Sangem Mandal
-
2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్
ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సాక్షి, వరంగల్: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్ నరిమేటి రాజేంద్రనాథ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డు నందిహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్ రాజేంద్రనా«థ్‌ను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్‌కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ రాజేంద్రనాథ్ రిజిస్ట్రేషన్ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హనుమకొండలోని రాజేంద్రనాథ్ నివాసం ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్ రాజేంద్రనాథ్ రైతు కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. అనంతరం సంగెం తహసీల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్‌జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను, సీసీ పుటేజీలను సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపారు. ఆది నుంచి అదేతీరు! సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్‌గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం. పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్‌కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్ నుంచి రాజేంద్రనాథ్ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్‌ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం. -
మృతి చెందింది ఒక్కరే..
సాక్షి, వరంగల్ రూరల్: బావిలో జీపు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ఒక్కడే మృతి చెందడంతో ఉత్కంఠ వీడింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం బావిలో జీపు బోల్తా పడగా, అప్పటి నుంచి బుధవారం ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికుల సహాయంతో రాత్రంతా ఆపరేషన్ కొనసాగించారు. జీపులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారని, 11 మంది బతికి బయట పడ్డారని, డ్రైవర్‌తో పాటు మరో నలుగురు జలసమాధి అయ్యారని ప్రచారం జరిగింది. తొలుత డ్రైవర్ సతీష్ మృతదేహం బయటపడింది. దీంతో మరో ముగ్గురి మృతదేహాలు బావిలో ఉంటాయని భావించారు. ఈ మేరకు తెల్లవారుజాము వరకు నీరంతా తోడారు. మృతదేహాలు లభించకపోవడంతో డ్రైవర్ ఒకరే మృతి చెందాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్ సతీష్‌కు ఫిట్స్ రావడమే ఘటనకు కారణమని భావిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. (చదవండి : బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి) మంత్రి ఎర్రబెల్లి ఆరా జీపు బోల్తా పడినప్పటి నుంచి తెల్లవారే వరకు జరుగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గంటగంటకూ స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సహాయక చర్యలు అవసరం ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీసు యంత్రాంగం సేవలు భేష్ గవిచర్లలో వ్యవసాయబావిలో జీపు పడిన వెంటనే స్పందించిన పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. రాత్రంతా నిద్రాహారాలు మాని సహాయక చర్యలు చేపట్టడంపై ఆయన పర్వతగిరి సీఐ కిషన్‌తో పాటుగా ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఫోన్లో అభినందించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : బావిలోకి దూసుకెళ్లిన జీపు
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సంగెం మండలం గవి చర్ల శివారులో ఓ జీపు అదుపు తప్పి బావిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 10 మంది సురక్షితంగా బయటపడగా, మరో నలుగురు బావిలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒంటికి నిప్పంటించుకొని..
సాక్షి, సంగెం: క్షణికావేశంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా..కాపాడబోయిన భర్త తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిన విషాద సంఘటన మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాపులకనిపర్తి గ్రామానికి చెందిన సదిరం మమత అలియాస్ అఖిల(25) అదే గ్రామానికి చెందిన సదిరం అనిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలు సైతం వీరి ప్రేమ అంగీకరించారు. సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా కుమార్తె లాస్య(4), సిద్దార్థ(2)జన్మించారు. కూలీనాలీ చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. కొంత కాలంగా అఖిల మనస్సు స్థిమితంగా లేకుండా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తతో గొడవ పడింది. క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం చుకుంది. మంటల్లో కాలుతున్న అఖిల అరుపులు విన్న అనిల్ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అఖిల 90 శాతం, అనిల్ 50 శాతం గాయపడగా ఇరువురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా అఖిల సోమవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతి చెందింది. అనిల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి కలకొట్ల రాజు ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.నాగరాజు తెలిపారు. చిన్నారులు లాస్య(4), సిద్దార్థ(2)లకు అసలు తమ తల్లితండ్రులకు ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి. తల్లి, తండ్రి ఎందుకు గొడవ పడ్డారో తెలియదు. ఎందుకు కాల్చుకుని గాయపడ్డారో కూడా తెలియదు. తల్లి మృతి చెందిందని, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా తెలియని ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. తల్లి మృతి చెందగా తండ్రి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుండడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. అనాథలుగా మిగిలిన చిన్నారులు -
కోతి చేష్టలకు తెగిన రైల్వే హైటెన్షన్ తీగ
సంగెం: కోతి చేష్టలకు రైల్వే విద్యుత్ కాంటాక్ట్ తీగ తెగిపోయింది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు స్టేషన్ ప్లాట్‌ఫాం లూప్లైన్లో విజయవాడ నుంచి వరంగల్ వైపునకు బొగ్గు లోడ్‌తో వెళతున్న గూడ్స్‌ను క్రాసింగ్ కోసం నిలిపారు. అయితే గూడ్స్ వ్యాగిన్ (నంబర్ 72982) పైకి ఎక్కిన కోతి ఎగురుతూ, విద్యుత్ కాంటాక్టు వైర్‌ను పట్టుకుంది. విద్యుత్ ప్రసారం జరగడంతో మంటలు లేచి తీగ తెగిపడింది. దీంతో రైళ్లు ఎక్కడివక్కడే నిలి చిపోయాయి. సమాచారం అందుకున్న కాజీపేట నుంచి ఇంజినీరింగ్ అధికారులు, నెక్కొండ నుంచి రైల్వే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికరారులు, సిబ్బంది బోగిలో స్టేషన్‌కు చెరుకున్నారు. విదుత్ తీగలను తాత్కాలికంగా జాయింట్ చేశారు. ఇతర స్టేషన్లల్లో నిలిచిపోయిన దర్భాం గా, దురంతో, గరీబ్ రథ్, పాట్నా ఎక్స్‌ప్రెస్‌లతో పాటుగా గూడ్స్ రైళ్లను పంపించారు. అనంతరం తెగిన తీగను పూర్తిస్థాయిలో మరమ్మతు చేశారు.