sathyabhama
-
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానం పేరు చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవాల్ని చాలాసార్లు ఎదుర్కొంది. కొన్ని నెలల క్రితం జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వస్తే ఏకంగా మీదమీదకొచ్చేశాడు. అయితే గతంలో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి వల్ల చాలా భయపడ్డానని కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)'కొన్నిరోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో ఉన్నాను. మొదటి రోజు పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ దర్శకుడు.. పర్మిషన్ లేకుండా నా క్యార్‌వ్యాన్‌లోకి వచ్చేశాడు. సడన్‌గా తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అని కాజల్ తనకెదురైన భయానక అనుభవాన్ని బయటపెట్టింది.'సత్యభామ' అనే మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్న కాజల్.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. అయితే ఈమె చేతిలో ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాలైతే ఏం లేవు.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్) -
తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోక కంటకుడై! ఆఖరికి..
యావత్ భారత్ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి పండుగ లోనూ అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. వాటిని మనం అర్థం చేసుకుని ఆచరించాలి. శరత్కాలంలోని ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి జగన్మాతను దేవీ నవరాత్రులలో ఆరాధిస్తాము, దశమినాడు విజయదశమి మహా పర్వదినముగా పండుగ చేసుకుంటాము. ఆ మాసం చివరిలో, అమావాస్య నాడు కూడా జగన్మాతనే ఆరాధిస్తాము. మహాలక్ష్మీ పూజను, కుబేరలక్ష్మీ పూజను చేసుకుంటాము. మాస ప్రారంభంలోనూ, అంతమందు చివరి దినము నాడు కూడా జగన్మాతనే ఆరాధించడం వల్ల ఆశ్వయుజ మాసమంతా జగన్మాతను ఆరాధించిన ఫలం మనకు లభిస్తుంది. అమావాస్యను, పౌర్ణమిని కూడా "పూర్ణ తిథులు" అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనము దీపావళి పండుగను జరుపుకొంటాము. ఈ దీపావళి కూడా పెద్ద పండుగే ! ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనము అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి, అని - ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము, దేవతలనారాధిస్తాము. "దీపానాం ఆవళీ - దీపావళీ." దీపావళి అంటే దీపముల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమాచరించటము, పితృ తర్పణాలివ్వటము, దానము చెయ్యటము, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటము, ఆకాశదీపము పెట్టటము. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గ దర్శనమవుతుంది. మన సనాతన ధర్మంలో 'అగ్ని ఆరాధన' ముఖ్యమైనది. "అగ్ని మిచ్ఛధ్వం భారత !" అన్నారు మహర్షులు. భా అంటే కాంతి, ప్రకాశము. కాంతి యందు, ప్రకాశమునందు, వెలుగు నందు అనగా జ్ఞానమునందు రతి కలవారు, అభినివేశము, ఇచ్ఛ కలవారు భారతీయులు. అంటే జ్ఞానాన్ని కాంక్షించేవారు. అసలైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని కోరి సాధన చేసేవారు భారతీయులు. ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సంప్రదాయము. మన పూర్వీకులు నిత్యాగ్నిహోత్రులు, నిరతాన్నదాతలు. నిత్యము 24 గంటలు 365 రోజులు ప్రతి ఇంట్లోనూ ఒక గదిలో - అగ్ని గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్ని అసలు ఎప్పుడూ నిధనమవదు. అది మన సంప్రదాయము. అగ్నిలో సర్వదేవతలు ఉంటారు. ఒక్క దీపము వెలిగించి అక్షింతలు వేసి నమస్కరిస్తే, సర్వదేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది. "అగ్ని ముఖా వై దేవాః" అన్నారు. మనము ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపమును, దీపజ్యోతిని ఆరాధిస్తాము. ఏ శుభకార్యములు చేసినా, ఏ వేడుకలు చేసినా, గొప్ప ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, దైవ ప్రార్థన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకుంటాము. వివాహములు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాము. అంటే దీపము, దీపములో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపము వెలిగించటము అన్నది అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలియజేయటానికి, అందరి చేత దీపములు వెలిగించబడటానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. "దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః" దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము. ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాము. వారి సంతానమే నరకాసురుడు అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాము. కార్తీకమాసం కూడా దీప ప్రజ్వలనకు అత్యంత ప్రధానమైన మాసము. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకములో అయ్యవారిని - పరమశివుడిని ఆరాధిస్తాము. హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహవతారంలో వచ్చి హిరణ్యక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, 'కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా' అని ఆలోచించి, "నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి" అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచ జన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. ఇంక, నరకుడి చెరలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించినప్పుడు వారందరూ శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా వరించారు. 16 వేల మంది అంటే అర్థం ఏమిటి? అంటే, మనకు కల ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మనోబుధ్యహంకార చిత్తములు అనబడే అంతరింద్రియము - అంతఃకరణము. ఇవన్నీ కలిసి 16. ఈ 16 అజ్ఞానంతో ఆవరించబడి ఉండటమే నరకుడు 16 వేల మందిని చెరబట్టటం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు, మనసు, అంతఃకరణము అన్నీ పరమాత్మ వైపు మరలుతాయో, అప్పుడు - ఆ జీవుడు పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అతని అజ్ఞానము నశించి జ్ఞానవంతుడై పరమాత్మను చేరుతాడు. అదే శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది శ్రీకృష్ణుడిని వరించటము అని అంటే ! దీపావళి పండుగను అజ్ఞానము మీద జ్ఞానము యొక్క, అంధకారము మీద వెలుగు యొక్క విజయముగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయముగాను చెప్పవచ్చును. "అసతోమా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ." నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాయిద్యములు మ్రోగించి సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం చెప్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి. -రచన : సోమంచి రాధాకృష్ణ చదవండి: Walnut Halwa: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! -
Deepavali 2021: ఈమె నా సత్యభామేనా.. ఇంత బేలగా..
తెలతెలవారుతోంది. సత్యభామ నెమ్మదిగా మేల్కొంటోంది. నిద్ర మంచం మీద నుంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడికి ప్రణామం చేసి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి, నెమ్మదిగా లేచి వచ్చింది. ఆ రోజు సత్యభామ మనసును బాధ, ఆనందం రెండూ కష్టపెడుతూనే సంతోషపెడుతున్నాయి. మానసిక సంఘర్షణతో నిండిన ఎదతో సత్యభామకు ఏ పని చేయటానికీ తోచట్లేదు. తలారా స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుని మందిరానికి బయలుదేరింది సత్యభామ. ఎన్నడూ లేనిది ఆ రోజు తెలుపునలుపుల సమ్మిళితమైన పట్టు బట్టలు ధరించింది. తల నిండా మల్లెలు తురుముకుంది. ముత్యాల హారం ధరించింది. సత్యభామ ముగ్ధలా ముద్దుగా మురిపెంగా కనిపస్తూనే అంతలోనే ఆమెలో ఏదో తెలియని దిగులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గమనము విడిచిపెట్టకుండా వేగంగా శ్రీకృష్ణ మందిరం చేరింది సత్యభామ. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు గుమ్మం దగ్గరే స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాడు.సత్యలోని రెండు భావాలను వెంటనే గమనించాడు నల్లనివాడు. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నడిపించుకుంటూ తీసుకువెళ్లి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంతవరకు ఎంతో కొంత గంభీరంగా ఉన్న సత్య కళ్లలో నీళ్లు ఊటలా ఊరి ఒక్కసారిగా ఒళ్లంతా తడిపేశాయి. ఈమె నా సత్యభామేనా, ఇంత బేలగా విలపిస్తోంది. ఎంతటి ధైర్యవంతురాలు, యుద్ధం చేసిన అరివీరభయంకర నారి.. అనుకుంటూ తన చేలాంచలముతో ఆమె కన్నీరు మృదువుగా తుడిచాడు. ఆశ్వాసన లభించటంతో ఆమెలోని దుఃఖం వరదలా పొంగుకొచ్చింది. ఆమెను పూర్తిగా దుఃఖపడనిచ్చాడు. కొంత సేపటికి ఆమె మనసు కొద్దిగా కుదుటపడింది. కొంత సేపటికి తన మనసును తానే కుదుటపరచుకుని... శ్రీకృష్ణా.. నన్ను ఇలా చూస్తే నీకు కొత్తగా అనిపిస్తోంది కదూ... నిజమే.. నేను ధైర్యవంతురాలినే కాని, భీరురాలిని కానని నీకు తెలుసు. అటువంటి నేను కంటనీరు పెట్టుకోవటం నీకు ఆశ్చర్యంగా అనిపించటంలో తప్పులేదులే...అంటూ - తన దుఃఖానికి కారణం నెమ్మదిగా వివరించటం ప్రారంభించింది. శ్రీకృష్ణా... ఈ రోజు ప్రత్యేకత నీకు తెలుసు కదూ.. అంటూ తన ఖేదానికి కారణం చెప్పడానికి సన్నద్ధురాలైంది. ఎందుకు తెలీదు. నువ్వు నాకు విజయం తెచ్చిపెట్టిన రోజు ఈ రోజే కదా... అన్నాడు నవ్వురాజిల్లెడు మోముతో. అవును.. అది ఒక విషయం. ఆ విషయం తలచుకున్నప్పుడల్లా నా మనసు సంబరపడుతుంది. అదొక్కటే కాదు కదా... మరో విషయం కూడా ఉంది కదా.. అంది మనసులోని దుఃఖాన్ని మాటల ద్వారా పలుకుతూ... ఎందుకు గుర్తు లేదు.. నరకాసుర సంహారం జరిగింది ఈ రోజే కదా.. అన్నాడు గంభీరంగా. అదే.. అదే.. ఆ సంఘటనే నా మనసుని కలవరపెడుతుంది.. అంది కంట నీరు బయటకు రానీయకుండా తడిసిన గుండెతో. అలా అంటావెందుకు. స్వయంగా నువ్వే కదా నరకాసురుని సంహరించడానికి సహకరించావు... అన్నాడు ఏమీ తెలియనట్లుగా ఆ లీలామానుష విగ్రహుడు. సత్యభామ అదేమీ గమనించనట్లుగా... నిజమే... ఎంతైనా వాడు నా పుత్రుడు కదా. ఒక తల్లిగా నాకు ఆ బాధ ఉంటుంది కదా. లోకరక్షణ కోసం నేను నరకుడిని సంహరించినా, కన్నప్రేమ ఒక పక్కన బాధిస్తూనే ఉంటుంది కదా.. అంది గద్గద స్వరంతో సత్యభామ. సత్యా... ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకుందామా. నరకుడిని అసురుడు అన్నాం. అంటే వాడిలో రాక్షస గుణాలు ఉన్నాయనే కదా అర్థం. మనం రాక్షస గుణాలను సంహరించాం. అందుకే నరకుడి పేరు మీదనే కదా నరక చతుర్దశి అని ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇతర పండుగలన్నింటికీ ఇలా అసురుల నామాలు లేవు కదా. మనం మనలోని రాక్షస లక్షణాలను పోగొట్టుకుని, మనలో ఉన్న జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించుతూనే ఉండాలి కదా... అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు జగద్గురువు. అసలు నువ్వు ఇలా మాట్లాడటమే నాకు వింతగా ఉంది. ఈ సృష్టికి మూలమైన లలన ఇంత బేలగా మాట్లాడొచ్చా... అంటుంటే సత్యభామ.. వెంటనే తనలోని బేలతనాన్ని పక్కకు పెట్టి, గంభీరంగా..