సారంగాపూర్ : మండలంలోని విద్యార్థులకు ‘మోడల్’ విద్య అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలకు మోడల్ పాఠశాలలు మంజూరైనా సారంగాపూర్‌లో మాత్రం ఏర్పాటు కాలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్‌లో మండల విద్యార్థులకు అడ్మిషన్లు దక్కడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
మోడల్‌స్కూల్ ప్రత్యేకత
మోడల్‌స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసినప్పటిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వీటి నిర్వాహణ కొనసాగుతుంది. ఇక్కడి విద్యార్థులకు బోధన పరంగా ఉన్నత ప్రమాణాలతో విద్య అందుతుండడంతో విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీపడుతున్నారు. కానీ సారంగాపూర్ మండల విద్యార్థులకు అవకాశం దక్కడం లేదు.
మండల విద్యార్థులకు నో అడ్మిషన్లు
ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి తరగతిలో 100 సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడానికి నిర్వహించే పరీక్షల్లో, స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పొందడానికి 1100 మంది పరీక్షలు రాశారు. ఇందులో కేవలం అడ్మిషన్లు పొందినది 100 మంది విద్యార్థులు మాత్రమే.
మంజూరైనా.. ఏర్పాటు కాలేదు
సారంగాపూర్‌కు మోడల్‌స్కూల్ మంజూరైనా స్థల సేకరణ జరిపినా, సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో మోడల్‌స్కూల్ ఏర్పాటు రద్దైయింది. ఇప్పటికైనా మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పరీక్ష రాసినా పట్టించుకోలేదు
గతేడాది తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందడానికి పరీక్ష రాసినా, మాకు కనీసం ఫలితం ఏమి అన్నది అధికారులు సమాదానం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాదానం రాలేదు. మాకు మోడల్‌స్కూల్‌లో చదవాలని ఉంది. అధికారులు మాకు అవకాశం కల్పించాలి.
– యశ్వంత్, సారంగాపూర్
మాకు అడ్మిషన్లు ఇవ్వాలి
మాకు మోడల్‌స్కూల్‌లో అడ్మిషన్లు ఇవ్వాలి, మా దగ్గర మోడల్‌స్కూల్ లేదు. మాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల మోడల్‌స్కూల్‌లో అడ్మిషన్లు ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలించాలి.
– కస్తూరి వెంకటేష్, సారంగాపూర్
ప్రభుత్వం సీట్లు పెంచితే అడ్మిషన్లు
ఉన్న సీట్లకోసం విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మరిన్ని సీట్లు పెంచితే కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి పరిశీలిస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment