Peaks
-
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్‌లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్‌బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..) -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి విద్యుత్ వాడకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 263.237 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిదేళ్లలో విద్యుత్ వాడకం ఇదే ఎక్కువ కావడం గమనార్హం. విద్యుత్ వినియోగం అధికారుల అంచనాలను మించి ఆల్‌టైమ్ రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఇంధన శాఖ శనివారం విద్యుత్ సరఫరా బులిటెన్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ గతేడాది కంటే 28.24 శాతం ఎక్కువగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 205.266 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరిగింది. రోజులో పీక్ డిమాండ్ 12,738 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 9,960 మెగావాట్లు మాత్రమే. అంటే రోజువారీ పీక్ డిమాండ్ కూడా 27.89 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,968 మెగావాట్లు కాగా.. సాయంత్రం వేళల్లో 9,786 మెగావాట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం జరుగుతున్నప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అత్యధికంగా థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదుకుంటోంది. దీని నుంచి 98.082 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.470 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.592 మి.యూ, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 38.058 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 27.531 మి.యూ, పవన విద్యుత్ ద్వారా 50.125 మి.యూ, సౌర విద్యుత్ నుంచి 22.507 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.6.606 చొప్పున రూ.14.505 కోట్లతో 21.956 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రోజుకు కొనుగోలు చేస్తున్నారు. బిహార్‌లో 5.53 మి.యూ, మహారాష్ట్రలో 2.07 మి.యూ, జార్ఖండ్‌లో 2.22 మి.యూ, హరియాణాలో 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా, అవసరం మేరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి మరీ వినియోగదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
పొలిటికల్ కారిడార్ : టీడీపీ అధినేత చంద్రబాబులో పీక్స్ కు చేరిన అసహనం
-
కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, ముంబై: రెండో దశలో కరోనా మహమ్మారి ఉధృతి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన సంచలన నివేదిను విడుదల చేసింది.రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమదవుతున్న క్రమంలో ఒకవేళ దేశంలో మూడో వేవ్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం అంటూ తాజా నివేదికలో తెలిపింది. ఇందుకు అమెరికా జపాన్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసింది. కరోనావైరస్ కేసులకు సంబంధించి రెండవ వేవ్ కంటే మూడవ వేవ్ పీక్ ఘోరంగా ఉందని రుజువు చేసిందని నివేదిక పేర్కొంది. అలాగే మే మూడవ వారానికి కరోనా వేవ్ పీక్ దశకు చేరుకుంటుందని అంచనావేసింది. అంతేకాదు లాక్డౌన్లకు బదులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే ప్రత్యామ్నాయమని వెల్లడించింది. (భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!) ఫిబ్రవరి 15 నుంచి పీక్ టైమ్‌ను 96 రోజులుగా అంచనా వేసినట్లు ఎస్బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కాంతి ఘోష్ వెల్లడించారు. దీని ప్రకారం మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. భారతదేశంలో ఫిబ్రవరి 21 మధ్యకాలం వరకు రికవరీ రేటు 97.3 కు పెరిగింది కానీ ఆతరువాత పరిస్థితి దిగజారి 85 కి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేట్లు పెరుగుతూ ఉంటే ఇండియాలో మాత్రం వస్తోందని తెలిపింది. ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరినప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుందని ఎస్బీఐ అధ్యయనం పేర్కొంది. అలాగే రోగనిరోధక శక్తిని, హర్డ్ ఇమ్యూనిటి సాధించేందుకు మొత్తం జనాభాకు టీకాలు అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలని, అప్పుడు మాత్రమే ఇతర దేశాలు ఎదుర్కొంటున్నట్లుగా కరోనా వరుస్ వేవ్‌ల ఉధృతిని నివారించగలమని సౌమ్య కాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. (సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్! ) దాదాపు అన్ని రాష్ట్రాలలో పాక్షిక /స్థానిక/వారాంతపు లాక్డౌన్ల పరిస్థితుల నేపథ్యంలో, 2022 ఆర్థిక వృద్ధిని 10.4 శాతానికి సవరించింది. ప్రస్తుత లాక్డౌన్ల కారణంగా రూ .1.5 లక్షల కోట్ల నష్టం సంభవించిందని, ముఖ్యంగా మహారాష్ట్రకు సుమారు 82,000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని తాము అంచనా వేస్తున్నామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని రిపోర్టు తేల్చింది. మధ్యప్రదేశ్‌కు రూ .21,712 కోట్లు, రాజస్థాన్‌కు రూ .17,237 కోట్లు నష్టపోయినట్లు నివేదిక పేర్కొంది. మొదటి దశలో యూపీ, మహారాష్ట్రలో కేసులు ఉధృతమైన తరువాత దేశవ్యాప్తంగా కరోనా మరింత విస్తరించిదని తెలిపింది. తాజాగా మహారాష్ట్రలో కొత్త కేసులు అదుపులోకి వచ్చాయి. కానీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కేసుల పెరుగుతున్నాయి.. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా కఠినమైన చర్యలను అమలు చేస్తే వ్యాప్తిని నియంత్రించవచ్చు. మహారాష్ట్ర పీక్ తరువాత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కేసులు ఫీక్‌కు చేరవచ్చని పేర్కొంది. -
అతి త్వరలో శిఖర స్థాయికి కరోనా
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండోసారి పైకి ఎగబాకుతున్న కరోనా కేసుల సంఖ్య ఈ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఆ తర్వాత మే నెల చివరికల్లా ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని గణితశాస్త్ర నమూనాల ఆధారంగా వేసిన లెక్కలు చెబుతున్నాయి. ‘సూత్రా’అన్న సంక్షిప్త నామం కలిగిన ఈ గణితశాస్త్ర మోడల్.. కరోనా తొలిదశ అంకెల విషయంలోనూ కచ్చితమైన అంచనాలు వెలువరించింది. అప్పట్లో ‘సూత్రా’ ప్రకారం కరోనా కేసులు ఆగస్టులో ఎక్కువ కావడం మొదలుపెట్టి సెప్టెంబర్ నాటికి శిఖర స్థాయికి చేరి ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ 2021 ఫిబ్రవరికి అత్యల్ప స్థాయికి చేరుతాయని లెక్కలేసింది. అచ్చు అలాగే జరిగింది. (కరోనా సెకండ్ వేవ్: వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు) మళ్లీ నిజమయ్యేనా? ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలైన నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణింద్ర అగర్వాల్ తదితరులు ఈ సూత్రా ఆధారంగా కరోనా కేసులపై అంచనా వేశారు. దాని ప్రకారం ఏప్రిల్ మధ్యకల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని తేలింది. ‘ఇటీవల కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే అత్యధిక కేసులు నమోదయ్యే సమయం ఏప్రిల్ 15-20 తేదీల మధ్య ఉంటుందని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నా.. తర్వాతి కాలంలో కేసులు తగ్గే వేగం కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. మే నెల చివరికి కేసుల సంఖ్య అత్యల్పమవుతుంది’అని మణింద్ర అగర్వాల్ తెలిపారు. మూడు అంశాల ఆధారంగా.. కరోనా కేసులు పతాక స్థాయికి చేరేదెప్పుడన్న అంశాన్ని లెక్కకట్టేందుకు సూత్రా గణితశాస్త్ర మోడలింగ్‌లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాధిబారిన పడ్డ ఒక్కో వ్యక్తి ఎంత మంది ఇతరులకు వ్యాధి సోకేలా చేయగలడన్నది ఒకటి. గుర్తించిన కేసులతో పోలిస్తే గుర్తించని కేసులెన్ని అన్నవి మిగిలిన రెండు అంశాలు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ గుర్తించని కేసులూ ఎక్కువవుతాయి. మార్చిలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 50% వరకు పెరిగిందనిగుర్తు చేశారు. దేశంలో సెకండ్ వేవ్ ఉండదని సూత్రా మోడల్ గతేడాది వేసిన లెక్కల్లో పేర్కొంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో కొన్ని అంశాల్లో వచ్చిన మార్పులు కేసుల సంఖ్య మళ్లీ పెరిగేందుకు కారణమై ఉండొచ్చని వివరించారు. ఈ కారణంగానే తాము కొంచెం సమయం తీసుకునికొత్త అంచనాలు రూపొందించామని చెప్పారు. ఇకపై పంజాబ్ వంతు? ప్రస్తుతం దేశం మొత్తమ్మీద రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా ఎక్కువ కావడం మొదలవుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘అతి తక్కువ కాలంలోనే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు ఎప్పుడు చేరతాయన్నది అంచనా వేయడం కొంచెం కష్టమైన విషయమే. ఆ తర్వాత నుంచి మాత్రం కేసులు ఎక్కువ కావొచ్చు.. తక్కువయ్యేందుకూ అవకాశం ఉంది. అయితే ఇదంతా ఏప్రిల్ 15-20 మధ్యలోనే జరుగుతుందని భావిస్తున్నాం’అని వివరించారు. అశోక యూనివర్సిటీ శాస్త్రవేత్త గౌతమ్ మీనన్ వేసిన లెక్కల్లోనూ కేసుల సంఖ్య ఏప్రిల్ 15-మే 15 మధ్యకాలంలోనే పతాక స్థాయికి చేరుతుందని తేలింది. మరోవైపు సెకండ్‌వేవ్‌లో కరోనా మరింత విజృంభిస్తోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో లక్షకుపైగా కేసులు నమోదైనాయి. 1,03,558 కొత్త కేసులు, 478 మరణాలు తాజాగా నమోదు కావడం గమనార్హం. -
మౌంట్ ఎస్పీ
రెండేళ్ల క్రితం రెండు శిఖరాలు, రెండువేల పదిహేడులో మూడు, రెండువేల పద్దెనిమిదిలో రెండు శిఖరాలు.. పద్ధతిగా పాఠాలు విని పరీక్షలు రాసినట్లు, ఒద్దిగ్గా దేశ పతాకాన్ని ఆరుచోట్ల ఆవిష్కరించారు ఆక్టోపస్ ఎస్పీ రాధిక. శిఖరాలను అధిరోహించిన రికార్డులతోపాటు ఆక్టోపస్ ఉద్యోగమూ ఓ రికార్డే. ఆక్టోపస్ విభాగంలో తొలి మహిళా పోలీస్ అధికారి ఆమె.పర్వతారోహణల్లోనూకొన్ని తొలి రికార్డులు సాధించిన రాధిక... ఈ శిఖరాలన్నింటికంటే తండ్రి కోరుకున్న శిఖరాన్ని చేరుకున్నప్పుడే ఎక్కువ సంతోషాన్ని పొందానంటారు! ఏపీ ‘ఆక్టోపస్’ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాధిక పుట్టింది అనంతపూర్, పెరిగింది కడప. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో. తండ్రి కోరిక ప్రకారం ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. ఐదున్నరేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. తండ్రి కోరిక ప్రకారమే గ్రూప్ వన్ అధికారి కావాలనుకున్నారు, పోలీసు అధికారి అయ్యారు. బంగారంలాంటి లెక్చరర్ ఉద్యోగం వదులుకుని పోలీసు ఉద్యోగానికి వెళ్తానంటావా!, ఆడపిల్లకు అంత రిస్క్ ఎందుకు, పైగా మంచి ఉద్యోగం వదులుకుని మరీ రిస్క్ ఎక్కువగా ఉండే ప్రొఫెషన్లోకి పోతారా ఎవరైనా!.. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఇవన్నీ. ‘‘నాన్నకు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ని కావడం ఇష్టం. లైఫ్ చాలెంజింగ్‌గా ఉండటం నాకిష్టం. పోలీస్ ఉద్యోగంతో ఇద్దరి ఇష్టాలు నెరవేరుతాయి’ ఇదీ రాధిక సమాధానం. మౌంటనియరింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటూ.. ‘ఎన్ని శిఖరాగ్రాలు చేరినా నేలకు దిగాల్సిందే, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే’ అన్నారు రాధిక. అన్నింటికంటే నాన్న కోరుకున్నట్లు గ్రూప్ వన్‌కి సెలెక్ట్ అయినప్పుడు నిజంగా శిఖరాన్నధిరోహించిన సంతోషాన్ని పొందాను. నాన్నయితే తాను ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషపడ్డారు. ఆయనకు అంత సంతోషాన్నిచ్చిన దేవుడు.. నన్ను యూనిఫామ్‌లో చూసే వరకు ఆయన్ని ఉంచలేదు. నా అచీవ్‌మెంట్స్‌ను చూస్తున్న అమ్మ... తాను సంతోష పడుతూ నాన్న చూడలేకపోయాడని బాధ పడుతుంటుంది’’ అని ఉద్వేగంగా చెప్పారు రాధిక. భక్తిగా తొలి పర్వతం రాధిక తొలి పర్వతారోహణ హిమాలయాల్లో మానస సరోవర్ యాత్ర. హిమాలయాల మీద ఇష్టంతో ఒక భక్తురాలిగా మాత్రమే మానస సరోవర్ పరిక్రమ చేశానన్నారు. ఆ పరిక్రమకు చాలా మంది పోనీ (పొట్టి గుర్రాలు), పోర్టర్ల సహాయం తీసుకుంటారు. రాధిక తన సామాను తానే మోసుకుంటూ కాలి నడకన పరిక్రమ పూర్తి చేయడం చూసిన తోటి ప్రయాణికురాలు దీప్తి (ముంబయిలో అడ్వొకేట్) ‘ఫిట్నెస్ బాగుంది, మౌంటనియరింగ్ కోర్సు చేయవచ్చు కదా’ అన్న మాటలే రాధికను పర్వతాల బాట పట్టించాయి. మానస సరోవర్ యాత్ర పూర్తి చేసుకుని డ్యూటీకి వచ్చిన తర్వాత రాధిక తన పై అధికారులను పర్వతారోహణకు అనుమతి అడిగినప్పుడు వాళ్లు సంతోషంగా అంగీకరించారు. ‘డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్‌ను ఎంకరేజ్ చేస్తుంటాం. అడ్వెంచర్ స్పోర్ట్ అయిన మౌంటనియరింగ్లోనూ రాణించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నో అంటాం’ అని తెలంగాణ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది ప్రోత్సహించారు. అలా 2013లో కశ్మీర్ రాష్ట్రం, పెహల్గామ్లో మౌంటనియరింగ్ కోర్సులు చేశారు రాధిక. శిక్షణలో భాగంగా గోలప్ కాంగ్రి శిఖరాన్నీ అధిరోహించారు. ఎవరెస్టు అధిరోహణకు ముందు ఐఎమ్ఎఫ్ ఆల్ ఉమెన్ ఎక్స్‌పెడిషన్‌లో మౌంట్ మెంటోసా శిఖరాన్ని చేరుకున్నారు. ఆ శిఖారోహణ చేసిన తొలి దక్షిణ భారత మహిళ రాధిక. తర్వాత కార్గిల్‌లో మౌంట్ కున్ శిఖరాన్ని చేరారు. ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఆమె. ఇవన్నీ ఎవరెస్టు అధిరోహణ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తనకు తాను పెట్టుకున్న పరీక్షలు. ఇక నెక్స్›్ట గోల్ ఎవరెస్టే! హిమాలయాల్లో తరచూ మారే వాతావరణానికి అనుగుణంగా బాడీ తట్టుకోవడం కోసం స్కీయింగ్ కోర్సు కూడా చేశారామె. ‘‘మూడు దశల కోర్సు(బేసిక్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్డ్) కోసం ఆరు వారాల పాటు గడ్డకట్టే చలిలో ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ప్రాక్టీస్ చేయడంతో ఎవరెస్ట్‌ను ఎక్కగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’’ అన్నారు రాధిక. అమ్మా.. నీ కేదయినా అయితే! ‘‘ఎవరెస్టు అధిరోహణకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుంటున్నప్పుడు మా చిన్నవాడు నా దగ్గరగా వచ్చి ‘‘అమ్మా! నీకేదైనా అయితే’’ అన్నాడు. అప్పటికేదో సర్ది చెప్పాను. ఎవరెస్టు ఎక్కే వరకు కూడా ఆ మాట గుర్తు రాలేదు. దిగి వచ్చేటప్పుడు మృతదేహాలు కనిపిస్తాయి. అప్పుడు మా చిన్నవాడి మాటలు గుర్తొచ్చాయి. నిజానికి యుద్ధం ఎలాంటిదో మౌంటనియరింగ్ కూడా అలాంటిదే. యుద్ధరంగంలో అడుగు పెట్టే వరకే ఆలోచించాల్సింది. ఆ తర్వాత యుద్ధం చేయడం ఒక్కటే మన ముందుండే ఆప్షన్. చిన్నప్పటి నుంచి ఆటలు, సైక్లింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం. ప్రతి