Samson
-
లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగు
ముంబై: లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేసి ఓడింది. సూపర్ జెయింట్స్‌ను ఆరంభంలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బౌల్ట్ (2/18) దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో డికాక్ (7), ఆయుశ్ బదోని (0)లను పెవిలియన్ చేర్చాడు. కేఎల్ రాహుల్ (10)ను అవుట్ చేసిన ప్రసిధ్ కృష్ణ జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు. తర్వాత దీపక్ హుడా (59; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కని పోరాటం చేశాడు. కానీ కొండంతలా పెరిగిన రన్‌రేట్‌కు తగిన ప్రదర్శన చేయడంలో కృనాల్ పాండ్యా (25), స్టొయినిస్ (27), హోల్డర్ (1) విఫలమవడంతో సూపర్ జెయింట్స్‌కు ఓటమి తప్పలేదు. మళ్లీ ఓడిన చెన్నై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లతో నెగ్గింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (57 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X పంజాబ్ కింగ్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ఎంతో బలమున్నా నిర్వీర్యుడైన సమ్సోను
శత్రువు ఆయుధాలతో మన ఎదురుగా ఉంటే మనం గెలవొచ్చు. కాని ఆ శత్రువే విషంగా మారి మన రక్తంలో కలిస్తే, చనిపోవడమొక్కటే మనకున్న మార్గం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులనే శత్రువులు అలాంటి వారే. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఎదుర్కోవలసిన ఏడు శత్రుజనాంగాల జాబితాలో నిజానికి ఫిలిష్తీయులు లేరు (యెహోషువా 3:11). కాని న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన 300 ఏళ్లలో ఫిలిష్తీయులు గ్రీసు దేశం నుండి ఐగుప్తుకు, అక్కడినుండి వెళ్లగొట్టితే వచ్చి ఇశ్రాయేలీయులుంటున్న కనాను దేశపు దక్షిణప్రాంతాల్లో శరణార్థులుగా నివసించారు. ఎందుకంటే ఇనుప పనిముట్లను, ఆయుధాలను, ఇనుప రథాలను చెయ్యడంలో ఫిలిష్తీయులది అందె వేసిన చెయ్యి. అందువల్ల ఫిలిష్తీయులను తమ మధ్య నివసించడానికి అనుమతించడంలో ఇశ్రాయేలీయులకు ప్రయోజనం కనిపించింది. కనానులోని శత్రువులను సంహరించి, ఓడించిన దేవుని ప్రజలు ఇలా కొత్త శత్రువులొచ్చి తమ మధ్య దూరకుండా అడ్డుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ఫిలిష్తీయులను తమ పొరుగువారుగా, ఇనుప పనిముట్లు చేసిపెట్టే పనివారుగానే పరిగణించారు. పైగా ఫిలిష్తీయుల పురుషులు బలవంతులైతే, వాళ్ళ స్త్రీలు చాలా అందమైనవారు కావడంతో, ఇశ్రాయేలు యువకులు అక్కడి నుండి స్త్రీలను తెచ్చుకొని పెళ్లిచేసుకోవడం కూడా మామూలయింది. కనానుదేశంలో అన్యజనాంగాలతో సాంగత్యం చేయవద్దంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇశ్రాయేలీయులు చేసిన ఈ దుష్కార్యానికి పర్యవసానంగా ఫిలిష్తీయులే ఒక దశలో ఇశ్రాయేలీయులను ఏలడం ఆరంభించి 70 ఏళ్లపాటు వారిని కఠినంగా పాలించారు. