samans
-
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ క్షణమైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయనుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్యనా లేక హత్య అన్నదానిపై సీబీఐ విచారణ కొనసాగిస్తుంది. ముంబైలోని సుశాంత్ ఫ్లాట్‌లో సీబీఐ ప్రత్యేక బృందం నేడు డమ్మీ టెస్ట్ నిర్వహించింది. సుశాంత్ ఎత్తు 5 ఫీట్ల 10 అంగుళాలు కాగా ఫ్యాన్‌కు, బెడ్‌కు మధ్య 5 ఫీట్ల 11 అంగుళాల ఎత్తు ఉంది. అపార్ట్మెంట్లోని రూఫ్ ఎత్తు 9 ఫీట్ల 3 అంగుళాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య జరిగిందా అన్నదానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. (సుశాంత్ కేసు: అర్ధరాత్రి దాటిన తర్వాత పోస్ట్‌మార్టం?) సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్న పోస్టుమార్టం రిపోర్టులో ఘటన ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ నివాసం నుంచి దగ్గర్లోనే రెండు హాస్పిటల్స్ ఉన్నా ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కూపర్ హాస్పిటల్‌కే సుశాంత్ డెడ్‌బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని ఇందుకు సంబంధించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్న హిందుజా ఆసుపత్రిని సీబీఐలోని మరో బృందం నిన్న సందర్శించింది. ఆ సమయంలో సుశాంత్ మానసిక ప్రవర్తన ఎలా ఉండేది? అతనితో పాటు హాస్పిటల్‌కి ఎవరైనా వచ్చేవారా? హాస్పిటల్ బిల్లు ఎవరు చెల్లించారు తదితర విషయాలపై కూడా వారు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇక సుశాంత్ మృతి కేసు దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. (సుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు) -
కేజ్రీవాల్, 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు సమన్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. పోలీసులు దాఖలుచేసిన చార్జిషీటు ఆధారంగా వారిని నిందితులుగా పేర్కొంది. అక్టోబర్ 25న తమ ముందు హాజరుకావాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ నిందితులందరికీ నోటీసులు పంపారు. వారిపై నేరాభియోగాలు మోపేందుకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దోషులుగా తేలితే వారికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈ కేసులో మే 18న ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను మూడు గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే పెద్ద కుట్రలో భాగంగానే నోటీసులు పంపిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బూటకపు కేసులను పెడుతోందని, అవన్నీ కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఆప్ ప్రభుత్వ స్ఫూర్తిని ఇలాంటి కుట్రలు దెబ్బతీయలేవని అన్నారు. ఫిబ్రవరి 19న కేజ్రీవాల్ నివాసంలో ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
లాలూకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ మని లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున ఆయనకు ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది. సుజాత ప్రైవేటు లిమిటెడ్ హోటల్‌కు రెండు రైల్వే హోటళ్లను సబ్ లీజ్‌ను ఇచ్చే విషయంలో లాలూతో సహా అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ ఆభియోగాలు యోపింది. దీనిపై గతంలో ఈడీ చార్జ్‌షీట్‌ను నమోదు చేయగా.. కేసుపై విచారించడానికి తగిన సమయం కావాల్సిందిగా ఈడీని కోర్టు కోరింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై పూర్తి విచారణ అనంతరం కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలూకు మరోసారి సమన్లు రావడంతో ఆర్జేడీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
ఎస్ఐ జయన్నకు కోర్టు సమన్లు
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ఎస్ఐగా విధులు నిర్వహించిన జయన్నను ఈ నెల 27న కోర్టులో హాజరు కావాల్సిందిగా బనగానపల్లె న్యాయ స్థానం సమన్లు జారీ చేసింది. వివరాలను మండల వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు డి.మౌలాబీ శుక్రవారం విలేకర్లకు వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఎస్ఐ జయన్న అధికార రాజకీయ ఒత్తిళ్లుతో తనభర్త యూసుఫ్‌పై అక్రమంగా 307 కేసు నమోదు చేసి జైలు పాలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో మహిళ ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా ఎస్ఐ తనను బెదిరించారని ఆరోపించారు. దీంతో పోలీసుల ద్వారా తమకు న్యాయ జరగదని భావించి ఎస్ఐతో పాటు కేసుతో సంబంధం ఉన్న పట్టణానికి చెందిన హుస్సేన్‌బాషా(చైనా), సాయిరామ్ ప్రసాద్‌పై తాము ప్రైవేట్ కేసు దాఖాలు చేశామన్నారు. తమకు సంబంధించిన సాక్షులు ఐదుగురిని న్యాయస్థానం విచారించిదన్నారు. దీంతో ఎస్ఐ జయన్నతో పాటు మరో ఇద్దరు ఈ నెల 27న కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లు మండల వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా డాక్టర్ల విభాగం కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, రైతు సంఘం నాయకులు పాపన్న తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది. గత సాధారణ ఎన్నికల్లో భాగంగా మహత్మా గాంధీ హత్య అంశంపై రాహుల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్సే కారణమని రాహుల్ ఆ సమయంలో విమర్శించడంతో కేసు నమోదయ్యింది. దీనిపై మంగళవారం హైకోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 30వ తేదీన భీవండి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కు హైకోర్టు సూచించింది.