satavahana universtiy
-
రేపు పీజీ స్పాట్ అడ్మిషన్లు
కమాన్‌చౌరస్తా : శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కామర్స్ కళాశాలల్లో గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సూరెపల్లి సుజాత బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్, సోషియాలజీ, తెలుగు, ఎంకాంలలో మిగిలన సీట్లకు ప్రవేశాలుంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం పది గంటలకు హాజరుకావాలని సూచించారు. -
యూరప్ దర్శకురాలికి ఎంపీ విందు
సప్తగిరికాలనీ: శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడురోజులుగా థియేటర్ వర్క్‌షాప్‌పై అవగాహన కల్పిస్తున్న యూరప్ దేశానికి చెందిన దర్శకురాలు మాయాతెంగ్బర్గ్ గిరిచిన్ను ఆదివారం ఎంపీ వినోద్‌కుమార్ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమెతో మాట్లాడారు. స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీ సంస్కృతులు అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ సాధనలో భాగంగా ఆర్ట్ కల్చర్‌కు ప్రాధాన్యతను పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు.