saraswathi lands
-
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ పై హైకోర్టు స్టే
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా సరస్వతి భూముల వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట రమణా రెడ్డి, వేణుగోపాల రాజులతోపాటు మరికొంతమంది అరెస్ట్‌పై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయరాదని కోర్టు తెలిపినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ** -
రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం
గుంటూరు: సరస్వతి భూముల విషయంలో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అందుకు నిరసనగా దాదాపు ఐదు వందల మంది రైతులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు గుంటూరు బయలుదేరారు. ఆ క్రమంలో పిడుగురాళ్ల సమీపంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల చర్యకు నిరసనగా రైతులు రహదారిపై బఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.