sangameswara swamy
-
భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వర శిఖరం
కొత్తపల్లి: కర్నూలు జిల్లా సప్తనది సంగమంలో వెలసిన శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయ శిఖరం భక్తులకు దర్శనమిచ్చింది. గతేడాది అక్టోబర్లో ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి ఒదిగిపోయి ఆదివారం బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం జాతరను ముగించుకుని సోమశిల నుంచి నది గుండా బోట్లలో స్వగ్రామాలకు చేరుకునే భక్తులు సంగమేశ్వరస్వామి శిఖర దర్శనం చేసుకుని తరిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం శ్రీశైలం డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల సంగమేశ్వరుని శిఖరం బయటపడిందని భక్తులు చెబుతున్నారు. -
పులకించిన భక్తజనం
కొత్తచెరువు : వేలాది మంది భక్తుల నడుమ సంగమేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తచెరువులోని బుక్కపట్నం రహదారిలో నిర్వహించిన ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ ధర్మకర్త మనోహర్ ఇంటి నుంచి స్వామి వారికి అలంకరణ వస్తువులు, జెండాను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శివపార్వతులకు పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలోకి తీసుకెళ్లారు. అనంతరం భక్తులు శివ నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు.