`నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై నెలరోజుల్లో నివేదిక`
అనంతపురం: నాందేడ్ ఎక్స్ప్రెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా ఘటనపై 39మందిని విచారించామని, నెలరోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను ఇస్తామని రైల్వే సేఫ్టీ కమిషనర్ సంతోష్మిట్టల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు వద్ద శనివారం తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ప్రెస్లో జరిగిన అగ్నిప్రమాదంలో 26మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని సంతోష్మిట్టల్ చెప్పారు. గత ఏడాది జరిగిన పెనుకొండ ప్రమాదంపై కూడా నివేదికను ఎప్పుడో అందజేసినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సరైన భద్రతా ప్రమాణాలు అందులో సూచించామని రైల్వే కమిషనర్ సంతోష్మిట్టల్ తెలిపారు.