రోజూ చాలెంజింగ్గానే ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ని, మౌంటనియరింగ్నీ అంతగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఏడు శిఖరాల కోరిక ఆదిలాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్సూచనతో మౌంట్ కిలిమంజారోకి వెళ్లాను. అది పూర్తయిన తర్వాత ఏడు ఖండాలు, ఏడు శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలిగింది. ఆస్ట్రేలియాలో ఎల్తైన శిఖరం కోసియోస్కోతో కలిపి ‘టెన్ అస్సీ పీక్ చాలెంజ్’కి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫండింగ్ ఇచ్చింది. తర్వాత విభజన క్రమంలో ఏపీకి మారాను. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ సహకారంతో యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అంకాకాగువాకి వెళ్లాను. మిగిలిన రెండింటికీ ఏపీ ప్రభుత్వం సహకరించింది. ప్రకృతిదే పై చేయి అలాస్కాలో మౌంట్ దేనాలి పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ప్రకృతి విషమ పరీక్ష పెట్టింది. ఇరవై రోజుల పాటు పాతిక కేజీల బ్యాగ్ మోసుకుంటూ, తాడు పట్టుకుని అరవై డిగ్రీల కోణంలో పర్వతాన్ని ఎక్కిన తర్వాత, ఇక కేవలం 338 మీటర్లు ఎక్కితే సమ్మిట్ పూర్తవుతుందనగా విధిలేక ఆపేయాల్సి వచ్చింది. రాళ్లతో చాచి ముఖం మీద కొట్టినట్లు చిమ్ముతోంది మంచు. వాతావరణం సహకరించే వరకు ఆగక తప్పని స్థితి అది. అప్పుడు కలిగింది మాటల్లో చెప్పలేనంత బాధ. రెండున్నర గంటలు వెదర్ సహకరిస్తే ఆరోహణ పూర్తయ్యేది. మేము విరామం తీసుకున్నప్పుడు మంచు తుపాను రాలేదు. మళ్లీ కదిలిన రోజు వెదర్ వికటించింది. రెండు రోజులు ఉండి ప్రయత్నిద్దామా అంటే... మమ్మల్ని పికప్ చేసుకోవాల్సిన ఫ్లయిట్ వచ్చేసింది. ప్రైవేట్ ఎక్స్‌పెడిషన్ అయితే మరొక చాన్స్ కోసం ఎదురు చూడవచ్చు. కానీ అది చాలా ఖరీదవుతుంది. మాకున్న ఫండింగ్ సరిపోదు. ప్రకృతి నిర్ణయానికి తలవంచాల్సిన పరిస్థితి అది. అప్పుడు వెళ్లిన టీమ్‌లన్నీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. మనమెంత చిన్నవాళ్లమో ‘మౌంటనియరింగ్ వల్ల ఏం సాధిస్తారు’ అనే ప్రాథమిక ప్రశ్న దాదాపుగా ప్రతి మౌంటనియర్కీ ఎదురవుతుంది. పర్వతాన్ని అధిరోహించినప్పుడు మనం ఎంత చిన్న వాళ్లమో తెలుస్తుంది. ఇంత పెద్ద చరాచర జగత్తులో మనం పిపీలికంతో సమానమనే వాస్తవాన్ని తెలుసుకుంటాం. అన్నింటికంటే ప్రధానంగా మనలోని ఇగో తొలగిపోతుంది. మనం ఎందులోనూ అధికులం కాదని తెలుసుకుంటాం. ఇది సమ్మిట్ విఫలమైనప్పుడు కలిగే భావన కాదు, సక్సెస్ అయినప్పుడు కూడా నేర్చుకునే పాఠం ఇదే. ఇలాంటి ప్రతికూల పరిస్థితి గత నెలలో చేసిన ఆరవ ఎక్స్‌పెడిషన్ అంటార్కిటికా విన్సన్లోనూ జరిగింది. అయితే పీక్‌ను చేరుకుని తిరిగి బేస్ క్యాంపుకి వచ్చిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో ఫ్లయిట్ రాలేదు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది రోజులు ఎదురుచూశాం. మాతో తీసుకెళ్లిన రేషన్.. మరో రెండు మూడు రోజులకే వస్తుంది. పది రోజులు రావాలంటే ఉన్నదే సర్దుకుంటూ తిన్నాం. నీటి కోసం మంచు కరిగించుకున్నాం. ఆ ఫ్యూయెల్ కూడా మరీ ఎక్కువేమీ ఉండదు. రోజుకు ఒకటిన్నర– రెండు లీటర్ల నీటితో సరిపెట్టుకున్నాం. వయసు అడ్డంకి కాదు నాతోపాటు అంటార్కిటికాలో విన్సన్ పర్వతారోహణకు వచ్చిన వారిలో నార్వే నుంచి వచ్చిన లీస్జెత్కి 61 ఏళ్లు. కెనడా సిల్వీకి 54, మొరాకో బుష్షాకు 48. మా టీమ్‌లో నేనే చిన్నదాన్ని. నన్ను నలభై దాటాక, ఈ వయసులో పర్వతాలెక్కడానికి వెళ్లడమా అన్న వాళ్లున్నారు. తీరా దేశం బయట అడుగు పెడితే నేను పెద్దదాన్ని కాదు చిన్నదాన్ని అనిపించింది. ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడం చాలా అవసరం. ‘ఎ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ’ అనేది అన్ని కాలాలకూ అన్ని ప్రదేశాలకూ వర్తిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి, జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని నమ్ముతాను. ఇక నా ఫ్యామిలీ అంటారా.. మాది లవ్ కమ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాబట్టి మా వారు (వేణుగోపాల్‌రెడ్డి) దేనికీ అడ్డు చెప్పరు. అన్నింటిలోనూ మంచి సపోర్టును ఇస్తారు’’ – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటో : వి. రూబిన్ బెసాలియల్ పెద్ద గీత ముందు అన్నీ చిన్న గీతలే ప్రకృతి పెట్టే పరీక్షలకు ఓర్చి పర్వతాలెక్కి సాధించేదేమిటంటే... మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, లవ్ బ్రేకప్ అయిందని ఆత్మహత్యకు పాల్పడే వాళ్లకు, అది ఎంత అవివేకమైన పనో తెలియజెప్పాలనిపిస్తుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకోవాలి. సాధించగలిగిన గోల్స్‌ను నిర్దేశించుకోవాలి, వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమ అవసరమో అంతగా శ్రమించాలని అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకు పరిధులు గీయవద్దని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడానికి నన్ను నేను ఉదాహరణగా చూపించుకోగలుగుతున్నాను. – జి.ఆర్. రాధిక, ఎస్.పి, ఆక్టోపస్ విభాగం, ఆంధ్రప్రదేశ్ సప్త పర్వత ఆరోహణ ►మౌంట్ ఎవరెస్ట్ 2016 మే 20 ►మౌంట్ కిలిమంజారో 2016 ఆగస్టు 14 ►మౌంట్ కోసియోస్కో 2017 మార్చి 17 ►మౌంట్ ఎల్బ్రస్ 2017 సెప్టెంబర్ 8 ►మౌంట్ అకాంకాగువా 2017 డిసెంబర్ 30 ►మౌంట్ దేనాలి 2018 జూలై 4 (వాతావరణం సహకరించక శిఖరాన్ని చేరలేదు) ►మౌంట్ విన్సన్ 2018 డిసెంబర్ 16 -
భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వర శిఖరం
కొత్తపల్లి: కర్నూలు జిల్లా సప్తనది సంగమంలో వెలసిన శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయ శిఖరం భక్తులకు దర్శనమిచ్చింది. గతేడాది అక్టోబర్‌లో ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి ఒదిగిపోయి ఆదివారం బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం జాతరను ముగించుకుని సోమశిల నుంచి నది గుండా బోట్లలో స్వగ్రామాలకు చేరుకునే భక్తులు సంగమేశ్వరస్వామి శిఖర దర్శనం చేసుకుని తరిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం శ్రీశైలం డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల సంగమేశ్వరుని శిఖరం బయటపడిందని భక్తులు చెబుతున్నారు. -
ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!
తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను. ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్‌లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల. ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది. ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్‌లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో. ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ, ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్‌లోని మఖ్దూం, రాజ్‌బహదూర్ గౌర్, మొహిత్ సేన్లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా. ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు. మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’ ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే. పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది. - మందలపర్తి కిశోర్ 99122 29931