
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.
దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్‌ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment