santhakaviti
-
అత్యవసరమా.. అయితే రావొద్దు!
సాక్షి, శ్రీకాకుళం: పీహెచ్‌సీల్లో వైద్య సేవలు తీసికట్టుగా మారాయి. సిబ్బంది కొరతతోపాటు అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు. ఆదివారం అత్యవసర కేసులు వస్తే చేతులెత్తేస్తున్నారు. ఇక్కడ వైద్యులు డుమ్మా కొట్టడం, లేదా ఉదయం వచ్చి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం పాముకాటు, కుక్కకాటు, గర్భిణులు, ప్రమాద కేసులకు అత్యవసర సేవలందడం లేదు. కొన్నిచోట్ల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల్లో, రాజాం సీహెచ్‌సీలో సాక్షి విజిట్ చేయగా, వెలుగు చూసిన అంశాలు ఇవి... రాజాం సీహెచ్‌సీలో.. రాజాం పట్టణంతోపాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, చీపురుపల్లి, తెర్లాం, బలిజిపేట తదితర మండలాలకు రాజాం సీహెచ్‌సీయే ప్రధాన కేంద్రం. ఇక్కడ ఆదివారం ఒకరిద్దరు డ్యూటీ డాక్టర్లు మాత్రమే ఉంటున్నారు. ఈ సమయాల్లో ప్రమాద బాధితులు, గర్భిణులు వంటి అత్యవసర కేసులు వస్తే, రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆదివారం డ్యూటీ డాక్టర్ రవీంద్రబాబుతోపాటు మరో ఐదుగురు సిబ్బంది మాత్రమే కనిపించారు. వంగర మండలం నుంచి వచ్చిన కుక్కకాటు బాధితులకు సేవలందించారు. పలు ప్రాంతాల నుంచి 14 మంది మాత్రమే ఓపీ విభాగంలోనూ, అత్యసవర సేవలు నిమిత్తం వచ్చారు. బొద్దాంలో.. రాజాం మండల పరిధి బొద్దాం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ ఆదివారం ఒకరు తమ వంతు డ్యూటీ వేసుకుని సేవలందిస్తున్నారు. ఆదివారం వైద్యులు ఉండటం లేదు. హెల్త్ సూపర్వైజర్లు ఎం సావిత్రి, డీవీ నిర్మలదేవి మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ఆస్పత్రికి పది మంది వరకూ వచ్చిన రోగులకు సాధారణ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడకు వైద్యులు వస్తారని రోగులు వాపోతున్నారు. వీరు కాకుండా ఆదివారం మరో నలుగురు ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు ఇక్కడ లేకపోవడంతో రోగులు రాజాం వెళ్తున్నారు. సంతకవిటి పీహెచ్సీలో.. సంతకవిటి పీహెచ్సీలో ఆదివారం వైద్యాధికారి గట్టి భార్గవి హాజరయ్యారు. ఒకరిద్దరు రోగులు మాత్రమే రాగా వీరికి వైద్యాధికారిని ఆరోగ్య తనిఖీలు చేసి మందులు అందించారు. అత్యవసర సేవలకు సంబంధించి మందులు అందుబాటులో లేవు. ప్రసూతి పరికరాలు, పలు రకాల వైద్య పరికరాలు ఇక్కడ లేవు. దీంతో అత్యవసర సమయంలో రోగులను రాజాం తరలిస్తున్నారు. దారుణంగా వైద్య సేవలు.. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో గ్రామాల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి తోడు గర్భిణులు, ప్రమాద బాధితులు, అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 108 వాహన సేవలు గత ప్రభుత్వం కంటే అధికంగా అందుతున్నాయి. ఆశా కార్యకర్తల సేవలు విస్తృతం చేసి సకాలంలో రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దారుణంగా ఉంది. రేగిడిలో... రేగిడి పీహెచ్సీలో అత్యవసర వైద్యసేవలకు మందులు అందుబాటులో లేవు. దీంతో ప్రమాద బాధితులు, గర్భిణులు, పాముకాటు బాధితులు ఇక్కడకు వస్తే రాజాం తరలిస్తున్నారు. ఆదివారం ఈ సేవలు మందగిస్తున్నాయి. వైద్యాధికారి స్వర్ణలత రోగులకు ఆరోగ్య పరీక్షలు అందించారు. ఓపీలో 12 మంది హాజరుకాగా, కొంతమందికి ఇక్కడ మందులు అందజేశారు. మిగిలినవారిని రాజాం తరలించారు. వంగర పీహెచ్సీలో అంతే.. వంగర పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవుపై ఉండగా మరొకరిని నియమించలేదు. దీంతో సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. ఆదివారం సీహెచ్‌వో బీ భాస్కరరావు, ల్యాబ్‌టెక్నీషియన్ దమయంతి, హెల్త్‌అసిస్టెంట్ వెంకన్న విధుల్లో ఉన్నారు. పొగిరి పీహెచ్సీ వైద్యుడు ఆకిరి భార్గవ్ ఇక్కడకు ఇన్చార్జి వైద్యుడిగా ఉండటంతో రెండు చోట్ల విధులకు హాజరుకాలేని పరిస్థితి. హెచ్వీ, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టు, అటెండర్‌తోపాటు ఆరోగ్య సిబ్బంది ఆదివారం విధులకు హాజరు కాలేదు. రోగులకు హెల్త్ అసిస్టెంట్ వెంకన్న, సీహెచ్‌వో భాస్కరరావు వైద్యసేవలందించారు. సిబ్బంది కొరతతో సేవలు డీలాపడుతున్నాయి. -
పార్టీ మారినందుకు వెంటబడి కొట్టారు
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామం టీడీపీకి కంచుకోట. ఈ పంచాయతీకి నాయకత్వం వహిస్తున్న గండ్రేటి కేసరి ప్రస్తుతం వైస్ ఎంపీపీ(టీడీపీ)గా ఉంటున్నారు. ఇటీవల ఈ గ్రామంలో టీడీపీలో చీలికలు వచ్చాయి. గ్రామానికి చెందిన ముద్దాడ రాములు, ముద్దాడ జోగులు, దాసరి సూర్యారావు, సింహాచలం, కిక్కర సూర్యారావు, ముద్దాడ దుక్కన్న, ముద్దాడ బాలకృష్ణ ముద్దాడ వీరన్న తదితరులుతోపాటు మరో 20 కుటుంబాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముందు వైఎస్సార్సీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ చేరికలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గట్టిగానే అడ్డుకున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనకు ఆకర్షితులై వీరంతా ఈ నెల 24న వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహన్రావు సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటి నుంచి గ్రామంలో వీరిపై టీడీపీ వాళ్లు కక్షకట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో చిన్నపాటి అలజడి కూడా రేగింది. ఈ గ్రామానికి చెందిన దాసరి సూర్యారావు వైఎస్సార్సీపీలో చేరగా.. అతని సోదరుడు రాంబాబు టీడీపీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం వైఎస్సార్సీపీకి చెందిన దాసరి రాములమ్మ ఇంటి వద్ద మిగిలిన అన్నం పారబోసిన విషయంలో రాములమ్మకు, రాంబాబు భార్య లక్ష్మికి మధ్య వివాదం చెలరేగింది. రాములమ్మ సోదరుడు బాలకృష్ణ అక్కడకు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తుండగా అదునుకోసం కాచుకుని ఉన్న గండ్రేటి కేసరి, పాలిన చిన్నారావు, వంకల తవుడు, ఇలిస వీరన్న, అలబోయిన రామకృష్ణ, పాలిన చినపాపారావు, పాలిన అప్పన్న, పాలిన సింహాద్రి, వంకల రామకృష్ణ, ముద్దాడ తవుడు, ముద్దాడ సురేష్, వంజరాపు అర్జునరావు, వంజరాపు చినవెంకటరావు, ఎల్లంకి సూర్యారావు, ఇలిసి పండోడు తదితరులు ముద్దాడ బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా ఇంటివరకూ వెళ్లి దాడిచేశారు. గ్రామంలో ఉంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యారావు ఇళ్లపై కూడా దాడిచేసి తలుపులు, పర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ముద్దాడ బాలకృష్ణ భుజానికి బలమైన గాయమైంది. దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్న, ముద్దాడ వీరన్నలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. దాడి నుంచి తప్పించుకున్న దుక్కన్న గాయాలతో బయటపడి పక్కనే ఉన్న కొండగూడేం పంచాయతీకి చేరుకుని అక్కడి సర్పంచ్ కెంబూరు సూర్యారావు ఇంటి వద్ద తలదాచుకున్నాడు. అక్కడి నుంచి సంతకవిటి పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న సంతకవిటి పోలీసులతో పాటు రాజాం రూరల్ సీఐ పి.శ్రీనివాసరావు కృష్ణంవలస చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు దాడికి పాల్పడినవారి వివరాలు సేకరించారు. బాధతులు వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఫోన్ ద్వారా మరిన్ని వివరాలు సేకరించడమే కాకుండా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. పాలకొండ డీఎస్పీ జి.ప్రేమ్‌కాజల్ కృష్ణంవలస గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాజాం రూరల్ సీఐ తెలిపారు. పక్కా ప్లాన్‌తోనే... తీవ్ర గాయాలుపాలైన ముద్దాడ బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై 15 మంది దాడి చేసినట్లు పేర్కొన్నాడు. సంతకవిటి వైస్ ఎంపీపీ(టీడీపీ) గండ్రేటి కేసరి ప్రధాన పాత్ర ఉందని ఫిర్యాదులో ఆరోపించాడు. గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని వాపోయాడు. వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన వైఎస్సార్సీపీ కార్యకర్తలుపై దాడిచేయడాన్ని ఆ పార్టీ సంతకవిటి మండల నాయకులు, రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహన్రావుతో పాటు పలువురు సంతకవిటి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. -
అధికార పంతం.. ప్రతిపక్ష పోరాటం
సంతకవిటి శ్రీకాకుళం : సంతకవిటి మండల కేంద్రంలో అధి కార పార్టీ తీరుకు నిరసనగా జనం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలవడంతో పాటు న్యా యం చేశారు. అర్హులకు అందకుండా ఉండిపోయి న పింఛన్లను వారికి అందించారు. మండలానికి కొత్తగా మంజూరు చేసిన 653 పింఛన్ల పంపిణీని అధికార పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నిం చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్మోహనరా వు, మండల కన్వీనర్ గురుగుబెల్లి స్వామి నాయు డు, ఎంపీటీసీ సభ్యులు కనకల సన్యాశినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు తదితరులు దీనిపై పో రాడారు. కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు ఎలా గైనా నిర్ణీత గడువులోగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నెల 9వ తేదీలోగా వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, అధికారులను అడ్డంపెట్టి జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు కలుగుజేసుకుని పంపిణీకి పట్టుబట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రజావేదిక నిర్వహించి ఈ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కొత్తగా మంజూరైన పింఛన్లను కొందరి ఒత్తిళ్ల మేరకు అధికారులు ముందు ఇవ్వలేదు. ఎమ్మెల్యే గట్టిగా పట్టుబట్టడంతో పింఛన్ల పంపిణీకి ఒప్పుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పూడు అక్కమ్మ, వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరిలు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు వీరి చేతులమీదుగా కూడా ఫించన్ల పంపిణీని సంతకవిటి ఎంపీడీఓ బి.వెంకటరమణ నిర్వహించారు. పంపిణీ కార్యక్రమం అంతా అయ్యే వరకు జనమంతా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు. న్యాయ పోరాటం తప్పదు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మా ట్లాడుతూ రాష్ట్రం అంతా టీడీపీ పార్టీ అధికార దు ర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. సంతకవిటి మండలంలో నీచ రాజకీయాలు, ఆర్థిక నేరాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ఎలాం టి పదవులు లేని వారు కూడా పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తమకు నచ్చని వ్యక్తులు ఉంటే వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కొంతమంది అర్హులు ఉండిపోయారని, వీరంతా జన్మభూమి కమిటీల కారణంగా నష్టపోయారని అన్నా రు. వీరికి కూడా న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సుదీర్ఘ అనుభవం అని చెప్పుకుంటున్న సీఎంకు ఎంత మంది దొంగలతో సంబంధాలు ఉన్నాయో జనానికి తెలుస్తుందన్నారు. టీడీపీ వారు రాష్ట్రా న్ని పూర్తిగా ధ్వంసం చేయకమునుపే జనం మేలు కోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సర్పంచ్‌లు కెంబూరు సూర్యారావు, మొ య్యి మోహనరావు, ఎన్ని శ్రీనివాసరావు, దవళ సీతమ్మ, వావిలపల్లి రమణారావు, మాజీ ఎంపీటీసీ డోల తిరుపతిరావు, వావిలపల్లి సమీర్నా యు డు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, రూపిటి చిన్నప్పలనాయుడు, రెడ్డి స్వామి నాయు డు, కంచరాపు వెంకటరమణారావు, గురువు సింహాచల, నర్శింహమూర్తి, ఉపసర్పంచ్ వి.శ్రీనివాసరావు, కొప్పల ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ యడ్ల రామకృష్ణ, బగాది వెంకటరమణ, భుజంగరావు, పీఏసీఎస్ డైరెక్టర్ గురుగుబెల్లి గవరయ్య, నాయకులు, చిన్నప్పలనాయుడు, బగాది వెంకటరమణ, వావిలపల్లి శ్రీనివాసరావు, పప్పల గణపతి, యడ్ల రామకృష్ణ, గురువు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
సంతకవిటిలో కిడ్నాప్ కలకలం?
