Saraswati Power and Mining lease
-
చంద్రబాబుపై పార్థసారథి ఫైర్
విజయవాడ: రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.పార్థసారథి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లీజ్‌ను రద్దు చేయడానికి గల కారణమేమిటో వివరించాలని ప్రభుత్వాన్ని పార్థసారథి డిమాండ్ చేశారు. సదరు ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్లియిరెన్స్ ఇవ్వకుండా పనులు మొదటు పెట్టలేదనడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పార్థసారథి ప్రభుత్వానికి సూచించారు. నిన్నటి వరకు విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పి... ఇప్పుడు గుంటూరు జిల్లా చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. -
'బాబు కక్షపూరిత వైఖరి మార్చుకోవాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రమలు స్థాపించే వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇకనైనా ఆ వైఖరిని విడనాడాలని ఆయన చంద్రబాబు సర్కార్‌కు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో హితవు పలికారు. సరస్వతి పవర్ మైనింగ్ లీజులు ఏపీ సర్కార్ రద్దు చేయడానికి గల కారణాలు సహేతుకంగా లేవని ఆయన అన్నారు. మీ తర్వాత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తే మీ పరిస్థితి ఏమిటని టీడీపీ ప్రభుత్వాన్ని ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతుంటే ... రాష్ట్రంలో టీడీపీ సర్కార్ ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. మీ ఆలోచన రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించేలా లేదని చంద్రబాబుకు సూచించారు. చట్టాలు అందరికి సమానంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మిగతా కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సరస్వతి భూములు ప్రభుత్వ భూములేం కాదు... పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేసిన భూములేని ధర్మాన స్పష్టం చేశారు. అలాంటి భూములను ఆక్రమించుకోవాలని రైతులకు పిలుపు నివ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు.