
ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్
కోల్‌కతా: లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ.. దేశాన్ని రక్షించిందని, కేసుల సంఖ్య అదుపులోనే ఉందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఎంతో సహనం కావాలి. వైరస్ వ్యాప్తి, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న నమ్మకం ఏర్పడక ముందే ఆయుధాన్ని కిందకు దించకూడదు’’ అని రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉంటాయని, డిమాండ్ మాత్రం ఆర్థిక వ్యవస్థలో నిలిచే ఉంటుందన్నారు. ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే వైరస్ త్వరగా అదుపులోకి వస్తుందన్నారు.