డిపాజిట్లు రాబట్టుకునేందుకు క్లైమ్ చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, ఆదోనిలో బ్రాంచీలు కలిగిన సమృధా జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పూణే మహారాష్ట్ర సంఘాన్ని మూసివేయుటకు న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ లిక్విడేటర్‌ను నియమించిందని జిల్లా సహకార అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ సంఘంలో సభ్యులు ఎవరైనా డిపాజిట్లు చేసి ఉంటే వాటిని రాబట్టుకునేందుకు క్లయిమ్‌లు చేసుకోవచ్చని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. లిక్విడేటర్, సమృధా జీవన్ మల్టీ స్టేట్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ , ఆఫీసు నెంబరు 502, 4వ అంతస్తు, ప్రాన్ పరిటిహైట్స్, సీటీఎస్ నంబరు 6769 మిత్రమండల్ చౌక్ ,పార్వాటి, పూణే మహారాష్ట్ర చిరునామాకు క్లయిమ్‌లు పంపుకోవాలని డీసీఓ సూచించారు.