చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీలో శంకర ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలు అప్పు ఉన్నట్లు వారు చెప్పారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. సంఘటనా స్థలానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.