sammakka- sarakka jatara
-
మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు
సాక్షి, ములుగు: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ మేడారం జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పాల్గొన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. (జాతర షురూ: కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ) దర్శనం అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని కొనియాడారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్ హోదాలో అమ్మవార్ల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. (చదవండి: గద్దెనెక్కిన వరాల తల్లి) -
నేటి నుంచే మహా జాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతర బుధవారం మహావైభవంగా ప్రారంభమవుతోంది. ఆదివాసీ పూజా క్రతువుల మధ్య సారలమ్మ తల్లి మేడారంలో గద్దెపైకి చేరుకోనుంది. మరుసటి రోజున (గురువారం) సమ్మక్క గద్దెపైకి చేరనుంది. రెండు రోజుల పాటు వన దేవతల దర్శనం అనంతరం.. శనివారం తల్లుల వన ప్రవేశం జరగనుంది. జాతర కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. భక్త జన సంద్రం మహా జాతర కోసం మంగళవారం సాయంత్రానికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. మేడారం, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్ ప్రాంతా లు భక్తుల గుడారాలతో నిండిపోయా యి. మేడారం వెళ్లే దారుల న్నీ కిక్కిరిసిపోయాయి. జాతర కోసం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తం గా 52 కేంద్రాల నుంచి 2,490 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు వస్తున్నారు. దీంతో నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. యథావిధిగా పూజలు.. బుధవారం సాయంత్రం 5.18 గంటల నుంచి 8.42 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. షెడ్యూల్ ప్రకారం సారలమ్మ ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరాలి. అయితే గ్రహణం నేపథ్యంలో పూజా క్రతువు సమయంలో మార్పులు ఉం టాయనే ఊçహాగానాలు వచ్చాయి. అయితే ఆదివాసీ పూజా విధానాల్లో గ్రహణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోమని పూజారులు స్పష్టం చేశారు. అయితే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో పూజా క్రతువులను మాత్రం గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని చెప్పారు. జాతర ఇలా... తొలిరోజు (బుధవారం) సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. అదేరోజు పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం గద్దెలకు చేరుకుంటారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. శుక్రవారం సమ్మక్క– సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉంటారు. జాతర చివరి రోజు (శనివారం) సమ్మక్క తల్లి వన ప్రవేశం చేస్తుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ ప్రాంతాలు ప్రయాణం కావడంతో జాతర ముగుస్తుంది. కాగా.. మహబూబా బాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడిగె రూపంలో మంగళవారమే మేడారం మహాజాతరకు బయల్దేరారు. పూజారులు గ్రామంలోని ఆలయంలో పెనుక వంశీయులు పూజలు చేసిన తర్వాత అటవీమార్గంలో కాలినడకన మేడారానికి బయల్దేరారు. మహాజాతరలో పగిడిద్ద రాజు సమ్మక్కను వివాహమాడతారు. ‘సాక్షి’ టీషర్ట్స్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ కర్ణన్ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో వలంటీర్ల కోసం ‘సాక్షి’యాజమాన్యం అందించిన టీషర్ట్స్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జేసీ అమయ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో జాతరలో వలంటీర్ల కోసం టీషర్ట్స్‌ను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సారలమ్మ ప్ర«ధాన పూజారి కాకసారయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ చేతుల మీదుగా గద్దెల ప్రాంగణంలో వలంటీర్లకు టీషర్ట్స్‌ను అందజేశారు. -
అందాల కోవెల.. ఏడుపాయల
ఓ వైపు పరీక్షలు.. మరోవైపు రాష్ట్రంలో జాతర సందడి. వనదేవతలు సమ్మక్క, సారక్క జాతరకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. పని ఒత్తిడి, సెలవులు లేకపోవడం.. ఇలా ఏదో కారణం వల్ల ఆ జాతరకు వెళ్లలేని వారు ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకటీ రెండ్రోజులు కాదు... ఏకంగా 365 రోజులూ జాతర వాతావరణముండే ఏడుపాయల సిటీకి దగ్గర్లోనే ఉంది. మరి ఆలస్యమెందుకు ఈ వీకెండ్ అక్కడికి ప్యాకప్ అయిపోండి. - ఓ మధు స్థలపురాణం ఇదీ.. ఏడు పాయలుగా చీలి ప్రవహించే మంజీర, వనదుర్గమాత మందిరం, వనభోజనాలకు విశేషంగా వచ్చే జనంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం. వనదుర్గ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గురించి ఆనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నాగజాతిని తుదముట్టించేందుకు జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం జరిగింది ఇక్కడేనని అని స్థలపురాణం. సర్పయాగం అనంతరం యాగస్థలిని పుణీతం చేయడానికి గరుడ్మంతుడు.. భోగావతి నదిని తీసుకొచ్చాడని, అందుకే ఈ ప్రవాహాన్ని గరుడగంగ అని అంటారని ప్రతీతి. ఏడుగురు రుషుల యాగకుండాలను తాకేందుకు గరుడగంగ ఏడుపాయలుగా చీలిందని చెప్తారు. అత్రి, జమదగ్ని, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమ సప్తరుషులు ఈ ఏడుపాయలను స్వాగతించినందున వీటిని ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. అలా ఇది ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. ఆలయాల నిలయం.. స్వయంభూ దుర్గాభవానీ ఆలయం ఇక్కడి మరో ప్రత్యేకత. సొరంగంలో దుర్గామాత దర్శనమిస్తుంది. ఏకోత్తర శతకుండలం, పాపాలమడుగు, ముని పుట్ట, తపోభూమి ఆలయ పరిసరాల్లో ఉంటాయి. పాపాలమడుగులో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోతాయనేది ప్రజల నమ్మకం. దీనికి సమీపంలోనే శివాలయం, ముత్యాలమ్మ గుడి, ఎల్లమ్మ ఆలయాలున్నాయి. శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ జాతరకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాలిపల్లిలో ఉందీ ఏడుపాయల. సిటీ నుంచి 110 కి.మీ, మెదక్‌కు 20 కి.మీ దూరంలో ఉంటుంది. ఏడుపాయలకు హైదరాబాద్ నుంచి బస్ సౌకర్యం ఉంది. పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.