
కొత్తపల్లి: కర్నూలు జిల్లా సప్తనది సంగమంలో వెలసిన శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయ శిఖరం భక్తులకు దర్శనమిచ్చింది. గతేడాది అక్టోబర్‌లో ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి ఒదిగిపోయి ఆదివారం బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం జాతరను ముగించుకుని సోమశిల నుంచి నది గుండా బోట్లలో స్వగ్రామాలకు చేరుకునే భక్తులు సంగమేశ్వరస్వామి శిఖర దర్శనం చేసుకుని తరిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం శ్రీశైలం డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల సంగమేశ్వరుని శిఖరం బయటపడిందని భక్తులు చెబుతున్నారు.