sarees distribution program
-
బతుకమ్మ చీరలు వస్తున్నాయ్!
రేషన్ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్ కార్డులో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్ ఏపీఓల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదనే కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సుమారు లక్షకుపైగా చీరలు మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లాయి. ఈ ఏడాదైనా నాణ్యత ఉంటుందా.. లేదా అని మహిళలు చర్చించుకుంటున్నారు. అసాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరలు త్వరలో జిల్లాకు రానున్నాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ చీరలు’ పంపిణీని గతేడాది ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం మహిళలకు చీరలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏళ్ల వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి మహిళకు ఒకటి చొప్పున చీరను పంపిణీ చేయనున్నారు. 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. జిల్లా పరిధిలోని రేషన్ కార్డుల్లో పేరున్న 6.49 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు త్వరలో అందనున్నాయి. ఈనెల 12 నుంచి 15 వరకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో జిల్లాకు స్టాక్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంపిణీ చేసేంత వరకు వీటినా వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో భద్రపరచనున్నారు. -
బతుకమ్మ చీరలొచ్చాయ్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పేద, ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే పండగ. ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు చీరలు చేరాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 18 ఏళ్లు పైబడిన యువతులతోపాటు మహిళలకు గత ఏడాది నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు. 669 రేషన్ దుకాణాల్లో గత ఏడాది 4,48,797 మంది లబ్ధిదారులకు చీరలను అందించగా.. ఈ ఏడాది సుమారు 10వేల వరకు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 4.58 లక్షల మంది వరకు లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 669 రేషన్ దుకాణాల్లో 3,95,888 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 3,69,305, అంత్యోదయ కార్డులు 26,581, అన్నపూర్ణ కార్డులు రెండు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగను అధికంగా నిర్వహిస్తున్నా రు. ఈ పండగ మహిళలకు సంబంధించినది కావడంతో అందరికీ గుర్తుండిపోయేలా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇలా.. గత ఏడాది నుంచి దసరా పండగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18 ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలు సేకరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ.. జిల్లాలోని మహిళా లబ్ధిదారులకు అనుగుణంగా చీరలను పంపించి.. ఆయా గోడౌన్లలో సిద్ధం చేసింది. అనంతరం పండగకు ముందు చీరలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇలా.. గతేడాది సమాచారం ప్రభుత్వం వద్ద ఉండడంతో వాటికి అనుగుణంగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కొద్ది మందికి రావడంతోపాటు 18 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఈ ఏడాది ఉంటారనే అంచనాతో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా వివరాలు సేకరిస్తూ.. మరో 10వేల చీరలను అధికంగా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగానే చీరలను సిద్ధం చేసి.. పండగ సమయానికి ఎటువంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులున్నారు. జిల్లాకు చేరిన 96వేల చీరలు బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరలను వైరా, నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రెండు గోడౌన్లకు కలిపి 96వేల చీరలు వచ్చాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరల రంగులు, వాటి నాణ్యత, డిజైన్లు రోజూ వాడు తున్న మాదిరిగా ఉన్నాయా..?. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా...? తదితర అంశాలపై ప్ర భుత్వం అభిప్రాయ సేకరణ(మహిళల నుంచి ఫీడ్ బ్యాక్) తీసుకుంటోంది. గతంలో చీరల పంపిణీ లో పలు సంఘటనలు ఎదుర్కొన్న అనుభవంతో భవిష్యత్‌లో మహిళలకు నచ్చేలా, మెచ్చేలా చీర లు పంపిణీ చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల నుంచి బతుకమ్మ చీరలపై అభిప్రాయాలు తీసుకున్నారు. చీరలు వస్తున్నాయి.. జిల్లాకు బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు వస్తున్నాయి. ఇప్పటివరకు 96వేలు వచ్చాయి. త్వరలో మిగతావి వస్తాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం చేపడతాం.– మదన్‌గోపాల్, కలెక్టరేట్ ఏఓ, ఖమ్మం -
రసాభాసగా చీరల పంపిణీ
వితరణం రసాభాసగా హుద్‌హుద్ బాధితులకు చీరల పంపిణీ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం రసాభసా అయింది. ఊహించని రీతిలో తరలివచ్చిన బాధితులకు కిట్లు పంపిణీ చేయలేక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. టర్నర్ చౌల్ట్రీలోని విశాఖ సెంట్రల్ ఎదురుగా సుమారు 14 డివిజన్లకు చెందిన బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నా రు. సాయం పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని 50 వేల మంది బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఓ అరడజను మందికి నేతలు దుప్పట్లు, చీరల కిట్లను పంపిణీ చేశారు. డివిజన్‌కు 400 మంది వంతున నగర పరిధిలోని పది డివిజన్ల నుంచి ప్రత్యేకంగా కూపన్లు పంపిణీ చేశారు. కూపన్లున్న బాధితులు మాత్రమే రావాల్సిందిగా సూచించారు. వీరి కోసం విశాఖ సెంట్రల్ ఎదురుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీరేనా బాధితులు.. మేము కాదా అంటూ వేలాదిగా వచ్చిన బాధితులు నాయకులతో వాగ్వాదానికి దిగా రు. అర్హులైన వారికి కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నాయకులు వారించినా వినిపించుకోకుం డా కౌంటర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశా రు. దీంతో పరిస్థితి చేజారిపోతుందనే భయం తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య నేతలంతా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మిగిలిన నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అంతవరకు క్యూలైన్లలోఉన్న వారు సైతం ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు తోసుకురావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకదశలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కిందపడి పోయారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య బాధితులతో పాటు కార్యకర్తలు కూడా కౌంటర్లలోకి చొరబడి అందినకాడికి పట్టుకుపోయారు. రెండు మూ డు వందల మందికి కూడా పంపిణీ చేయకుం డానే కిట్లు మాయం కావడంతో నాయకులు కూడా చేసేది లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ సిటీఅధ్యక్షురాలు రమణికుమారి, ఎస్సీ సెల్ చైర్మన్ కె.వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.