Saraswati Power and Industries
-
పవన్ మంత్రి ఎలా అయ్యాడో అర్థం కావట్లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హోం మినిస్టర్‌పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన అంశాలపై గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ భూముల్లో పర్యటించారు. ఆ భూములన్నీ పట్టా భూములే. వెయ్యి ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని తీసుకోలేదనే విషయాన్ని.. పవన్ ఆదేశాలతో అక్కడికి విచారణకు వెళ్లిన ఎమ్మార్వోనే చెప్పారు.( ఆ వీడియోను జగన్ ప్రదర్శించి చూపించారు). అలాంటి ప్రాంతానికి పవన్ వెళ్లారు. ఆపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. .. సరస్వతి పవర్ కోసం నేను తీసుకున్నదంతా ప్రైవేట్ భూములే. గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువే(ఎకరాకు 2.70 లక్షలు అయితే రూ.3 లక్షలు) ఇచ్చి కొన్నాం. అది జగన్ అంటే... సిమెంట్ ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా?. సరస్వతి పవర్ కట్టకపోవడానికి కారణం టీడీపీ, కాంగ్రెస్‌వాళ్లే. వాళ్ల కేసుల వల్లే ఈడీ అటాచ్ చేసింది. పవన్ ఏం మాట్లాడుతున్నారో.. ఎలా మంత్రి అయ్యాడో అర్థం కావడం లేదు. .. పవన్‌కు చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. అందుకే తోలు తీస్తా అంటూ డైలాగులు కొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సింది సీఎంను. కానీ, ఓ దళిత మంత్రిని పవన్ విమర్శించారు’’ అని జగన్ అన్నారు. -
‘సరస్వతి’ భూముల్లో ప్రతి సెంటూ కొన్నదే
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్‌రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్‌కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూముల సంగతి పట్టదా పవన్! గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్‌కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్‌కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్‌కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్‌కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు. -
సరస్వతి భూములపై ఆగని విషప్రచారం
సాక్షి, నరసరావుపేట: సరస్వతి పవర్ భూముల సేకరణలో ఎటువంటి ఆక్రమణలు, అటవీ భూములు లేవని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం ఏదో జరిగిపోయినట్లు ఊగిపోతున్నారు. దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి తన అక్కసును మరోమారు బైటపెట్టుకున్నారు. ఎలాంటి అక్రమాలూ జరగలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెప్పినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అసత్య ప్రచారానికి దిగడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరి«ధిలోని సరస్వతి పవర్స్ భూముల పరిశీలన కోసమని మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన పవన్‌కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం తనకు అలవాటైన అసంబద్ధ, పొంతనలేని మాటలతో సాగింది. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారన్నారని ఆరోపించారు. కానీ.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్థానిక రైతులంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరస్వతి పవర్స్ కంపెనీ తీసుకున్న భూముల్లో 24 ఎకరాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన అసై¯న్డ్ భూములు ఉన్నట్లు తేలిందని మరో వాదన వినిపించారు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చాలని పల్నాడు కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని పవన్ తెలిపారు. సరస్వతి పవర్స్ కంపెనీ కోసం భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు ఎందుకో మెత్తబడిపోయారు, భయపడుతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు. 2014–19 మధ్య ఏం తేల్చారు? సరస్వతి భూముల సేకరణలో అక్రమాలు ఉన్నాయంటూ 2014–19 మధ్య టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విషప్రచారం చేశారు. అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ భూములపై పదేపదే ఆరోపణలు చేస్తూ అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రగల్బాలు పలికారు. ఐదేళ్ల కాలం ముగిసినా ఒక చిన్న తప్పును సైతం గుర్తించలేకపోయారు. ఈసారి కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారు. కూటమి నేతల కుట్రల వల్ల పల్నాడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు అగిపోయి ఇక్కడి ప్రజలు ఆర్థి కంగా బలపడతారు. కానీ.. కూటమి నేతల విషప్రచారాలు, కుట్రలతో పారిశ్రామిక వేత్తలు భయపడి వెనుకడుగు వేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ ఈప్రాంత అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపూడిసెల, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది, వాటిని పూర్తి చేస్తామని ఒక్క మాట కూడా అనకపోవడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అవన్నీ పట్టా భూములే: తహశీల్దార్ సరస్వతి పవర్స్ సంస్థ భూములన్నీ పట్టా భూములేనని మాచవరం తహశీల్దార్ క్షమారాణి గతనెల 26న మీడియాకు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో తనిఖీ చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు, వాగులు, నీటి వసతులేవీ లేవని చెప్పారు. అటవీ భూములేవీ ఆక్రమణకు గురికాలేదు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్టోబర్ 26న మాచవరం మండలంలోని చెన్నాయపాలెం, దాచేపల్లి మండలంలోని తంగెడ అటవీ భూములను సిబ్బందితో కలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అటవీ భూములేవి అక్రమణకు గురి కాలేదన్నారు. అటవీ భూములకు సుమారు 8 మీటర్ల దూరంలో సరస్వతి భూములున్నట్టు గుర్తించామన్నారు. -
పవన్ కళ్యాణ్ పర్యటనపై అంబటి ఫైర్
-
‘సరస్వతి’ భూములపై యథాతథస్థితి
పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకుగాను రెండు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 613.47 హెక్టార్లలో తమకున్న మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 9న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం వల్లే నిర్ణీత వ్యవధిలోపు సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేకపోయామని, కేంద్రం చేసిన జాప్యానికి తమను బాధ్యులుగా చేస్తూ రాష్ట్రప్రభుత్వం మైనింగ్ లీజును రద్దు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి ఈ కంపెనీలో డెరైక్టర్‌గా ఉన్నారని, అందువల్లే ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో మైనింగ్ లీజు రద్దు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్లాంట్ పెట్టాలనుకున్న భూములు ప్రభుత్వ భూములు కావని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, నిర్ణీతవ్యవధిలోపు ప్లాంట్ ప్రారంభించలేదు కాబట్టే, నిబంధనల ప్రకారం లీజును రద్దు చేశామని చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభించకుంటే, కారణం చెప్పాలనీ, కానీ సరస్వతి యాజమాన్యం ఆ పని చేయలేదని అన్నారు. గడువిస్తే అన్ని వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ కౌంటర్ దాఖలుకు గడువిస్తూ ఆదేశించారు.