సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం తన సేవలపై వివరణ ఇచ్చింది. తమ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తమ సేవల్లో ఎలాంటి అంతరాయం వుండదని ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం ఎండీ పీకే గుప్తా వెల్లడించారు. అయితే కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా సిబ్బందిలో కొరత ఉందని తెలిపారు.
అలాగే ఆయా బ్రాంచ్‌లు పనిచేసే సమయాలను స్వల్పంగా తగ్గించినట్టు చెప్పారు. డిజిటల్ లావాదేవీలు తమ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పీకే గుప్తా సూచించారు. మరోవైపు ఈ కఠినమైన సమయాల్లో దేశానికి సేవ చేయడానికి తమ సిబ్బంది కృషిని గుర్తించి, వందనం చేస్తున్నామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. తమ వినియోగదారులు సురక్షితంగావుంటూ, డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలంటూ వినియోగదారులను ఎస్బీఐ అభ్యర్థించింది.
చదవండి : కరోనా.. జైలు పక్షులకు స్వేచ్ఛ
Comments
Please login to add a commentAdd a comment