sarpanch candidate
-
సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ
ముంచంగిపుట్టు (అరకు): విశాఖ ఏజెన్సీ ముంచం గిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కిల్లో రాజమ్మ భర్త కిల్లో నాగేశ్వరరావును ఆదివారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. మూడో విడతలో రేపు (బుధవారం) ఈ పంచాయతీకి జరగనున్న ఎన్నికల్లో రాజమ్మ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆదివారం రాత్రి బూసిపుట్టు పంచాయతీ డి.కంఠవరం గ్రామానికి వచ్చి నాగేశ్వరరావును తీసుకెళ్లారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని హెచ్చరించినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మావోయిస్టులు నాగేశ్వరరావును తీవ్రంగా కొట్టి సోమవారం మధ్యాహ్నం ప్రాణాలతో విడిచిపెట్టారు. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికతో ఈ ప్రాంత గిరిజనులు ఓటు వేసేందుకు భయాందోళనలకు గురవుతున్నారు. బూసిపుట్టు సర్పంచ్ అభ్యర్థి రాజమ్మ ఇప్పటివరకు డి.కంఠవరంలో అంగన్ వాడీ కార్యకర్తగా పని చేశారు. ఇటీవలే రాజీనామా చేసి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీకి దిగారు. పోలింగ్ యథావిధిగా జరుగుతుందని, బూసి పుట్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుమడ పంచాయతీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశా మని ఎస్సై పి.ప్రసాదరావు చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. (చదవండి: కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్) విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో -
అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!
కోడూరు (అవనిగడ్డ): పంచాయతీ ఎన్నికలు.. పైగా పార్టీలకు అతీతం.. కానీ అక్కడ అలాలేదు. ఆ అభ్యర్థి మెడలో ఏకంగా రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దూరి సునీత మెడలో టీడీపీ, జనసేన పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. (చదవండి: ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
చంపేస్తామంటూ.. విత్‌డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు
కళ్యాణదుర్గం రూరల్/మదనపల్లె: తెలుగుదేశం నాయకులు బరితెగించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ విధంగా వ్యవహరించిన వైనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆమెతో ఆదివారం బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. దీనిపై లక్ష్మీదేవి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీదేవి ఈనెల 4వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు ప్రత్యర్థిగా టీడీపీ మద్దతుతో త్రివేణి నామినేషన్ వేశారు. ఆరోజు నుంచి లక్ష్మీదేవితో విత్ డ్రా చేయించాలని ఆమె భర్త నరసింహులును టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఆదివారం ఆమెతో విత్‌డ్రా చేయించారు. లక్ష్మీదేవి దంపతులు ఈ విషయాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌కు తెలిపారు. అనంతరం తమ కుటుంబానికి టీడీపీ వర్గీయుల నుంచి ప్రాణహాని ఉందంటూ లక్ష్మీదేవి రూరల్ సీఐ శివశంకర్‌నాయక్, ఎస్ఐ సుధాకర్లకు ఫిర్యాదు చేశారు. తాము బరిలో ఉంటామని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అభ్యర్థిని బెదిరించడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా వారు మారకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీలో టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసినవారితో బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11వ వార్డుకు నగిరి వెంకటేశమ్మతో నామినేషన్ వేయిస్తే.. మధు, అప్పళ్ల, తిరుపతప్ప, కదిరప్ప, సతీష్ తదితరులు ఆమెతో బలవంతంగా విత్‌డ్రా చేయించారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులపై విరుచుకుపడ్డ కోట్ల సుజాతమ్మ చిప్పగిరి/ఆలూరు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేందుకు అంగీకరించని అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ చిప్పగిరి మండల అధికారులను బెదిరించారు. దౌల్తాపురం, రామదుర్గం పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు వాట్సాప్‌లో వివరాలు పెట్టి నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పంచాయతీల కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలను ఫోన్లో అడిగారు. నేరుగా రావాలని వారు సూచించారు. దీంతో సోమవారం సుజాతమ్మ చిప్పగిరి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ సమక్షంలోనే ఈవోపీఆర్ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు నరేష్‌యాదవ్, సిసింద్రీలపై విరుచుకుపడ్డారు. చిప్పగిరి ఎంపీడీవో అక్బర్‌సాహెబ్ మాట్లాడుతూ తమ వద్దకు రాకుండా ఫోన్లో అడిగితే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. -
‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యథేచ్ఛగా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అల్లర్లు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు రూరల్: అభివృద్ధే ఎజెండాగా పలు పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడుస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని పల్లెసీమలు భావిస్తున్నాయి. ఈ ధోరణి నచ్చని టీడీపీ నేతలు పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు. పలు ప్రాంతాల్లో అభ్యర్థులపై దౌర్జన్యం చేసి భయాందోళనకు గురిచేస్తున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలపై గుర్తుతెలియని వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారు. గ్రామాల్లో తిరగకూడదని హుకుం జారీచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. తమ అక్రమాలకు సహకరించని అధికారులపై ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతల వీరంగం) సర్పంచ్ అభ్యర్థిపై దాడి చిత్తూరు మండలం చెర్లోపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం సాయంత్రం భాస్కర్‌రెడ్డి తన స్నేహితుడి కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా వేంగారెడ్డిపల్లె వద్ద లారీ అడ్డొచ్చింది. దాన్ని తప్పించి పక్కకు వెళ్లబోగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చి భాస్కర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న భాస్కర్‌రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని హీరో ప్యాషన్ ప్రొ వాహనంలో వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ విక్రమ్ తెలిపారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) ఇది వారి పనే ఇది కచ్చితంగా తెలుగు దేశం పార్టీ నేతలపనే. పంచాయతీలో ఎన్నికల్లో గెలవలేకే నాపై దాడికి దిగారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. టీడీపీ కుట్రలు తిప్పికొడతాం. – భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి -
సర్పంచ్ బరిలో బామ్మ!
కళ్యాణదుర్గం రూరల్: ఏకంగా ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ సర్పంచు బరిలో నిలబడింది. ఎక్క డో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు. కళ్యాణదుర్గం మండలంలో నూతన పంచాయతీగా ఆవిర్భవించిన పీటీఆర్ పల్లి తండాకు సర్పంచ్ అభ్యర్థిగా సుగాలి సీతమ్మతో స్థానికులు బుధవారం నామినేషన్ వేయించారు. ఈ విషయంలో ఆమెను అన్ని విధాలుగా భర్త శంకర్‌నాయక్ ప్రోత్సహించారు. మొట్టమొదటి సారి పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని పెద్దావిడకు కట్టబెట్టేందుకు ఏకగ్రీవం చేయాలని తండావాసులు భావిస్తున్నారు. (చదవండి: పురోహితులకు డిమాండ్) -
‘ఓటేయ్యండి.. బాండ్ రాసిస్తా’
సాక్షి, నల్లగొండ : ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీ దగ్గరినుంచి రూపాయి ఆశించను. ఇప్పుడు ఉన్న ఆస్తికంటే ఎక్కువ సంపాదిస్తే జప్తు చేసి ప్రజలకు పంచండి’అంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి వంద రూపాయల బాండ్ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు పంచుతూ ఓట్లను అభ్యర్థించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో చిలుముల రమణ రామస్వామి బరిలో నిలిచారు. తనని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ మంగళవారం రూ.100 బాండ్ పేపర్ జిరాక్స్ ప్రతులను ఇంటింటికి పంపిణీ చేశారు. -
సత్తా చాటేందుకే రాజకీయాల్లోకి..
చింతలపాలెం (హుజూర్నగర్) : గ్రామీణ యువతుల సత్తా చాటేందుకే రాజకీయాల్లో వచ్చా. యువతులు వంటింటికి, ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి. ముఖ్యంగా గ్రామీణ యువతుల్లోని చైతన్యాన్ని నింపాలి. అందుకే రాజకీయ రంగాన్ని ఎంచుకున్నా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నాలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటా. ప్రభుత్వ పథకాలు గ్రామీణులకు సకాలంలో చేరేవిధంగా యువత నడుం బిగించి రాజకీయాల్లో రాణించాలి. అందుకు గ్రామీణ రాజకీయాల్లో కూడా యువత ఆదర్శంగా ఎదగాలి. – అన్నెం శిరీష, వేపలసింగారం, హుజూర్నగర్ -
కలకలం : సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్
సాక్షి, కొడంగల్ : గ్రామ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయిన ఘటన వికారబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. కొడంగల్ నియోజకవర్గంలోని నిటూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్ ని బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విశ్వనాథ్ నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో ఆయన నామినేషన్‌ను అడ్డుకునేందుకే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. నేడు నామినేషన్ వెయాల్సిన విశ్వనాథ్ 9గంటలుగా కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆ గ్రామంలో పలు హత్యలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎస్పీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు తన నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి చేరుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై వికారబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. -
ఖర్చు లేకుండా సర్పంచ్‌లయ్యారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎందరో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారని, అలాంటిది గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి వరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సర్పంచులుగా వ్యవహరించే అధికారం రావడం అధికారులకు ఇది గొప్ప అవకాశమని, ఇలాంటి అవకాశాలు అందరికీ రాదని అన్నారు. గ్రామాల స్పెషల్ ఆఫీసర్ల బాధ్యత గొప్ప కర్తవ్యంగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి రాజేందర్ పారిశుధ్యం–ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామాలలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిధులకు కొరత లేదని గ్రామాలలో మొదటిగా సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని అన్నారు. గ్రామాల పారిశుధ్యం, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. గ్రామాలలో చదువుకున్న యువతను గుర్తించి వారి సెల్ నెంబర్లు సేకరించి సమస్యలపై రోజూ మాట్లాడాలని మంత్రి సూచించారు. పనుల నిర్వహణలో ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. సమస్యలను ధర్మబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. ఏళ్లుగా పూర్తికాని ప్రాజెక్టులను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండేళ్లలో పూర్తి చేసి అనుసంధానం చేసుకున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని, ప్రతీ నియోజకవర్గానికి రూ.70–80 కోట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు, మండలాల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రతిరోజూ గ్రామాలలో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేసుకోవాలని అన్నారు. యుద్ధప్రాతిదికన మరుగుదొడ్లు.. లీకేజీలను నివారించండి జిల్లాలో టాయిలెట్లు లేని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా టాయిలెట్లను మంజూరు చేశామని వాటిని వెంటనే పూర్తి చేయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మరమ్మతులున్న టాయిలెట్లను గ్రామపంచాయతీ నిధులతో వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను, టాయిలెట్లను వెంటనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వారం రోజుల్లో పూడ్చివేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. రోడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తాగునీటినే సరఫరా చేయాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాలలో అపరిశుభ్ర పరిసరాలతో అంటువ్యాధులు, జ్వరాలు సోకితే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాల ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసి కరీంనగర్ జిల్లాను వ్యాధుల రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై, హరితహారంపై చైతన్యం తేవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2010లో జిల్లాలో డెంగ్యూతో ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్మికుల సమ్మెతో పరిశుభ్రత లోపించిందని తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే మెడికల్ బృందాలను పంపించాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆరు గ్రామాలకు లేరని, ఆ గ్రామాలకు అధికారులను నియమించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల బాధ్యతను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్లు పాత సర్పంచుల సహకారంతో పనులు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్, జిల్లా పరిషత్ శిక్షణా మేనేజర్ సురేందర్, మండల అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కోహ్లిని తీసుకొస్తామని మోసం చేశారు..
సాక్షి, ముంబై : మాటలతో మభ్యపెట్టడం.. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం.. వాటిని విస్మరించడం.. రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. అయితే మహారాష్ట్రలోని షిరూర్ పరిధిలోని రామలింగ గ్రామసర్పంచ్‌గా పోటీ చేస్తున్న విఠల్ గణపత్ గవాటే కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. ప్రచారంలో భాగంగా ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గ్రామానికి తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతే ఇక కోహ్లిని చూడటం కోసం, అతనితో ఫొటోలు దిగడం కోసం సెల్ఫీ స్టిక్కులతో సహా భారీ సంఖ్యలో జనాలు పోగయ్యారు. తీరా ర్యాలీకి వచ్చాక కోహ్లి కాకుండా.. కోహ్లిలా మరో యువకుడిని చూసి నిట్టూర్చడం వారి వంతైంది. కోహ్లిని తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ర్యాలీకి విరాట్ కోహ్లి వస్తున్నాడంటూ ప్రచారం చేశారు. కానీ విరాట్‌లా కనిపించే మరో వ్యక్తిని తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారు. నిజానికి ఇదేగా జరిగేది’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘తన పేరును వాడుకుని ఓట్లను పొందాలనుకుంటున్నారని కోహ్లికి తెలిసి ఉండకపోవచ్చు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘కనీసం అభ్యర్థి అయినా నిజమైన వారేనా.. లేదా ఆయన కూడా డమ్మీనేనా’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So this actually happened. They put up an election rally ad saying Virat Kohli is going to campaign for us and they actually fooled public by bringing a lookalike of Virat Kohli 😂😂😂😂😂 pic.twitter.com/Xl9GvAVi2W — Alexis Rooney (@TheChaoticNinja) May 25, 2018 .@imVkohli hits the campaign trail in injury time! 😂😂 https://t.co/DoInqvNkyq — Bhuvan Bagga (@Bhuvanbagga) May 26, 2018 So this actually happened. They put up an election rally ad saying Virat Kohli is going to campaign for us and they actually fooled public by bringing a lookalike of Virat Kohli 😂😂😂😂😂 pic.twitter.com/Xl9GvAVi2W — Alexis Rooney (@TheChaoticNinja) May 25, 2018