పులకించిన భక్తజనం | sangameswara swamy rathothsavam in kothacheruvu | Sakshi
Sakshi News home page

పులకించిన భక్తజనం

Published Wed, May 10 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

పులకించిన భక్తజనం

పులకించిన భక్తజనం

కొత్తచెరువు : వేలాది మంది భక్తుల నడుమ సంగమేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తచెరువులోని బుక్కపట్నం రహదారిలో నిర్వహించిన ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ ధర్మకర్త మనోహర్‌ ఇంటి నుంచి స్వామి వారికి అలంకరణ వస్తువులు, జెండాను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శివపార్వతులకు పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలోకి తీసుకెళ్లారు. అనంతరం భక్తులు శివ నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement