ఎస్‌ఐ జయన్నకు కోర్టు సమన్లు
Published Fri, Jan 13 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ఎస్‌ఐగా విధులు నిర్వహించిన జయన్నను ఈ నెల 27న కోర్టులో హాజరు కావాల్సిందిగా బనగానపల్లె న్యాయ స్థానం సమన్లు జారీ చేసింది. వివరాలను మండల వైఎస్‌ఆర్‌సీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు డి.మౌలాబీ శుక్రవారం విలేకర్లకు వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఎస్‌ఐ జయన్న అధికార రాజకీయ ఒత్తిళ్లుతో తనభర్త యూసుఫ్‌పై అక్రమంగా 307 కేసు నమోదు చేసి జైలు పాలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో మహిళ ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా ఎస్‌ఐ తనను బెదిరించారని ఆరోపించారు. దీంతో పోలీసుల ద్వారా తమకు న్యాయ జరగదని భావించి ఎస్‌ఐతో పాటు కేసుతో సంబంధం ఉన్న పట్టణానికి చెందిన హుస్సేన్‌బాషా(చైనా), సాయిరామ్ ప్రసాద్‌పై తాము ప్రైవేట్ కేసు దాఖాలు చేశామన్నారు. తమకు సంబంధించిన సాక్షులు ఐదుగురిని న్యాయస్థానం విచారించిదన్నారు. దీంతో ఎస్‌ఐ జయన్నతో పాటు మరో ఇద్దరు ఈ నెల 27న కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లు మండల వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా డాక్టర్ల విభాగం కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, రైతు సంఘం నాయకులు పాపన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement