Sarpanch Family
-
టీడీపీ ప్రోద్బలంతో సర్పంచ్, ఆమె భర్తపై దాడి
రాప్తాడు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరు చేయాలంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో సర్పంచ్, ఆమె భర్తపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం మండలం అక్కంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా వలంటీర్ గాయపడింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపల్లికి చెందిన కుళ్లాయప్ప, హుస్సేన్, వలీ అనే ముగ్గురు సోదరులు ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థలాన్ని ఇటీవల హౌసింగ్ అధికారులు పరిశీలించారు. ఇల్లు మంజూరు కావాలంటే ఖాళీ స్థలం మరికొంత ఉండాలని, అలా ఉంటేనే జియోట్యాగింగ్ తీసుకుంటుందని చెప్పారు. ఏడడుగుల స్థలంలోని బాత్రూమ్ను తొలగించుకుంటే ఇంటి మంజూరుకు అవసరమైన స్థలం అందుబాటులోకి వస్తుందని సూచించారు. ఇదే విషయాన్ని సర్పంచ్ మల్లెల పుష్పావతి, ఆమె భర్త లింగమయ్య రెండు రోజుల కిందట కుళ్లాయప్ప కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇల్లు మంజూరు కాలేదనే విషయం తెలిసినప్పటికీ కుళ్లాయప్ప సోదరులు ఆదివారం సర్పంచ్ పుష్పావతి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆమెతో గొడవ పడ్డారు. ఎంత చెబుతున్నా వినకుండా మద్యం మత్తులో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆమెపై దాడి చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ భర్త లింగమయ్య ఇంటి వద్దకు చేరుకోగా ఆయనపైనా దాడి చేశారు. వలంటీరు రాజేశ్వరిపై కొడవలితో దాడి కాగా, కుళ్లాయప్ప సోదరులు సర్పంచ్ ఇంటి వద్ద నుంచి అటుగా వెళుతుండగా గ్రామ వలంటీర్ రాజేశ్వరి కనిపించడంతో ఆమెను బండబూతులు తిడుతూ కొడవలితో దాడి చేశారు. దీంతో ఆమె తలకు గాయమైంది. అడ్డుకోబోయిన వలంటీర్ తండ్రి ఆంజనేయులుపైనా దాడికి పాల్పడ్డారు. వెంటనే రాజేశ్వరిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ నబీ రసూల్ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సర్పంచ్, వలంటీరు ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
సర్పంచ్ కుటుంబం వెలి!
ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన మంచిర్యాల రూరల్: నేటి ఆధునిక సమాజంలోనూ కులబహిష్కరణ సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఓ చిన్న ఘటన ఏకంగా సర్పంచ్ కుటుంబాన్నే కుల బహిష్కరణ చేసే దాకా వెళ్లింది. ఆదిలాబా ద్ జిల్లా మంచిర్యాల మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం లక్ష్మికి జరిగిన ఈ చేదు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదీ జరిగింది.. రెండేళ్ల క్రితం సర్పంచ్ లక్ష్మికి తోటి కోడలు భాగ్యలక్ష్మితో గొడవ జరిగింది. భాగ్యలక్ష్మి ఇంటి వద్ద ఉన్న అంబేడ్కర్ జెండా గద్దె నిర్మాణమే గొడవకు దారి తీసింది. దీంతో కుల సంఘం భాగ్యలక్ష్మికి రూ.వెయ్యి జరి మానా విధించింది. అరుుతే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏర్పడిన ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కుల పెద్దల మాట ధిక్కరించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినందుకుగాను.. సర్పంచ్ దుర్గం లక్ష్మి రూ.2,500 జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. జరిమానా కట్టనని సర్పంచ్ తెలపడంతో ఆమెను కుల బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారు. ఇది జరిగిన తర్వాత రోజు గ్రామంలోని తమ కులానికి చెం దిన ఓ కుటుంబం సర్పంచ్‌ను వివాహానికి ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న కుల సంఘం నేతలు పెళ్లివారితో మాట్లాడారు. పెళ్లికి రావొద్దని సర్పంచ్‌కు సమాచారం ఇప్పించారు. ఒకవేళ వస్తే కుల బహిష్కరణతోపాటు రూ.5 వేల జరి మానా తప్పదని సర్పంచ్ కుటుంబాన్ని కుల పెద్దలు హెచ్చరించారు. దీనిపై సర్పంచ్ లక్ష్మి-శ్రీనివాస్ దంపతులు ఏఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రలతోనే బహిష్కరణ రాజకీయ కక్షతోనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ కుల బహిష్కరణకు కుట్ర చేశారు. అభివృద్ధిలో ముందుకు వెళ్లడంతోపాటు రాజకీయంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. నేను అధికార పార్టీ సర్పంచ్‌ను కాకపోవడం కూడా దీనికి కారణం. నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారు. నాకు ప్రజాప్రతినిధుల, కుల సంఘం అండదండలు అందలేదు. - దుర్గం లక్ష్మి, సర్పంచ్, పెద్దంపేట -
సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ
నిజామాబాద్: సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది. సర్పంచ్ శోభ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. బహిష్కరణతో పాటు సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించింది గ్రామాభివృద్ధి కమిటీ. సర్పంచ్ కుటుంబాన్ని బహిష్కరించడంపై దళిత సంఘాలు మండిపడ్డారు. చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి.