Sarparaj Ahmed
-
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓపై వేటు
సాక్షి, సూర్యాపేట: జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్ బి.సాంబశివరావు నియమితులయ్యారు. కాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. (మార్కెట్ బజార్లో సీఎస్, డీజీపీ పర్యటన) మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణమైన మార్కెట్ బజార్లో వీరు పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్ బజార్‌లోని వ్యాపారులు, వారి కాంటాక్టుల నుంచి నమోదైనవి 65 కేసులు ఉన్నాయి. (‘మార్కెట్ బజార్’ అంటే హడల్) ప్రత్యేకాధికారిగా సర్పరాజ్‌అహ్మద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి సర్పరాజ్‌అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎక్త్సెజ్ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి కూడా ప్రత్యేక అధికారిని పెట్టారు. మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన గతంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేశారు. మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) ‘పేట’ డీఎస్పీ బదిలీ, కొత్త డీఎస్పీగా మోహన్‌కుమార్ సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావును మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.మోహన్‌కుమార్‌ను నియమించారు. ఈయన బుధవారం విధుల్లో చేరనున్నారు. సూర్యాపేట డీఎస్పీగా నాగేశ్వర్రావు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశారు. కాగా ఈయన హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! ) -
పాక్‌కు పరుగుల పరీక్ష
నాటింగ్‌హామ్: బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు మరో కఠిన సవాల్. ఆ జట్టు సోమవారం టోర్నీ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. అసలే భీకర హిట్టింగ్తో చెలరేగుతున్న ఆతిథ్య జట్టును బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై నిలువరించడం పాక్‌కు పెద్ద పరీక్ష కానుంది. ఇంగ్లండ్ రెండు వన్డే అత్యధిక స్కోర్లు (481/6 ఆస్ట్రేలియాపై), (444/3 పాకిస్తాన్‌పై) ఇదే మైదానంలో నమోదు చేసినవి కావడం గమనార్హం. దీనికితోడు జోఫ్రా ఆర్చర్ రూపంలో మెరికలాంటి పేసర్ ఇప్పుడు ఆ జట్టు అమ్ములపొదిలో ఉన్నాడు. ఈ పరిణామాల ప్రకారం అసాధారణంగా ఆడితేనే పాక్ విజయం సాధించే వీలుంటుంది. వారి ఆశలన్నీ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్‌పైనే ఉన్నాయి. ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఇప్పటికే విమర్శల దాడి మొదలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే అవి తీవ్రం కావడం ఖాయం. విండీస్‌పై ఆకట్టుకున్న పేసర్ ఆమిర్‌తో పాటు హసన్ అలీ చెలరేగితే ప్రత్యర్థిని అడ్డుకోవడం సులువవుతుంది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఫామ్‌లోకి రావడంతో ఇంగ్లండ్ ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉంది. ఫిట్నెస్ సాధించిన పేసర్ మార్క్ వుడ్‌ను ఆడించే వీలుంది. ముఖాముఖి రికార్డు ఇరు జట్లు ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 31 మ్యాచ్‌ల్లోనే పాకిస్తాన్ గెలిచింది. ఇంగ్లండ్ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 9 సార్లు ఎదురుపడగా చెరో నాలుగుసార్లు విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారానే పాక్ తమ ఏకైక ప్రపంచ కప్ (1992)ను సాధించడం విశేషం. 500 కొట్టేస్తారా...? ప్రపంచ కప్ ప్రారంభం నుంచి వినిపిస్తున్న మాట ‘500’. వన్డేల్లో ఈ మార్క్‌ను తొలిసారిగా అందుకోగల సత్తా ఉన్న జట్టుగా అందరూ ఇంగ్లండ్‌కే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాస్త చిన్నదైన టెంట్‌బ్రిడ్జ్ మైదానంలోనే ఈ రికార్డు నమోదవుతుందని అంచ నా వేస్తున్నారు. అది నేటి మ్యాచ్‌లోనే జరిగితే... ఇంగ్లండ్ మరింత దుర్బేధ్యం అవుతుంది. పాక్ ఆత్మవిశ్వాసంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. -
ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇదేపనిలో తలమునకలవుతున్నారు. ఒకపక్క ఓటరు నమోదు ప్రక్రియ, జాబితా ప్రకటన ప్రక్రియ వేగవంతంగా చేస్తూనే.. మిగతా పనులన్నీ చక్కబెడుతున్నారు. జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పరిశీలన, మాక్ పోలింగ్, రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బెంగళూర్ నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు వీటి పనితీరును వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇదివరకు ఉన్న 13,221 బ్యాలెట్ యూనిట్లు, 8,636 కంట్రోల్ యూనిట్లను అధికారులు తిరిగి పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 1,142 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,830 బ్యాలెట్ యూనిట్లు, 1,430 కంట్రోల్ యూనిట్లు బెంగళూర్‌లోని బీఎల్ కంపెనీ నుంచి తెప్పించారు. కొత్తగా 1,540 వరకు వీవీ ప్యాట్స్ ప్రవేశపెట్టారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల ప్రాథమిక పరిశీలన కార్యక్రమం వారంరోజులు సాగుతోంది. వివిధ రాజకీ య పార్టీల సమక్షంలో బీఎల్ కంపెనీకి చెందిన 20 మంది ఇంజినీర్లు ఏ విధంగా పనిచేస్తాయో ఆదివారం కూడా వివరించా రు. కీప్యాడ్లు, డిస్ప్లే బోర్డులు, లైటింగ్, సౌండ్ సిస్టం పనితీరును పరిశీలిస్తున్నారు. ఈవీఎంను పరిశీలించిన కలెక్టర్... ఎన్నికల సంఘం జిల్లాకు బెంగళూర్ నుంచి పంపించిన ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపించిన అన్ని ఈవీ ఎంలను ముందుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిస్థాయి తనిఖీని చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఈవీఎంలు అన్నిసరిగా పని చేస్తున్నది లేనిది రాజకీయ నాయకుల సమక్షంలోనే ఇంజినీర్లు తనిఖీ చేస్తారన్నారు. అనంతరం కొత్తగా ఈవీఎంలకు వీవీ ప్యాట్స్‌ల పనితీరును కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మాక్‌పోలింగ్: సర్పరాజ్ అహ్మద్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం జిల్లాకు పంపిన ఈవీఎంలతో మాక్‌పోల్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ వెనుక గల ఈవీఎంల గోదాములో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోవారు ఎంచుకున్న ఈవీఎంలతో ఓట్లు వేయించి మాక్‌పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలతోపాటు ఈసారి కొత్తగా వీవీ ప్యాట్లను కూడా పంపించిందని తెలిపారు. వేసిన ఓటును అదే అభ్యర్థికి పడింది.. లేనిది వి.వి ప్యాట్ స్కీన్‌పై చూడవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ఈవీఎంలపై ఓట్లు వేసి ఓట్లు సరిగా పడుతున్నాయా..? లేదా..? అని రాజకీయ పార్టీల అభ్యర్థులకు చూపించారు. అదే విధంగా రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా మాక్‌పోల్‌లో పాల్గొని ఓట్లు వేసి ఈవీఎంల పనితీరును పరిశీలించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా కోశాధికారి కార్యాలయం ఉప సంచాలకులు శ్రీనివాస్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలి
కరీంనగర్‌సిటీ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదు అంశాలు, పోలింగ్ కేంద్రాల అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత నెల 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఆ జాబితాలో మార్పులు, చేర్పులుంటే బూత్‌స్థాయి అధికారిని సంప్రదించొచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14 వరకు అవకాశముందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే బూత్‌స్థాయి, సహాయ ఓటరు నమోదు అధికారిని సంప్రదించొచ్చని, లేదా ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల దరఖాస్తులకు ఈనెల 11న ప్రత్యేక సవరణ తేదీని వినియోగించుకోవాలని, ఆ రోజు సంబంధింత