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు దేవుడు సమ్సోను అనే న్యాయాధిపతిని అపుడు ఎన్నుకున్నాడు. అంతదాకా పిల్లలు లేని మనోహా అనే ఇశ్రాయేలీయుని భార్యతో దేవుడు మాట్లాడి, ఆమెకు తానొక కొడుకునివ్వబోతున్నానని, అతడు చాలా బలవంతుడవుతాడని, అయితే అతన్ని దేవునికి ‘ప్రతిష్ఠితుడుగా’ ప్రత్యేకించి పెంచాలని, ఇశ్రాయేలీయులను అతను ఫిలిష్తీయుల నుండి రక్షిస్తాడని ఆమెను తెలిపాడు. అలా మొదలయ్యింది ఎంతో బలవంతుడుగా పేరొందిన సమ్సోను కథ. అప్పటికే ఇశ్రాయేలీయుల జీవనశైలిలో ఫిలిష్తీయుల సంప్రదాయాలు చాలా కలిసిపోయాయి. ఫిలిష్తీయుల నుండి దేవుని ప్రజల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తమకు పుట్టిన బాలునికి అతని తల్లిదండ్రులు ‘సమ్సోను’ అనే ఫిలిష్తీయుల పేరు పెట్టడమే దానికి రుజువు. సమ్సోనును ఎంతో బలవంతుడుగా దేవుడు పుట్టిస్తే స్త్రీలను మోహించి తన బలాన్నంతా వారికే ధారపోసే దుర్బలుడయ్యాడు సమ్సోను. పైగా తల్లిదండ్రుల నియంత్రణ కూడా అతని మీద లేదు. చివరికి దెలీలా అనే ఫిలిష్తీ స్త్రీని మోహించి ఆమెతో సహవసించి, అలా ఫిలిష్తీయులకు బందీగా చిక్కి, వాళ్ళు అతని కళ్ళు కూడా పెరికివేసేంత బలహీనుడయ్యాడు. కాకపోతే అంధుడై కూడా దేవుని సహాయంతో ఒక గుడి స్తంభాలు పడగొట్టడం ద్వారా వారి దేవాలయాన్ని కూల్చి వేలాదిమంది ఫిలిష్తీయులను ఒక్కసారిగా హతమార్చి సమ్సోను తన పగ తీర్చుకున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్నో గొప్పకార్యాలు చేయడానికి పుట్టిన సమ్సోను అలా కేవలం తన పగ మాత్రం తీర్చుకొని చనిపోయాడు. దేవుడిచ్చిన బలం తన సొంతమని అతను నమ్మడం, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని సరిగ్గా నడిపించలేక పోవడమే అతని సమస్య అయ్యింది. శత్రువును గెలిచేవాడు బలవంతుడైతే, స్వీయనిగ్రహంతో తనను తాను గెలిచేవాడు మహా యోధుడని సమ్సోను తెలుసుకోలేకపోయాడు. అత్యున్నతంగా కనిపించే పర్వతాల అసమానశక్తి రహస్యం, అదృశ్యంగా భూమి లోపల ఉండే వాటి పునాదుల్లో ఉంటుందన్న రహస్యం తమను తాము నిగ్రహించుకునేవారికి, తగ్గించుకునేవారికే తెలుస్తుంది. ఎంతో బలమున్న సమ్సోను నిర్వీర్యం కావడానికి అతని హృదయంలోని అపరిశుద్ధతే కారణమైంది. – రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
భోగాలపై వ్యామోహంతో భ్రష్టత్వం
