కోహ్లిని తీసుకొస్తామని మోసం చేశారు.. | Panchayat Candidate Of Maharashtra Promises Virat Kohli As Chief Guest In His Rally But Brings Duplicate | Sakshi
Sakshi News home page

కోహ్లిని తీసుకొస్తామని మోసం చేశారు..

Published Mon, May 28 2018 1:15 PM | Last Updated on Mon, May 28 2018 2:56 PM

Panchayat Candidate Of Maharashtra Promises Virat Kohli As Chief Guest In His Rally But Brings Duplicate - Sakshi

సాక్షి, ముంబై : మాటలతో మభ్యపెట్టడం.. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం.. వాటిని విస్మరించడం.. రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. అయితే మహారాష్ట్రలోని షిరూర్‌ పరిధిలోని రామలింగ గ్రామసర్పంచ్‌గా పోటీ చేస్తున్న విఠల్‌ గణపత్ గవాటే కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు.

ప్రచారంలో భాగంగా ఏకంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని గ్రామానికి తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతే ఇక కోహ్లిని చూడటం కోసం, అతనితో ఫొటోలు దిగడం కోసం సెల్ఫీ స్టిక్కులతో సహా భారీ సంఖ్యలో జనాలు పోగయ్యారు. తీరా ర్యాలీకి వచ్చాక కోహ్లి కాకుండా.. కోహ్లిలా మరో యువకుడిని చూసి నిట్టూర్చడం వారి వంతైంది. కోహ్లిని తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తు​తం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ర్యాలీకి విరాట్‌ కోహ్లి వస్తున్నాడంటూ ప్రచారం చేశారు. కానీ విరాట్‌లా కనిపించే మరో వ్యక్తిని తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారు. నిజానికి ఇదేగా జరిగేది’  అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. ‘తన పేరును వాడుకుని ఓట్లను పొందాలనుకుంటున్నారని కోహ్లికి తెలిసి ఉండకపోవచ్చు’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ‘కనీసం అభ్యర్థి అయినా నిజమైన వారేనా.. లేదా ఆయన కూడా డమ్మీనేనా’ అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement