sangaredy
-
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఏడు రక్షణ సంస్థలు జాతికి అంకితం?
కంది(సంగారెడ్డి): రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణరంగ ప్రముఖుల సమక్షంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ ఇతర అధికారులు లైవ్ ద్వారా వీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం)గ్రోత్ అండ్ గ్లోరీ అనే అశంపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎద్దుమైలారం యూనిట్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్, ఏజీఎం శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఏడు కొత్త సంస్థలు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మరింత పట్టుదలతో పనిచేసి కొత్తరకం ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
అనుమానం: ఫోన్ మాట్లాడుతుందని భార్యను కొట్టి చంపాడు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో రమేష్, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్య స్వప్న తరచూ అర్ధరాత్రి వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతుందని భర్త రమేష్ అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి కూడా అదే అనుమానంతో రమేష్ తన భార్య స్వప్నను త్రీవంగా కొట్టాడు. అనంతరం అదే గ్రామంలో ఉన్న స్వప్న తల్లిదండ్రులకు ఆమె ఆనారోగ్యంగా ఉందని తమ ఇంటికి రావాలని తెలిపాడు. స్వప్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చూడగా ఆమె అపస్మరక స్థితిలో కనిపించింది. వెంటనే స్వప్నను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్వప్నను తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలు తట్టుకోలేకనే మరణించిందని ఆమె బంధువులు రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రమేష్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు. స్వప్న మృతితో రుద్రారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
అమీన్పూర్: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను శనివారం ఉదయం బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల చెరువులో శుక్రవారం సాయంత్రం ఈతకని వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మియాపూర్‌లోని స్టాలిన్ నగర్‌కు చెందిన రాజు(15) పదో తరగతి పరీక్షలు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. తరుణ్(16) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. ఇద్దరు స్నేహితుల కలిసి ఈత కొట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతకగా.. చెరువు గట్టుపై దుస్తులు కనిపించాయి. దీంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. శనివారం ఉదయం మత్స్యకారుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.