పంచాయతీ సర్పంచులకే చెక్‌పవర్ ఇవ్వాలని నాలుగు నెలల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం, స్థానిక సంస్థల అధికారాలను కాలరాయడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు.
హైదరాబాద్: పంచాయతీ సర్పంచులకే చెక్‌పవర్ ఇవ్వాలని నాలుగు నెలల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం, స్థానిక సంస్థల అధికారాలను కాలరాయడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తక్షణమే హైకోర్టు తీర్పు అమలు చేయాలని గురువారం డిమాండ్ చేశారు.
అలాగే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మూడు నెలల క్రితం సీఎం ప్రకటించినా.. ఉత్తర్వులు జారీ కాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. హామీలతో ఉద్యమాలను నీరుగార్చి, ఆ పై అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆర్.కృష్ణయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు.