
రూ.1.5 కోట్లతో చిట్టీల వ్యాపారి పరార్
పటాన్‌చెరు: మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో ఓ చిట్టీల వ్యాపారి రూ.1.50 కోట్ల మేర దండుకుని పరారయ్యాడు. రామస్వామి అనే చిట్టీల వ్యాపారి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడంటూ బాధితులు మంగళవారం పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.1.50 కోట్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడని వారు వివరించారు. ఆయన మెదక్ దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన వాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.