ఇశ్రాయేలీయులను ఇరవై ఏళ్లు ఏలిన గొప్ప న్యాయాధిపతి, మహాబలవంతుడు సంసోను. దేవుని వరప్రసాదంగా పుట్టిన కారణజన్ము డతను. ఫిలీషియులనే అత్యంత క్రూరులైన శత్రువుల చేతిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విముక్తులను చేసే మహోన్నత లక్ష్యాన్ని, అంతటి బలాన్ని దేవుడతనికిచ్చాడు. ఫలితంగా ఒక గాడిద దవడ ఎముకతో వెయ్యిమంది శత్రువులను, కేవలం చేతులతో సింహాన్ని చీల్చి చంపాడు. కాని దేవుని నుండి ఎన్నో ఆధిక్యతలను పొందిన సంసోను దారితప్పి స్త్రీలోలుడై అల్పకార్యాలకు పాల్పడి జీవితంలో అత్యధిక మూల్యాన్ని చెల్లించాడు. శత్రువులను చీల్చి చెండాడేంత బలాన్ని దేవుడిస్తే, ఆత్మీయంగా, నైతికంగా బలహీనుడై ఆ శత్రువులకే బందీగా చిక్కి, రెండు కళ్లూ కోల్పోయి, చెరసాలలో తిరగలి విసిరాడు. దేవునికి ప్రీతికరంగా, ప్రజలకు ఆదర్శప్రాయంగా సాగవలసిన సంసోను జీవితం అద్భుతంగా ఆరంభమై, క్రమంగా అధ్వానమై చివరికి దయనీయమైంది. ఒక క్రమం లేక, దైవిక వ్యూహం లేక, గురితప్పి జీవించడమే సంసోను చేసిన మహాపరాధం. దేవుడిచ్చిన బలం న్యాయాధిపతి పదవి. ఆ కారణంగా లభించిన గౌరవం విలువ తెలుసుకోలేకపోయాడతను. అడపాదడపా బలప్రదర్శన చేసి, అందరితో ఆహా ఓహో అనిపించుకోవడానికి కనిపించిన శత్రువులను సంహరించాడే తప్ప ఇశ్రాయేలు సైన్యాన్ని సమాయత్తం చేసి, తన నాయకత్వంలో యుద్ధం చేసి శత్రువులను జయించే ఆలోచన రానంతగా స్త్రీ వ్యామోహం అతన్ని ఆవహించింది. డెలీలా వంటి సుందర స్త్రీల సాంగత్యం అతనికి దేవునికన్నా మిన్న అయింది. దేవుడు చెప్పినట్టుగా కాక తనకు తోచినట్టుగా విచ్చలవిడిగా జీవించాడు. శత్రువుల వేటలో, దేవుని ప్రజల పరిచర్యలో, దైవారాధనలో తరించవలసిన సంసోను అల్పభోగాలకోసం, స్త్రీ వ్యామోహంతో తన జీవితాన్ని వెచ్చించి భ్రష్టత్వానికీ కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. కొందరంతే, దేవుడత్యున్నతమైన పిలుపునిచ్చి పరిచర్యకు పిలిస్తే, డబ్బు, పేరు, అధికారం, ఆస్తులు వంటి డెలీలాల వ్యామోహంలో పడి ఆత్మీయ జీవితంలో డీలాపడిపోతాడు. విశ్వానికే యజమాని అయిన యేసుప్రభువు తన భాగ్యాలన్నీ వదిలేసి పేదవాడిగా, రిక్తుడిగా, దాసుడుగా ఈ లోకానికొస్తే, ఆయన్ను సేవించేవారమని చెప్పేవాళ్ళు కోట్లకు పడగెత్తడం, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్సుల వెంట పడడం ఎంత సమంజసం? సంసోనుకొక్క స్త్రీ వ్యామోహం మాత్రమే ఉండేది. కాని చాలామందికి డబ్బు, భూమి, పేరు ప్రఖ్యాతులు, అధికారం వంటి చాలా వ్యామోహాలున్నాయి. సంసోను పగలు దేవునికోసం పోరాటాలు చేశాడు. రాత్రిళ్ళు దేవుని ఆజ్ఞల్ని యథేచ్ఛగా ఉల్లంఘించాడు. శత్రువులే అతని ముందు మోకరిల్లేంత బలవంతుడుగా దేవుడు తీర్చిదిద్దితే, స్త్రీల ముందు మోకరిల్లేంత బలహీనుడయ్యాడు. అయినా దేవుడెంత కరుణామయుడంటే, చెరసాలలో అతను చేసిన పశ్చాత్తాప ప్రార్ధన నంగీకరించి అతన్ని విశ్వాసపరుల జాబితాలో చేర్చాడు. (హెబ్రీ 11:32). గుడ్డివాడైనా నిండా సంకెళ్లున్న అవసాన దశలో అతడు ఒక గుడిని కూల్చగా శత్రువులు వేలమంది చనిపోయారు. వెయ్యి నక్కలు కలిసి కుట్రచేసి ఒక సింహాన్ని ఓడించినా, సింహం సింహమే, నక్కలు నక్కలే కదా!!