కొత్తచెరువు (పుట్టపర్తి) : కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సూర్యనారాయణ భార్య వరలక్ష్మీ(25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన వరలక్ష్మీ, సూర్యనారాయణ వివాహం ఐదేళ్ల కిందట కాగా, ఆమెకు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోందన్నారు. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చే భర్తతో తరచూ ఆమె వాగ్వాదానికి దిగేదన్నారు.
శనివారం రాత్రి 9 గంటల వరకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో షటిల్ ఆడిన సూర్యనారాయణ ఆ తరువాత విధి నిర్వహణలో భాగంగా ఇరగంపల్లిలో జూదరులను పట్టుకునేందుకు వెళ్లాడని చెప్పారు. భర్త ఎంతసేపటికీ రాకపోవంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటిలో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
Published Mon, May 29 2017 12:11 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement
Advertisement