అన్నం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదులు సైతం అత్యంత దారుణంగా ఉన్నాయని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీనాపూర్‌ఽ విద్యాసంస్థల్లోని రూరల్ క్రిస్టియన్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు ప్రదర్శన చేసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నాలుగు నెలలుగా హాస్టల్ నిర్వాహకులకు సమస్యలు తెలియజేసినా తమ గోడు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా తాము కళాశాలలో చదువులు కొనసాగించలేమని చెప్పారు. నవ్యాంధ్ర సీ విద్యార్థి జేఏసీ జిల్లా అద్యక్షుడు కుర్రం శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. దీనాపూర్ డౌన్ డౌన్, హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, మేనేజ్మెంట్ వైఖరి మార్చుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా తహశీల్దారు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం ఎదటు బైఠాయించి నిరసన తెలిపారు. ఆకలి మంటలతో అలమటిస్తున్నా తమ గురించి కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. ధర్నా చేస్తున్న సమయంలో నవీన్ అనే విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయాడు. అర్ధాకలితో ఆవేదన..... 60 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటే 40 మందికి సరిపడా నాణ్యత లేని అన్నం తెచ్చి సర్దుకోమంటున్నారని విద్యార్థులు తెలిపారు. అర్ధాకలితో అల్లాడిపోతున్నామని చెప్పారు. నిత్యం ఇదే తంతు కొనసాగుతోందని పేర్కొన్నారు. శుభ్రత లేని నీటి వాడకం కారణంగా చర్మవ్యాధుల బారిన పడుతున్నామని చెప్పారు. మురుగుదొడ్లు లేకపోవడంతో బహిరంగ ప్రాంతాల్లో మలవిసర్జనకు వెళుతున్నామని పేర్కొన్నారు. వార్డెన్ ప్రేమానందం తీరు మరింత ఆందోళన కలిగిస్తుందన్నారు. నూరు శాతం మంది నిరుపేదల పిల్లలే..... అక్కడ కూలి పనుల చేసుకునే నిరుపేదల పిల్లలే నూరు శాతం మంది ఉంటారు. కనీసం కళాశాల ఫీజు కూడా చెల్లించలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌తో దీనాపూర్‌లో చేర్పిస్తారు. వసతి కల్పించి మంచి విద్యనందిస్తారని నమ్మి పిల్లలను వదిలి వెళుతున్నారు. ఆ తర్వాత వారి దీనావస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హాస్టల్ నిర్వాహకులు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా వ్యవహరించడంతో విద్యార్థుల కడుపులు మాడుతున్నాయి. వారంలో పరిష్కారం... తహసీల్దారు జే పార్థసారథి వద్ద విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దారు అప్పటికే అక్కడకు చేరుకున్న కళాశాల ప్రిన్సిపాల్ పి.మోజెస్, ఫిజికల్ డైరెక్టర్ హృదయరాజులతో చర్చించారు. వారం రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దారు సూచనలతో విద్యార్ధులు నిరసన కార్యక్రమాన్ని నిలపివేసి కళాశాలకు తిరిగివెళ్ళారు. తాను కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాననీ, ఇచ్చిన హామీలను నిలుపుకోకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని తహశీల్దారు కళాశాల ప్రతినిధులను హెచ్చరించారు. -
రోడ్డుపై బైఠాయించి నిరసన
ఆనందపేట (గుంటూరు) : సమస్యలు పరిష్కరించాలంటూ పొన్నూరు రోడ్డు వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు సమస్యను పరిష్కరించాలని, కమిషనర్ రావాలని స్థానికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాంట్రాక్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి స్థానికులకు సర్దిచెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వెల్లడించారు. ఇళ్ల ముందు చేరిన మురుగునీటితో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని చెప్పారు. రాకపోకలు సాగించడం నరకంగా మారిందని వాపోయారు. రెండు నెలలుగా మంచినీటి సరఫరా, కరెంటు కోతలతో అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు మురుగునీటిలో జారిపడి గాయాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు
ఇంద్రకీలాద్రిపై డీసీపీ సెంథిల్ పర్యటన విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని డీసీపీ ఎస్.సెంథిల్‌కుమార్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం ఆయన ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏసీపీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత దుర్గగుడి అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఏఈవో అచ్యుతరామయ్య, రామమోహనరావు, ఈఈలు శ్రీరామకృష్ణ ప్రసాద్ కోటేశ్వరరావు, నూకరత్నంతో చర్చించారు. అనంతరం అమ్మవారి దర్శనం నిమిత్తం దేవస్థానం ఏర్పాటుచేస్తున్న క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి కాయలు కొట్టే ప్రదేశంలో చేయాల్సిన మార్పుల గురించి చర్చించుకున్నారు. అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కనకదుర్గానగర్ను పరిశీలించారు. వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం ఇంద్రకీలాద్రిపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో గురువారం ఆడి కృత్తిక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో నిర్వహించిన దీపోత్సవంలో ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య పాల్గొన్నారు. తొలుత స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారి నిర్వహించిన ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని నాగపుట్ట వద్ద నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్నారు.