బూత్‌స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తుది ఓటరు జాబితా మార్చి 24న ప్రకటిస్తారని తెలిపారు. భారత ఎన్నికల సంఘం జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడిగా మహిళా శిశు, వికలాంగ వయోవృద్ధుల శాఖ రాష్ట్ర సెక్రటరీ ఐఏఎస్ జగదీశ్వర్‌ను నియమించామన్నారు. బీఎస్పీ ప్రతినిధి మల్లయ్య, బీజేపీ నుంచి వేణుగోపాల్, సీపీఐ నుంచి రాజు, ఐఎస్సీ నుంచి రెమహత్, ఎంఐఎం నుంచి ఇబ్రహీం, టీడీపీ నుంచి ఆగయ్య, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ తహసీల్దార్లు శ్రీనివాస్, రాజయ్య, మహేందర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
అంగన్వాడీల ఆగ్రహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కా రు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతకుముందు సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.విజయలక్ష్మి మాట్లాడుతూ మిషన్మోడ్లోకి తెచ్చి అంగన్వాడీ కేంద్రాలను స్వచ్చంధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు సర్కారు యోచిస్తోందన్నారు. సీడీఆర్ స్వచ్చంధ సంస్థ జోక్యంతో వచ్చిన ఐకేపీ బాలబడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమృతహస్తంలో మె నూ చార్జీలు, కట్టెల బిల్లులు పెంచాలన్నారు. 2011 నాటి సకల జనుల సమ్మె కాలపు వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.12500, పీఎఫ్ కాలపు వేతన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. జేసీ వ్యాఖ్యలపై మండిపాటు 10 మంది నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో జేసీ నిర్లక్ష్యంగా మాట్లాడారని పేర్కొంటూ.. అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకురాళ్లకు జేసీ క్షమాపణ చెప్పాలంటూ భీష్మించారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంపత్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తుండగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కార్యాలయానికి చేరుకుని అంగన్వాడీ నాయకులతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, రాష్ట్ర పరిధిలోనివి ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జి.జ్యోతి, ప్రధాన కార్యదర్శి జి.రమాదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వై.రవికుమార్, సంపత్, వనజ, కమల, రజిత, వనజారాణి, పుష్ప, భాగ్యరాణి, వింద్యారాణి, జె.భాగ్య, విమల, రాజేశ్వరి, ఉమారాణి, భార్గవి, జయప్రద తదితరులు పాల్గొన్నారు. జేసీ ఏమన్నారు..! ధర్నాలో భాగంగా పది మంది అంగన్వాడీ నాయకులు యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.జయలతతో కలిసి ప్రజావాణిలో ఉన్న జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీలో స్వచ్చంధ సంస్థల జోక్యం వద్దని, ఐకేపీ బాలబడులను నిర్వహించొద్దని సూచించారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. స్పందించిన జేసీ బడ్జెట్ రాగానే పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లిస్తామని, బాలబడుల విషయం ‘పాలసీమ్యాటర్’ అన్నారు. దీనికి అడ్డుచెప్పడంతో అసహనానికి గురైన జేసీ తనకే ఉచిత సలహాలిస్తారా అంటూ చిరాకు పడ్డారని అంగన్వాడీలు ఆరోపించారు. -
పీఓ బదిలీకి కుట్ర!
నిధులు దండుకునేందుకు పన్నాగం మేడారం మహాజాతర నిధులను దండుకునేందుకు రాజకీయ శక్తులు కుట్రపన్నుతున్నాయి. ఐటీడీఏ పీఓగా ఐఏఎస్ అధికారి ఉంటే తమ ఆటలు సాగడం లేదని ఆయన బదిలీకి ప్రయత్నాలు మొదలుపెట్టారుు. రెండు మూడు రోజుల్లోనే బదిలీ ఉత్తర్వులు వెలువడేంత వేగంగా ఫైళ్లు కదులుతున్నాయి. ఇందుకు కేంద్ర నేత పావులు కదుపుతున్నట్టు తెలిసింది. గత వేసవిలో గోదావరి ఇసుక తరలిం పునకు అడ్డుపడిన ఐఏఎస్ అధికారిని సాగనంపితే.. వచ్చే వేసవిలో తమకు అడ్డు ఉండదని ఇసుక మాఫియా కూడా జతకట్టినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారినే తిరిగి రప్పించేందుకు ప్రయత్నించడం గమనార్హం. ములుగు, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) లక్ష్యం నీరుగారిపోతున్న దశలో ఐఏఎస్ అధికారి సర్పరాజ్ అహ్మద్ గతేడాది ఆగస్టు 7న పీఓ(ప్రాజెక్టు అధికారి)గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సర్ఫరాజ్.. అవినీతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా అధికారుల్లో సమయపాలన, క్రమశిక్షణ తీసుకువచ్చారు. ఇది మింగుడుపడని కిందిస్థాయి అధికారులు కుయుక్తులకు తె రలేపారు. కావాలని.. ఓ వర్గం గిరిజనులను ఉసిగొల్పారు. సర్ఫరాజ్ మరో వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నాడని రెచ్చగొట్టే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇలా మొదలైన వివాదం.. సదరు వర్గానికి చెందిన ‘పెద్ద’నేత పీఓ బదిలీ కోసం పట్టుబట్టే స్థాయికి చేరింది. నిధులు మింగేందుకే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం మహా జాతరలో వివిధ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో పనులు చేపట్టనుంది. జాతర పనులంటేనే బెల్లంలా భావించే నాయకులు, అధికారు లు, కాంట్రాక్టర్లకు నిక్కచ్చిగా వ్యవహరించే వారంటే గిట్టని పరిస్థితి ఉం ది. కచ్చితత్వం పాటించే అధికారులకు స్థానచలనం కలిగించి, అనుకూలంగా ఉండే వారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం కొన్ని జాతరల సందర్భంగా జరిగింది. అయితే ఇప్పుడు ఐఏఎస్ అధికారిని కూడా బది లీ చేయించేందుకు ఎత్తుగడ వేయడం ఆందోళన కలిగిస్తోంది. జాతర పనులపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలనలు చేసినా.. నిత్యం మేడారం పై నిఘా పెట్టే బాధ్యత ఐటీడీఏ పీఓపైనే ఎక్కువగా ఉంటుంది. గత వేసవిలో గోదావరి ఇసుక రీచ్‌ల అనుమతులకు సర్ఫరాజ్ అడ్డుకట్ట వేశారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు వెరవకుండా గిరిజనులకే బాసటగా నిలిచారు. దీంతో బదిలీ కుతంత్రాలకు తెరలేపినట్లు తెలిసింది. ఆయనే కావాలట! ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడి నుంచి బదిలీపై వె ళ్లిన ఓ అధికారినే మళ్లీ ఇక్కడికి పీఓగా తీసుకురావాలని పాకులాడడం విమర్శలకు తావిస్తోంది. గత జాతరలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత జాతరలో ఇప్పటి పీఓ సర్పరాజ్ అహ్మద్ ములుగు సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయనకు కూడా జాతరపై సంపూర్ణ అవగాహన ఉంది. అయినా... జాతర అనుభవం ప్రాతిపదికన ఐఏఎస్ అధికారి బదిలీకి యత్నాలు చేయడం తగదంటున్నారు. పీఓగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ఆ అధికారి రాజకీయ నాయకులకుతో ముందస్తు ‘ఒప్పందం’ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి ఆరోపణలు మెండుగా ఉన్నా.. సదరు అధికారివైపే నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆ అధికారి గతంలో ఇక్కడ పనిచేసిన కాలంలో సుమారు రూ.50 కోట్లకు సంబంధించిన ఈజీఎస్ పనులను కట్టబెడతానని హామీ ఇస్తూ తన కింది స్థాయి అధికారితో కలిసి అక్రమతంతు నడిపినట్లు ఆరోపణలున్నాయి. ముందస్తుగానే కాంట్రాక్టర్ల వద్ద ఐదు శాతం కమీషన్ వసూలు చేసి.. తీరా పనులు అప్పగించకపోవడంతో విషయం బయటకు పొక్కినట్లు గిరిజన సంఘా లు పేర్కొంటున్నాయి. దీనికితోడు గత జాతరలో నాసిరకం పనులకు అండగా నిలిచాడని, జాతరలోని దుకాణాల వద్ద వసూలు చేసిన సొమ్ము కు సంబంధించిన లెక్కలు ఆడిట్లో చూపించలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ చేశారని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. దీంతో విధులకు సెలవుపెట్టి వెళ్లిన ఆయన.. మళ్లీ రాలేదు. ప్రస్తుతం పీఓ సర్ఫరాజ్ అహ్మద్ తన వివాహ వేడుకల సందర్భంగా ఈనెల 17నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు సెలవులో ఉండగా.. అడిషనల్ జేసీ సంజీవయ్య ఇంచార్జ్ పీఓగా ఉన్నారు. కాగా, పీఓ సర్ఫరాజ్‌ను బదిలీచేస్తే ఆందోళనలు చేపడుతామని ఏజెన్సీవాసులు హెచ్చరిస్తున్నారు.