Sammakka-Sarakka
-
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భక్తులతో కిక్కిరిసిన మేడారం
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెలించారు. ఇప్పటి వరకు 30వేల మంది భక్తులు దేవతలను దర్శించుకునట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మినీ మేడారం జాతర ఈ బుధవారం ప్రారంభమైంది. దీన్నే మండ మెలిగే పండగ అంటారు. నేటి (శుక్రవారం) మధ్యాహ్నం డీఐజీ రవివర్మ, ఎస్పీ భాస్కరన్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్కడి అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మినీ మేడారం మేడారం వచ్చే భక్తులంతా తిరిగి వెళ్లే సమయంలో గట్టమ్మ ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. -
మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం నుంచి జరగనున్న మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీన్నే మండ మెలిగే పండగ అంటారు. మేడారం జాతరకు ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో రానుండటంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి నాలుగు రోజులపాటు కొనసాగే ఈ జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. సాయంత్రం డీఎస్పీ, ఓఎస్డీలతో జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తారు. పలువురు వీఐపీలు సమ్మక్కసారలమ్మలను దర్శించుకోనున్నారు. వేలాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆర్టీసీ, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు కూడా తమ శాఖల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. -
దండుకునేందుకేనా..
మేడారం జాతర పనుల్లో అదనపు ప్రతిపాదనలు కాంట్రాక్టర్ల కోసమే ఇంజనీర్ల నివేదికలు అవసరం లేకున్నా కొత్తగా పైప్లైన్లు, ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఈ-టెండర్ల దాఖలుకు నేడు చివరి రోజు వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పనులు.. భక్తుల సౌకర్యం కోసం కాకుండా కాంట్రాక్టర్ల మేలు కోసమే అన్నట్లు ప్రతిపాద నలు రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.101 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పనులను గుర్తించి.. వాటిని చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుుతే ఈ పనుల గుర్తింపు పూర్తిగా కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగే తీరుగా సాగిందని, నిధులను ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యంగా అధికారులు పనులను రూపొందించినట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా ప్రతిపాదనల్లో పెట్టడం ఈ విమర్శలకు బలం చేకూరుతోంది. భక్తులకు తాగునీరు అందించేందుకు 2002 జాతర నుంచి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే వేల కిలోమీటర్ల మేరకు తాగునీటి పైపు లైన్లు వేశారు. ఇలా పనులు పూర్తి చేసిన ప్రాంతంలోనే మళ్లీ కొత్తగా పైపులైన్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్), సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), సాగునీటి శాఖలు జంపన్నవాగులో ఇప్పటికే 21 చిన్నబావు(ఇన్‌ఫిల్టరేషన్)లను ఏర్పాటు చేశాయి. భక్తులకు తాగునీటితో పాటు స్నానఘట్టాల్లోని షవర్లకు నీటిని అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖలు సరఫరా చేసే నీరు శుద్ధి చేసినది కాకపోవడంతో జాతరకు వచ్చే భక్తులు సొంతంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేడారంలో 2012, 2014 జాతరలో భక్తులకు తాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. భక్తులకు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేసే విషయాన్ని పక్కనబెట్టి అవసరం లేకున్నా కొత్తగా పైప్లైన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ విభాగం నీటి శుద్ధి ప్రక్రియను ఆలోచించకుండా ప్రతిజాతరకు కొత్తగా వందల కిలో మీటర్ల పొడవున పైప్లైన్లు ఎవరి కోసం నిర్మిస్తున్నారో అర్థంకావడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో కొందరు కాంట్రాక్టర్లు... పాత లైన్లను మరమ్మతులు చేసి, కొత్తగా ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేడు టెండర్లు మేడారం జాతర ఏర్పాట్ల కోసం గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం కొత్తగా నాలుగు ఇన్‌ఫిల్టరేషన్ బావులను నిర్మిస్తోంది. వీటి కోసం రూ.28 లక్షలు కేటాయించింది. ఇప్పటికే నిర్మించిన పైపులైన్లకు, కొత్తగా నిర్మించబోయే పైపులైన్ల సామర్థ్యానికి సరిపోయే స్థాయిలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు ఉన్నాయి. అయినా కొత్తగా ఇన్‌ఫిల్టరేషన్ బావులను తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. అలాగే తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.4 కోట్లు కేటాయించారు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం రూ.60 లక్షల వ్యయంతో వెస్ట్రన్ టైపు టాయిలెట్లు నిర్మిస్తారు. సుమారు రూ.8.50 కోట్లతో చేపట్టే ఈ 29 పనులకు ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండరు ప్రక్రియ చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో రోడ్లకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టనున్నారు. రెండు శాఖలకు సంబంధించిన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ టెండరు ప్రక్రియ దాఖలు సోమవారంతో ముగియనుంది. ఏ పనులు ఎవరు చేపట్టాలన్నది రెండుమూడు రోజుల్లో అధికారికంగా తేలనుంది. కాగా, ఈ పనుల చేసే విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఇప్పటికే అంతర్గతంగా ఒప్పందాలు కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.