Sarvepalli constituency
-
సర్వేపల్లిలో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీని వీడి 50 కుటుంబాలు.. వైఎస్సార్సీపీలోకి చేరాయి. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ భూ స్థాపితం అయిందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు, నారా లోకేష్ టార్చిలైట్ వేసుకొని వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: పవన్.. చంద్రబాబు, లోకేష్ ఆ మాట చెప్పగలరా? -
సాగునీటి సమస్య పరిష్కారం.. మాట నిలబెట్టుకున్న మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, గురివిందపూడి గ్రామ పంచాయతీల రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. సుమారు వంద సంవత్సరాలుగా ఇక్కడి సాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. సమీపంలో కనుపూరు కాలువ ఉపకాలువ అయిన గురివిందపూడి బ్రాంచ్ కెనాల్ ఉంది. ఇందులో సాగునీరున్నా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడలేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుల నిరీక్షణకు తెరదించారు. ఆయన తీసుకున్న చర్యలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కనుపూరు కాలువ నుంచి అందుబాటులోని చెరువులకు సాగునీరు సరఫరా సాధ్యమైంది. దీంతో అధికారికంగా మూడువేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అనధికారికంగా మరో రెండువేల ఎకరాలకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టించుకోని టీడీపీ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి ఆ మూడు పంచాయతీల రైతులు తీసుకెళ్లారు. చెరువులున్నాయి, జలాశయాల నుంచి నీరు వచ్చే మార్గాలను పునరిద్ధరించాలని ఆభ్యర్థించారు. 22 సంవత్సరాలు పాలించిన టీడీపీ నేతలకు అక్కడి రైతుల విన్నపాలు చెవిక్కెలేదు. వర్షం లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి సైతం ఇబ్బందులు పడేవారు. టీడీపీ హయాంలో తాగునీటి ఇక్కట్లను ప్రజలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు సమీపించాయి. మూకుమ్మడిగా తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. హామీని నిలబెట్టుకున్న మంత్రి 2019 ఎన్నికలకు ముందు వాస్తవ పరిస్థితిని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఆయా పంచాయతీల ప్రజలు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులు వెచ్చించి కాలువలను పునరిద్ధరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్సీపీ అధికార పగ్గాలు అందుకుంది. మంత్రి కాకాణి రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి వెంకటాచలంలోని కాకెద్దులగుంటచెరువు నుంచి రామదాసుకండ్రిగ, గురివిండపూడి, ఇడిమేపల్లి చెరువులకు సాగునీరు వెళ్లేలా కాలువల పునరుద్ధరణ పనులు చేయించారు. సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువ పనులను 16 రోజులపాటు రేయింబవళ్లు 12 మెషీన్లతో చేశారు. నేడు కాలువల్లో నీళ్లు రావడంతో రైతుల ఆనందం హద్దులు దాటింది. అక్కడి నుంచి చెరువులకు నీరు విడుదల చేశారు. రామదాసుకండ్రిగ చెరువు పరిశీలనకు వెళ్లిన మంత్రి గోవర్ధన్‌రెడ్డికి రైతాంగం బ్రహ్మరథం పట్టారు. గుర్రపు బండిపై తీసుకెళ్లి తమ సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని ఘనంగా సన్మానించారు. జీవింతాం గుర్తించుకుంటాం రామదాసుకండ్రిగ రైతుల ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకారం చేశారు. ఎంతోమంది మా గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అందరిలా కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిని ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం గుర్తించుకుంటాం. – షేక్ షాజహాన్, మాజీ సర్పంచ్, రామదాసుకండ్రిగ బిడ్డల భవిష్యత్ బాగుంటుంది చెరువు ఆయుకట్టు భూమి ఉన్నా.. నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏళ్ల తరబడి భూములు బీడుగా మారాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో మా బిడ్డల భవిష్యత్ బాగుంటుంది. సాగునీటి కాలువను తవ్వించి, చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు పండించుకుంటాం. – వెడిచర్ల సుబ్రహ్మణ్యం, రైతు శాశ్వత పరిష్కారం లభించింది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యలతో పంటలు పండేవి కావు. మూడేళ్ల నుంచి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో కొంతమేరకు పంటలు పండించుకున్నాం. ఇప్పుడు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చెరువులకు నీరు విడుదల చేయడంతో ఇక మాకు నీటి కష్టాలుండవు. సాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాకా సుబ్బారావు, రైతు -
రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనే: కాకాణి
