sankalpam
-
బతుకు బండికి భరోసా!
ఆమె చేస్తున్నది టీజీఎస్ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం. ఆమె భర్త హోంగార్డు.. వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం.. అయితేనేం, థలసీమియా వ్యాధి బారిన పడిన చిన్నారులకు చేతనైన మేరకు అండదండలు అందించాలన్న సంకల్పానికి ఇవేమీ అడ్డంకి కాలేదు. తన సమీప బంధువు కుమారులు థలసీమియాతో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు పడిన వేదనను చూసి చలించి పోయింది. అప్పుడే ఆమె థలసీమియా బాధితులకు చేతనైన సేవ చేయాలని సంకల్పించింది. ఆమె సంకల్ప బలం ముందు తనకు వచ్చే ఆదాయం ఎంత..? తాను ఎలా సాయపడగలననే ఆలోచనలు చిన్నవే అయ్యాయి.ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న ప్రోద్దుటూరి అనిత ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రవిచందర్ సీపీ కార్యాలయంలో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వారి బంధువుల పిల్లలిద్దరూ థలసీమియాతో బాధపడుతూ మృతిచెందారు. ఆ బాలల తల్లిదండ్రులు పడిన వేదనను దగ్గర నుంచి చూసిన అనిత అలాంటి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. గతంలో హెచ్ఐవీపై అవగాహన కల్పించే స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవంతో రక్త సేకరణపై దృష్టి పెట్టారు. ఆమె నిర్ణయానికి కుటుంబం మద్దతుగా నిలిచింది.స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం...థలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ వెళ్లి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు. దీంతో గతంలో అనిత పనిచేసిన ఎ జీవో ద్వారా సేవ చేద్దామని చూసినా.. వీలు కాక΄ోవడంతో వ్యక్తిగత దాతల నుంచి రక్తదానం చేయించడం ద్వారా పిల్లలకు రక్తం ఎక్కించే వారు. ఆ తర్వాత 2010లో ‘సంకల్ప స్వచ్ఛంద సంస్థ’ పేరుతో రిజిస్టర్ చేశారు. తొలుత 25 మందికి ఈ సంస్థ ద్వారా రక్తం ఎక్కించడం ్ర΄ారంభించారు. హైదరాబాద్ వెళ్లి రక్తం ఎక్కించుకోవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని కావడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. దీంతో రక్తదాతల కోసం కాలేజీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాతల భాగస్వామ్యంతో ఇప్పుడు ‘సంకల్ప’ ద్వారా 220 మందికి రక్తం అందుతోంది. ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితమే. 2009 నుంచి ఇప్పటివరకు 500కు పైగా బ్లడ్క్యాంపులతో΄ాటు వ్యక్తిగత దాతల నుంచి 15 వేల లీటర్లకు పైగా రక్తాన్ని సేకరించి చిన్నారులకు అందజేశారు.‘కరోనా’ కాలంలోనూ...కరోనా కష్ట కాలంలోనూ థలసీమియా చిన్నారులకు రక్తం ఎక్కించే ప్రక్రియ నిరాటంకంగా సాగింది. అనిత చేస్తున్న సేవతో స్ఫూర్తి పోందిన అనేకమంది బయటకు రావడానికే భయపడుతున్న ఆ సమయంలోనూ ఆ చిన్నారుల కోసం రక్తదానం చేశారు.సంస్థ ఆధ్వర్యంలో అవగాహన...థలసీమియా అనేది నివారించదగిన వ్యాధి. అలాగే వంశ΄ారంపర్యంగా వస్తుంది. పెళ్లికి ముందు హెచ్‌బీఎ –2 (ఎలక్ట్రో ఫోర్సెస్) పరీక్ష చేయించుకుంటే థలసీమియా వ్యాధితో పుట్టే పిల్లలు లేకుండా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వాలు కూడా పోలియో, ఎయిడ్స్‌పై ప్రచారం చేసినట్లుగా థలసీమియా పరీక్షలపై అవగాహన కల్పించడం లేదు. ఈ క్రమంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 7,500 మంది డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. థలసీమియాపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ర్యాలీ నిర్వహిస్తున్నారు.బోన్ మ్యారో ఆపరేషన్లపై దృష్టి...థలసీమియా రహితం కావాలంటే బోన్ మ్యారో ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇది సామాన్యులకు సాధ్యపడేది కాదు. అయితే చిన్నారులకు ఈ ఆపరేషన్లు చేయించడం పై దృష్టి పెట్టింది సంకల్ప. నామమాత్రపు ధరలతో ఆపరేషన్ జరిగేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ సంస్థ ్రపారంభించిన తర్వాత రక్తం అందక చనిపోయిన వారు లేరంటే సంస్థ సంకల్ప బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.– బొల్గం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంకడుపు కోత తప్పించాలనే...ఓ కుటుంబంలో తలసేమియాతో ఉన్న పిల్లలు పుట్టారంటే వారిని ఎలా కా΄ాడుకోవాలన్నది బాధ చెప్పలేనిది. ఆ నరకం నుంచి తల్లిదండ్రులు బయటపడాలనేది మా సంకల్పం. ప్రస్తుతం ఇది నిర్విఘ్నంగా సాగుతోందంటే దాతల వల్లనే సాధ్యమవుతోంది. నేను కండక్టర్‌గా బస్సులో ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ బస్సు ఎక్కే యువకులకు థలసీమియా గురించి చెప్పి.. రక్తదానం చేయమని కోరేదాన్ని. దాంతో కండక్టర్‌గా నేను ఆ బస్సుకి వస్తే.. నన్ను చూసి భయపడి బస్సు ఎక్కేవాళ్లు కాదు. కొంతకాలం తర్వాత రక్తదానంతో తాము ఒకరికి ్రపాణం పోస్తున్నామని యువకులకు అర్థమైంది. ఇలా మొదలైన ప్రస్థానం యువకుల రక్తదానంతో ముందుకు సాగుతోంది. థలసీమియాతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వం పింఛన్ ఇస్తే వారికి ఉపయోగపడుతుంది. – ్రపోద్దుటూరు అనిత, సంకల్ప స్వచ్ఛంద సంస్థ, ఖమ్మం -
Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర
-
సామాజిక సమతా సంకల్పం సమావేశంలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఈ ఏడాది నా జీవితం పూరిపూర్ణమైంది
‘‘ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను. ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది. నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా... తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది. ఈ పాట సృష్టికర్తల్లో నేను ఒకడిని. నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించిన నిహారిక, ప్రదీప్, సరస్వతిలకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్, జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌ని సత్కరించడానికి ‘తెలుగు జాతీయ చంద్రబోస్’ పేరిట శనివారం హైదరాబాద్‌లో నటుడు ప్రదీప్ ఓ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై చంద్రబోస్‌ని, ఆయçన సతీమణి, నృత్యదర్శకురాలు, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ని సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఆస్కార్, జాతీయ అవార్డు అందుకున్న చంద్రబోస్‌గారికి మా కవి కులం తరఫున అభినందనలు. బోస్‌గారి ప్రయాణం, ప్రస్థానం ఆదర్శవంతంగా ఉంటాయి. ఈ గొప్పదనం, ఆదర్శం ఒక్కరోజులో రాదు. తొలి రోజు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఓ రచయితకు జరిగిన ఈ సన్మానాన్ని అక్షరానికి జరిగిన సన్మానంలా భావిస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు కళాకారులను సన్మానించారు. మురళీమోహన్, ముప్పలనేని శివ, ఎంఎం శ్రీలేఖ, చంద్రబోస్ సోదరుడు రాజేందర్‌తో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొన్నారు. -
సంకల్పంతో ముందడుగు వేయాలి
ప్రతి విద్యార్థి పారిశ్రామిక వేత్తగా ఎదగాలి జేఎన్టీయూకే వీసీ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ గైట్‌లో ప్రారంభమైన సాంకేతిక ఉత్సవాలు వెలుగుబంద (రాజానగరం) : నేడు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి రేపు ఒక మంచి పారిశ్రామికవేత్త కావాలనే సంకల్పంతో ముందడుగు వేయాలని జేఎన్టీయూకే వైస్‌చాన్సలర్ ఆచార్య వీఎస్ఎస్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక గైట్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే సాంకేతిక ఉత్సవాలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్య అనంతరం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇటువంటి సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొనడం వలన పరిజ్ఞానాన్నివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను అపారంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, వాటిని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యం ఉన్నవాడికి ఉపాధికి కొదవ ఉండదన్నారు. అలాగే కొత్తవారితో పరిచయాల ద్వారా విజ్ఞాన్నాన్ని పెంపొందించుకునేందుకు, పరస్పరం పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కారణంగానే ఏటా ఇంజనీర్స్ డే సందర్భంగా తమ కళాశాలల్లో సాంకేతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కళాశాలలో త్వరలో జాతీయ స్థాయిలో ఐటీఐ వర్క్‌షాపును నిర్వహించాలని ప్రిన్సిపాల్స్కి ఆయన సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనల్లో ఒక ప్రత్యేకత ఉండాలని, విన్నూతమైన ఆలోచనలతో కొత్తఒరవడికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఒడిస్సాకు చెందిన బిజూపట్నాయక్ యూనివర్సిటీ విశ్రాంత వీసీ, ఆర్ఎస్బీ మెటల్ టెక్ డైరెక్టర్ డాక్టర్ ఓంకార్‌నాథ్ మహంతి అన్నారు. ఇంజనీరింగ్ డే సందర్భంగా తమ కళాశాలలో ప్రస్తుతం 15వ మేథ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సమావేశానికి అధ్యక్షత వహించిన చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించనున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి తెలిపారు. అలాగే ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్ నిర్వహించి వాహనచోదకుల నుంచి ప్రతిజ్ఞ పత్రాలను తీసుకుంటున్నామన్నారు. సర్ మోక్షగుండంకు నివాళులు ఇంజనీర్ల దినోత్సవం సందర్బంగా భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. గైట్ అటోమొబైల్ ఇంజినీరింగ్ విద్యార్థి తయారు చేసిన బైక్ ట్రాన్స్ఫార్మర్ రోబోను అతిథులు పరిశీలించి, ఆ విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణరాజు, డాక్టర్ కపిలేశ్వరమిశ్రా, వైస్‌ప్రిన్సిపాల్ జగన్నాధరాజు, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, డైరెక్టర్స్ డాక్టర్ ఎల్ఎస్ గుప్త, డాక్టర్ పీఆర్‌కె రాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.