సాక్షి, ముంబై: రెండో దశలో కరోనా మహమ్మారి ఉధృతి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధన సంచలన నివేదిను విడుదల చేసింది.రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమదవుతున్న క్రమంలో ఒకవేళ దేశంలో మూడో వేవ్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం అంటూ తాజా నివేదికలో తెలిపింది. ఇందుకు అమెరికా జపాన్ వంటి దేశాలలో థర్డ్ వేవ్ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసింది. కరోనావైరస్ కేసులకు సంబంధించి రెండవ వేవ్ కంటే మూడవ వేవ్ పీక్ ఘోరంగా ఉందని రుజువు చేసిందని నివేదిక పేర్కొంది. అలాగే మే మూడవ వారానికి కరోనా వేవ్ పీక్ దశకు చేరుకుంటుందని అంచనావేసింది. అంతేకాదు లాక్‌డౌన్లకు బదులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే ప్రత్యామ్నాయమని వెల్లడించింది. (భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!)
ఫిబ్రవరి 15 నుంచి పీక్ టైమ్‌ను 96 రోజులుగా అంచనా వేసినట్లు ఎస్‌బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కాంతి ఘోష్ వెల్లడించారు. దీని ప్రకారం మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. భారతదేశంలో ఫిబ్రవరి 21 మధ్యకాలం వరకు రికవరీ రేటు 97.3 కు పెరిగింది కానీ ఆతరువాత పరిస్థితి దిగజారి 85 కి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేట్లు పెరుగుతూ ఉంటే ఇండియాలో మాత్రం వస్తోందని తెలిపింది. ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరినప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుందని ఎస్‌బీఐ అధ్యయనం పేర్కొంది. అలాగే రోగనిరోధక శక్తిని, హర్డ్ ఇమ్యూనిటి సాధించేందుకు మొత్తం జనాభాకు టీకాలు అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలని, అప్పుడు మాత్రమే ఇతర దేశాలు ఎదుర్కొంటున్నట్లుగా కరోనా వరుస్ వేవ్‌ల ఉధృతిని నివారించగలమని సౌమ్య కాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. (సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్! )
దాదాపు అన్ని రాష్ట్రాలలో పాక్షిక /స్థానిక/వారాంతపు లాక్‌డౌన్ల పరిస్థితుల నేపథ్యంలో, 2022 ఆర్థిక వృద్ధిని 10.4 శాతానికి సవరించింది. ప్రస్తుత లాక్‌డౌన్ల కారణంగా రూ .1.5 లక్షల కోట్ల నష్టం సంభవించిందని, ముఖ్యంగా మహారాష్ట్రకు సుమారు 82,000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని తాము అంచనా వేస్తున్నామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని రిపోర్టు తేల్చింది. మధ్యప్రదేశ్‌కు రూ .21,712 కోట్లు, రాజస్థాన్‌కు రూ .17,237 కోట్లు నష్టపోయినట్లు నివేదిక పేర్కొంది. మొదటి దశలో యూపీ, మహారాష్ట్రలో కేసులు ఉధృతమైన తరువాత దేశవ్యాప్తంగా కరోనా మరింత విస్తరించిదని తెలిపింది. తాజాగా మహారాష్ట్రలో కొత్త కేసులు అదుపులోకి వచ్చాయి. కానీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కేసుల పెరుగుతున్నాయి.. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా కఠినమైన చర్యలను అమలు చేస్తే వ్యాప్తిని నియంత్రించవచ్చు. మహారాష్ట్ర పీక్ తరువాత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కేసులు ఫీక్‌కు చేరవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment