Satellite remote sensing
-
ఇక ఉపగ్రహాల సాయంతో సాగు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయాభి వృద్ధి లో ఉపగ్రహాల రిమోట్ సెన్సింగ్ కీలక పాత్ర పోషించ నుంది. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా వ్యవసాయా న్ని లాభసాటి చేసేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియో గంలోకి రానుంది. ప్రపంచంలో ఏదైనా ప్రాంత సమాచారాన్ని నిర్దిష్టంగా గుర్తించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్ ఎస్ఎస్), ఉపగ్రహ ఆధారిత భూ సమాచారం(రిమోట్ సెన్సింగ్), ఓ ప్రాంతంలోని భూమి స్థితిగతులకు (ప్రాక్సిమల్ డేటా) సంబంధించిన సమాచారంతో ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. భూ ఉపరితలంపై పర్యావరణ ప్రభావాన్ని మదింపు చేసేందుకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా రైతులు తమకు అనువైన పంటలు ఏమిటో, భూ సారం ఎంతో, ఒకవేళ పంటలు వేసి ఉంటే వాటి దిగుబడి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. -
ఖనిజాన్వేషణకు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్: ఎన్ఎండీసీ
ఎన్ఆర్ఎస్సీతో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖనిజాన్వేషణ ప్రక్రియలో ఎన్ఎండీసీ ముందడుగు వేసింది. ఇక నుంచి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ విధానాన్ని ఉపయోగించనుంది. ఖనిజ నిల్వలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమేగాక ప్రవేశయోగ్యం కాని ప్రాంతాల్లోనూ వీటి అన్వేషణకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో (ఎన్ఆర్ఎస్సీ) ఎన్ఎండీసీ గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాటిలైట్ ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించేందుకు హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కేంద్ర కార్యాలయంలో రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తారు. తవ్వకాల వల్ల పర్యావరణ ప్రభావాన్ని ఎన్ఆర్ఎస్సీ మార్గదర్శకత్వంలో ఎన్ఎండీసీ అంచనా వేస్తుంది. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో శాటిలైట్ ఆధారిత జియోలాజికల్ మ్యాపింగ్ విధానాన్ని వినియోగించనున్న తొలి కంపెనీగా ఎన్ఎండీసీ స్థానం సంపాదించింది.