కాంగ్రెస్‌కు అర్థం మారిపోయింది: జగన్
ఎన్డిటివి.కాం సౌజన్యంతో...
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర కోసం ఎవరు ముందుకొచ్చిన వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ చేపట్టిన సమైక్య ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డిటీవీతో వైఎస్ జగన్ మాట్లాడారు. సమైక్య ఆంధ్ర కోసం తాము చేస్తున్న పోరాటానికి జాతీయ నేతలు మద్దతు ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు.
హెడ్‌లైన్స్ టుడే సౌజన్యంతో...
నేడు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తున్న కేంద్రం రేపు మరో రాష్ట్రాన్ని కూడా విభజిస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అనే మాటకు అర్థం మారిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్తా ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్‌గా రూపాంతరం చెందిందన్నారు. దేశంలో బ్రిటీష్ పాలన కూడా ఇంత ఘోరంగా లేదన్నారు.