సాక్షి, నెల్లూరు(పొదలకూరు): రాష్ట్ర మంత్రిగా ఎన్ని బాధ్యతలు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని మంత్రి కాకాణి వెల్లడించారు. ఎన్ని జన్మలెత్తినా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని, నా రాజకీయ గురువు తన తండ్రి కాకాణి రమణారెడ్డి అయితే, రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం సర్వేపల్లి ప్రజలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరులో శనివారం మంత్రికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ పౌర సన్మానం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభాస్థలి పంచాయతీ బస్టాండ్ వరకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కాకాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహమే అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేని చేసిన సర్వేపల్లి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా మీ ఇంట్లో బిడ్డనేనని, ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పొదలకూరు మండల కార్యకర్తలు తనకు సన్మానం చేయడమంటే ఇంట్లో బిడ్డను సత్కరించినట్టుగా తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. వీలైతే తానే ప్రతి ఒక్కరిని సన్మానిస్తానన్నారు. సభకు హాజరైన జనం రైతు సంక్షేమానికి కృషి సీఎం అండదండలతో తనకు కేటాయించిన శాఖలకు వన్నె తేవడంతో పాటు రైతుల సంక్షేమానికి పాటు పడతానన్నారు. రైతులకు వచ్చే నెలలో 3 వేల ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు సబ్సిడీతో అందజేస్తామన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు నిర్మించేందుకు రూ.1,079 కోట్లు కేటాయించామన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తానని, మరో ఆరు నెలల్లో పంచాయతీరాజ్ రోడ్ల స్వరూపం మారుస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.28 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో రూ.300 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లను పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభిమానులు గజమాలలు, శాలువలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఏఎంసీ చైర్మన్ పెదమల్లు రత్నమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, రావుల దశరథరామయ్యగౌడ్, నువ్వుల మంజుల, సర్పంచ్ చిట్టెమ్మ, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సర్వేపల్లిలో కాకాణి విజయం తథ్యం : ఆనం
-
వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్
పొదలకూరు, న్యూస్‌లైన్ : సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా పోలింగ్ జరిగినట్టు ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా తోడేరులో శుక్రవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పొదలకూరు పార్టీ కార్యాలయంలో కాకాణి పోలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుని విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గలో ఫ్యాన్‌గాలి వీస్తున్నట్టు తెలిపారు. ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలను తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. గత పంచాయతీ ఎన్నికలతో పోల్చిచూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పెరిగిందన్నారు. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. పొదలకూరు మండలంలోని కొన్ని సెగ్మెంట్లలో వందల్లో మెజారిటీ రాబోతున్నట్టు వెల్లడించారు. ఈ మండలంలో టీడీపీకి శృంగభంగం తప్పదన్నారు. ఒక్క తోడేరు సెగ్మెంట్లోనే 1500 పైచిలుకు ఓట్లు మెజారిటీని వైఎస్సార్సీపీ సాధిస్తుందని చెప్పారు. ఇదే గాలి సీమాంధ్ర మొత్తం వీస్తున్నట్టు తెలిపారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ఓటర్లు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్లు వేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల విశ్లేషణలో ఇదే సమాచారం తమకు అందినట్టు వెల్లడించారు. కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా సైనికుల్లా పనిచేయబట్టే మంచి ఫలితాలు సాధించబోతున్నట్టు కాకాణి సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని సూచించారు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకం, వైఎస్సార్‌పై అభిమానం, తాను ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధే తమ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎందరు వచ్చి కుయుక్తులు పన్నినా లాభం లేదన్నారు. చేసిన అభివృద్ధి చూపి ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. కాకాణి వెంట పార్టీ నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెంపులూరు శ్రీనివాసులుగౌడ్ తదితరులు ఉన్నారు.