sarpanchs power
-
పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్‌కే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్‌లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1నుంచి 5వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజువల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు. సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తారు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు. చదవండి: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని -
గ్రామ పంచాయతీల్లో పాలనపై తేల్చని ప్రభుత్వం
-
తేలని ‘పంచాయితీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల పదవీకాలం రేపటితో ముగిసిపోతున్నప్పటికీ అనంతరం పంచాయతీల్లో పాలనను ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా 12,850 చోట్ల సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది. 3 రకాల ప్రతిపాదనలతో సీఎంకు నివేదిక పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలా..? లేక ప్రత్యేకాధికారులను నియమించాలా..? లేదంటే సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలా? అనే మూడు రకాల ప్రతిపాదనలతో పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీసుకునే రాజకీయ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు పంచాయతీల్లో పాలనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. సోమవారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు ఆశించినా రాత్రి వరకు అటువంటిదేమీ వెలువడలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి కనీసం రెండు మూడు రోజులైనా సమయం అవసరమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సర్పంచులకు చెక్ పవర్ ఏదీ?
హైదరాబాద్: పంచాయతీ సర్పంచులకే చెక్‌పవర్ ఇవ్వాలని నాలుగు నెలల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం, స్థానిక సంస్థల అధికారాలను కాలరాయడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తక్షణమే హైకోర్టు తీర్పు అమలు చేయాలని గురువారం డిమాండ్ చేశారు. అలాగే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మూడు నెలల క్రితం సీఎం ప్రకటించినా.. ఉత్తర్వులు జారీ కాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. హామీలతో ఉద్యమాలను నీరుగార్చి, ఆ పై అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆర్.కృష్ణయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు.