sarangapoor
-
భర్తను కాదని ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. చివరికి
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తను కాదని మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరికి వరకట్నం వేధింపులకు నిండు జీవితం బలైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం..సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన నలువాల నర్మద (22) అనే వివాహిత యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. గతంలో పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసింది. అంతలోనే భర్త, అత్త , బావలు వరకట్నం వేధింపులకు గురి చేయడంతో తల్లిగారింటికి వచ్చి ఉరి వేసుకుంది. (నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ) జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్‌ని నర్మద ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలలపాటు వీరిదాంపత్యం సాఫీగానే సాగింది. వరకట్న వేధింపులు నర్మదను కష్టాల్లోకి నెట్టాయి. భర్త శ్రీనివాస్‌తోపాటు, అత్త నలువాల లక్ష్మీ, బావ నలువాల అనిల్ రూ.2 లక్షలు తీసుకురావాలని వేధించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నర్మద కుటుంబసభ్యులకు చెప్పగా పెద్దల సమక్షంలో చర్చించి కాపురం సాఫీగా సాగేలా చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. మార్చిలో నాగునూర్ గ్రామంలో తల్లిగారింటికి రాగా శుక్రవారం భర్త శ్రీనివాస్ గ్రామానికి వచ్చి నర్మదను దూషించాడు. గ్రామస్తులంతా గమనిస్తుండగానే తిడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్మద ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీస్‌వాహనంలో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సారంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించారు. నర్మద భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీ, బావ అనిల్ ముగ్గురిపై మృతురాలి తల్లి అరికిల్ల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. (‘కబీర్ సింగ్’ చూసి.. అమ్మాయిలకు ఎర! ) అదృశ్యమై...చెట్టుకు ఉరేసుకొని.. సైదాపూర్(హుస్నాబాద్): ఐదురోజులక్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఐదురోజులకు చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో నల్లకుంటప్రాంతంలో శుక్రవారం సంఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ పోలీసులు, గ్రామస్తుల ప్రకారం..ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన చిక్కుల కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు చిక్కుల మొగిలి(35)కి పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఓ మహిళతో వివాహం జరిగింది. మొగిలి చిన్నప్పుడు 7వతరగతి అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఏడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో దొరికాడు. అప్పటినుంచి హైదరాబాద్–ఎగ్లాస్పూర్ వస్తూపోతుంటాడు. (యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి ) పదేళ్లక్రితం హైదరాబాద్ యువతితో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. మార్చిలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో ఎగ్లాస్పూర్ వచ్చారు. నెలక్రితం భార్య హైదరాబాద్ వెళ్లింది. మొగిలి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఇంటి వద్ద గుంట స్థలం ఇటీవలే విక్రయించిన తండ్రి కొమురయ్య అప్పులు తీర్చాడు. కాగా మొగిలి మద్యానికి బానిసై ఈ నెల 25న సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి రేకొండ వైపు వెళ్లాడు. మొగిలి కనిపించడం లేదని ఈ నెల 28న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఎగ్లాస్పూర్ గ్రామ శివారులోని నల్లకుంట ప్రాంతంలో గొర్రెల కాపరులు చెట్టుకు ఉరేసుకొని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. సైదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి పిల్లలు లేరు. -
‘మోడల్’ విద్య అందని ద్రాక్షేనా..?
సారంగాపూర్ : మండలంలోని విద్యార్థులకు ‘మోడల్’ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలకు మోడల్ పాఠశాలలు మంజూరైనా సారంగాపూర్‌లో మాత్రం ఏర్పాటు కాలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో మండల విద్యార్థులకు అడ్మిషన్లు దక్కడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మోడల్‌స్కూల్ ప్రత్యేకత మోడల్‌స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసినప్పటిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వీటి నిర్వాహణ కొనసాగుతుంది. ఇక్కడి విద్యార్థులకు బోధన పరంగా ఉన్నత ప్రమాణాలతో విద్య అందుతుండడంతో విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీపడుతున్నారు. కానీ సారంగాపూర్ మండల విద్యార్థులకు అవకాశం దక్కడం లేదు. మండల విద్యార్థులకు నో అడ్మిషన్లు ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి తరగతిలో 100 సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడానికి నిర్వహించే పరీక్షల్లో, స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి 1100 మంది పరీక్షలు రాశారు. ఇందులో కేవలం అడ్మిషన్లు పొందినది 100 మంది విద్యార్థులు మాత్రమే. మంజూరైనా.. ఏర్పాటు కాలేదు సారంగాపూర్‌కు మోడల్‌స్కూల్ మంజూరైనా స్థల సేకరణ జరిపినా, సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో మోడల్‌స్కూల్ ఏర్పాటు రద్దైయింది. ఇప్పటికైనా మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్ష రాసినా పట్టించుకోలేదు గతేడాది తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందడానికి పరీక్ష రాసినా, మాకు కనీసం ఫలితం ఏమి అన్నది అధికారులు సమాదానం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాదానం రాలేదు. మాకు మోడల్స్కూల్లో చదవాలని ఉంది. అధికారులు మాకు అవకాశం కల్పించాలి. – యశ్వంత్, సారంగాపూర్ మాకు అడ్మిషన్లు ఇవ్వాలి మాకు మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలి, మా దగ్గర మోడల్‌స్కూల్ లేదు. మాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల మోడల్స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలించాలి. – కస్తూరి వెంకటేష్, సారంగాపూర్ ప్రభుత్వం సీట్లు పెంచితే అడ్మిషన్లు ఉన్న సీట్లకోసం విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మరిన్ని సీట్లు పెంచితే కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి పరిశీలిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈవో -
హరితహారంలో సారంగా‘పూర్’
సారంగాపూర్ : హరితహారంలో సారంగాపూర్ వెనుకబడి ఉందని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండలపరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్వామా ఏపీడీ కుందారపు లక్ష్మీనారాయణ నిర్దేశించిన లక్ష్యాన్ని పదిరోజుల్లో ఎలా పూర్తిచేయాలన్న విషయంపై చర్చించారు. ఎంపీపీ శారద, ప్రత్యేకాధికారి అంబయ్య, ఎంపీడీవో పుల్లయ్య, ఈజీఎస్ ఏపీవో అంకూస్ అహ్మద్ పాల్గొన్నారు. విఫలం అయింది ఇలా.. ప్రారంభంలో మండల అధికారికి ఒక గ్రామాన్ని అప్పగించారు. హడావుడిగా మెుక్కలు నాటడం మెుదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీæ సెంటర్లు, పాఠశాలలు, రైతుల పంట పొలాల గట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. గడువు ముగిసే సమయానికి సగం లక్ష్యం చేరలేదని గుర్తించారు. మండలంలో మొత్తం 22 గ్రామాల్లో ఉపాధి పథకం కింద మూడు లక్షల నుంచి మూడు లక్షలయాభైవేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం లక్షాయాభై వేల మొక్కలు మాత్రమే నాటారు. జిల్లాలో అన్ని మండలాలకంటే సారంగాపూర్ వెనుకబడడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అటవీశాఖ పరిధిలోని ఖాళీ భూములను మంగేళ, బట్టపల్లి, బీర్పూర్, పోతారం, రంగసాగర్, సారంగాపూర్, రంగపేట గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా నాటించడానికి ఆ శాఖ అనుమతినిచ్చింది. బీడుగా ఉన్న రెవెన్యూ భూముల వివరాలు ఇవ్వాలని ఏపీడీ ఆదేశాలు జారీ చేశారు. 22 గ్రామాల్లో 11 గ్రామాలను ఎంపీడీవో పుల్లయ్య, 11 గ్రామాలను తహసీల్దార్ వెంకటరమణ పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీరోజు 20 వేల గుంతలు తీయాలని, మొత్తం 1.50 నుంచి 2 లక్షల మొక్కలు పది రోజుల్లో నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్యం చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
విషజ్వరంతో ఒకరి మృతి
సారంగాపూర్ : మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన కళ్లాళ శంకర్(45) విషజ్వరంతో మంగళవారం మృతిచెందాడు. శంకర్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జగిత్యాలలోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయినా తగ్గలేదు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.