muttangi
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
రూ.1.5 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్
పటాన్చెరు: మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో ఓ చిట్టీల వ్యాపారి రూ.1.50 కోట్ల మేర దండుకుని పరారయ్యాడు. రామస్వామి అనే చిట్టీల వ్యాపారి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడంటూ బాధితులు మంగళవారం పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.1.50 కోట్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడని వారు వివరించారు. ఆయన మెదక్ దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన వాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం
-
ముత్తంగి ఎస్బీఐలో అగ్నిప్రమాదం
పటాన్చెరు : పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడటంతో బ్యాంక్‌లోని పలు ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంటలు స్టాంగ్ రూమ్‌కు వ్యాపించకపోవటంతో నగదు, ఆభరణాలు, పలు కీలక ఫైళ్లు భద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.