♦ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు ♦ శ్రీకాకుళంలో ప్రత్యక్షం ♦ కిడ్నాప్ చేశారని చెప్పిన విద్యార్థులు ♦ తోసిపుచ్చిన పోలీసులు సంతకవిటి: మండల కేంద్రంలో బుధవారం కిడ్నాప్ కలకలం చెలరేగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం..తరువాత శ్రీకాకుళంలో ప్రత్యక్షం కావడం ఆందోళనకు దారితీసింది. అదృశ్యమై శ్రీకాకుళంలో ప్రత్యక్షమైన విద్యార్థులు తాము కిడ్నాప్‌కు గురయ్యామని తల్లిదండ్రులకు చెప్పడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే... గరికిపాడు గ్రామానికి చెందిన కిల్లారి వందన, మజ్జి రాజులు సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఉదయం ఇంటర్వల్ సమయంలో వీరు బస్ పాసుల లామినేషన్ చేయించేందుకు సంతకవిటిలోని ఓ జిరాక్స్ షాపు వద్దకు వెళ్లి వస్తుండగా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం భోజన సమయంలో వీరు పాఠశాలలో లేకపోవడంతో హెచ్ఎం ఎ.త్రినాధరావు ఆరా తీశారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఈలోగా సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురైనట్టు హెచ్ఎం, తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న హెచ్ఎం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరా తీసిన పోలీసులు ఈ విషయాని సున్నితంగా తోసిపుచ్చారు. తల్లిదండ్రులు చెప్పిన వివరాలు... అదృశ్యమైన విద్యార్థుల్లో కిల్లారి వందన తండ్రి ధర్మారావు సాక్షితో మాట్లాడుతూ తమ కుమార్తెతో పాటు మరో విద్యార్థిని మజ్జి రాజులు ఎప్పట్టిలాగే బుధవారం ఉదయం సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళారని, సాయంత్రం నాలుగు గంటలు సమయంలో తమ కుమార్తె ఫోన్ చేసిందని, తాను శ్రీకాకుళంలో పెదనాన్న ఇంటి వద్ద ఉన్నానని ఏడుస్తూ చెప్పినట్లు తెలిపారు. తనతో పాటు మజ్జి రాజు సంతకవిటిలో తమ బస్‌పాస్‌లు లామినేషన్ చేయించేందుకు వెళ్లగా తెల్లటి కారులో నలుగురు వ్యక్తులు తమను కారులోకి లాగేసి చేతులు కట్టేయడంతో పాటు నోటికి ప్లాస్టర్లు అంటించారని, శ్రీకాకుళం తీసుకెళ్తుండగా శ్రీకాకుళం దగ్గర్లో టోల్ ఫ్రీ గేటు వద్ద రోడ్డుపై పోలీసులు చెక్ చేసిన సమయంలో వదిలి వేసినట్లు తెలిపారని చెప్పారు. వీరు తనసోదరుడైన కిల్లారి సీతారాం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఫోన్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై సంతకవిటి పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ చంద్రినాయుడు వద్ద సాక్షి ప్రస్తావించగా విద్యార్థులు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని తాము పరిశీలనలోకి తీసుకున్నప్పటకీ పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. హైవేలో చెక్ చేసిన సమయంలో వీరు దొరికితే స్టేషన్‌కు అప్పగిస్తారని, తమకు సమాచారం అందిస్తారని, అటువంటి సమాచారం జిల్లాలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. -
పల్లెకు చేరిన ఈ-పాలన
సంతకవిటి : పంచాయతీ ల్లో ఈ పాలన మొదలైంది. దీంతో గ్రామీణ ప్రజలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో కొన్ని పంచాయతీలో ప్రారంభమైన ఈ ప్రక్రియ దశలవారీగా అన్ని పంచాయతీలకు విస్తరించనుంది. ఇప్పటివరకూ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణతోపాటు అన్ని రకాల పనులు రాతకోతల రూపంలోనే జరుగుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండే ది కాదు. కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందిరపై రుద్దేవారు. ఈ పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపరచడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఏం జరుగుతుందన్నది ఎవరైనా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అక్రమాలను అరికట్టగలగడంతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వీలవుతుంది. పంచాయతీ కార్యదర్శుల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ మూసి ఉండే గ్రామసచివాలయాలు ఇక నుంచి 365 రోజులు ప్రజలకు సేవలందించనున్నాయి. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలు ఉండగా తొలిదశగా ప్రస్తుతం 87 పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. సంతకవిటి మండలంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా ఆరు పంచాయతీల్లో వీటిని గత నెలాఖరు నుంచే ప్రా రంభించారు. మందరాడ, వాసుదేవపట్నం, సంతకవిటి, మామిడిపల్లి, బొద్దూరు, గుళ్లసీతారాంపురం పంచాయతీలు ఆన్లైన్లో చేరాయి. ఈ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు ఉన్నచోటనే కంప్యూటర్లు ఏర్పా టు చేశారు. పక్కా భవనాలు లేని ప్రాం తాల్లో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిం చేందుకు చర్యలు చేపడుతున్నామని సంతకవిటి ఎంపీడీవో ఎ.త్రినాథస్వామి తెలి పారు. నెట్లో సమాచార సమస్తం ఈ సేవలు ప్రారంభించిన పంచాయతీల కు సంబంధించిన సమస్త సమాచారం, వాటి పరిధిలో లభించే సేవల వివరాలన్నీ ంటర్నెట్లో సంబంధిత పంచాయతీ వెబ్సైట్లో లభ్యమవుతాయి. పంచాయతీలోని వార్డులు, ఓటర్లు, జానాభా వివరాలు, స్త్రీలు, పురుషులు, పిల్లల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు, జనన, మరణ వివరాలు, ధ్రువీకరణ పత్రా ల జారీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆన్లైన్లోనమోదవుతుంటాయి. అలాగే పంచాయతీల ఆస్తులు, పన్నుల వివరాలు, విని యోగ ఫలితాలు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిధుల మంజూరు, వినియోగ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
వివాహేతర సంబంధాలతోనే వివాదాలు
సంతకవిటి : వివాహేతర సంబంధాల కారణంగానే గ్రామాల్లో గొడవలు ఏర్పడి క్రైం రేటు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. శనివారం సంతకవిటి పోలీస్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. తొలుత పోలీస్ క్వార్టర్స్‌లోకి వెళ్లి వర్షాలకు కారుతున్న గదులను పరిశీలించారు. 2003లో నిర్మాణం జరిగి ఉండడంతో మరో నాలుగేళ్ల వరకూ మరమ్మతులకు అవకాశం లేదన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో తలెత్తే వివాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు రావడమే కాకుండా, పిల్లల భవిష్యత్ నాశనం అవుతోందని..ఈ విషయూన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇచ్ఛాపురం నుంచి విజయనగరం సరిహద్దు వరకూ హైవేలో నాలుగు పెట్రోలింగ్ బృందాలు తిరుగుతూ డ్రంక్ కమ్ డ్రైవ్ చేసేవారిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అలాగే పోలీసు విభాగంలో హైవేలో రెండు అంబులెన్స్‌లు నడుపుతున్నామన్నారు. జిల్లాలో శాంతి భద్రతులు అదుపులో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. దోపిడీలు కూడా తగ్గాయన్నారు. ఇటీవల రెండు చోట్ల భారీ చోరీలు జరిగాయని, వాటికి పాల్పడిన నిందితుల ఆచూకీ కొలిక్కివచ్చిందన్నారు. జిల్లాలో 30 మంది కానిస్టేబుళ్ల కొరత ఉందన్నారు. పుల్లిట, తాలాడ గ్రామాల్లో మాజీ నేరస్తుల కుటుంబాలపై దృష్టిసారించి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామని, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎస్ఐ పి.సురేష్‌బాబు ఉన్నారు.