నిజమే కృష్ణా.. వాస్తవానికి ఈ రోజు నీతో ఈ విషయమే మాట్లాడాలనుకున్నాను. కాని ఎందుకో నా మనసు తడి కావటంతో, ముందుగా నాలోని బాధను నీతో పంచుకున్నాను. నువ్వన్నది నిజమే. ఈ సృష్టికి కారణమైన స్త్రీకి ఇప్పుడు ఎందుకు సముచిత స్థానం లేదో అర్థం కావట్లేదు. మానవులందరూ పూజించే దేవుళ్లందరూ తమ భార్యల పేరుతోనే ప్రసిద్ధులు కదా. పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు.. ఇలా.. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు.. అంటూ సందేహం వెలిబుచ్చింది సత్యభామ. ఏమో ఎక్కడ జరిగిందో తెలియట్లేదు. త్రేతాయుగంలో మా పినతల్లి కైకమ్మ మా తండ్రిగారయిన దశరథ మహారాజుకి యుద్ధంలో సహకరించింది కదా. ద్వాపర యుగం వరకు ఎన్నడూ స్త్రీపురుష వివక్ష లేదు. మరి కలియుగంలో ఎందుకు వచ్చిందో... అంటూ ఏమీ తెలియనివాడిలా ఉపదేశం చేశాడు పరాత్పరుడు. సత్యభామ చిరునవ్వుతో... వీటికితోడు.. ఎవరికైనా కోపం వస్తే చాలు... సత్యభామలా అలిగింది అంటూ పోలుస్తారే కాని, సత్యభామలా ధైర్యంగా ఉన్నవారిని నాతో ఎందుకు పోల్చరో తెలియట్లేదు. ఆడవారు ఆదిశక్తి స్వరూపం కదా... ఆ శక్తి ఎందుకు సన్నగిల్లిపోతోందో... ఆ ఆత్మాభిమానం ఎక్కడకు పారిపోతోందో అర్థం కావట్లేదు కృష్ణా... అంటూ తన కొంగును నడుముకి బిగిస్తూ పలికింది సత్య. అవును సత్యా... ఈ సృష్టి నిత్యం కొనసాగటం కోసం ఆడమగ అనే ప్రాణులను సృష్టిస్తే... మానవులు మాత్రం ఆడవారు తక్కువ, మగవారు ఎక్కువ అనే స్థితికి చేరుతున్నారు. ఇది మంచిది కాదు... అంటూ హితోక్తులు పలుకుతున్నాడు. దీపావళి పండుగలోని పరమార్థం అదే కదా... మన ఇంటిలోని రాక్షస గుణాలను పారద్రోలి, దైవలక్షణాలు అనే దీపాన్ని వెలిగించమని మనం ఈ పండుగ ద్వారా చెబుతున్నాం. దీపపు కాంతులతో పాటు, మానసిక ఉల్లాసం కోసం బాణాసంచా కాల్చుకోమంటున్నాం. కాని వీటిలోని పరమార్థం పక్కకు వెళ్లిపోతోంది. శారీరక ఆరోగ్యం దిగజారిపోయేలా చెవులు చిల్లులు పడే మందుగుండు సామగ్రి కాలుస్తున్నారు. సామాన్యంగా నిరాడంబరంగా చేసుకోవలసిన పండుగను అప్పులు చేసి ఆర్భాటంగా చేసుకుంటున్నారు... అంటూ సత్యభామ పలుకుతుంటే.. శ్రీకృష్ణుడు సన్నగా నవ్వుతూ...నిజమే సత్యా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలేమో.. అన్నాడు. ►వైజయంతి పురాణపండ (సృజన రచన) -
సొగసు చూడ తరమా..!
కళ అది కూచిపూడి నృత్యాలు జరిగే వేదిక. వ్యాఖ్యాత వచ్చి ‘‘ఇప్పుడు ఓ చిన్నారి భామాకలాపం ప్రదర్శిస్తుంది’’ అని చెప్పారు. ఓ పదమూడేళ్ల చిన్నారి వచ్చి సత్యభామలా సొగసులు పోతూ... తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మదిని దోచింది. ప్రేక్షకులు పులకించిపోయారు. వ్యాఖ్యాత తిరిగి వేదికపైకి వచ్చి... ఇప్పటి వరకు మీ ముందు నృత్యం చేసిన చిన్నారి బాలిక కాదు బాలుడని చెప్పారు. అంతే... సభాసదులందరూ నిశ్చేష్టులయ్యారు. నాటి నుంచి నేటి వరకూ అలా ఎందరినో అబ్బురపరుస్తూనే ఉన్నాడు... నెల్లూరు, రంగనాయకులపేటకు చెందిన విక్రమ్. విక్రమ్ పసితనంలోనే బుల్లితెరలో వచ్చే పాటలకు తగ్గట్లుగా పాదాలు కదపడాన్ని గమనించిన తల్లిదండ్రులు ముత్యాల మధురజని, రవికుమార్... అతనికి నృత్యంలో శిక్షణ ఇప్పించారు. శిక్షణాలయంలో చేరిన ఆరు నెలలకే వేదికలపై ప్రదర్శన ప్రారంభించిన విక్రమ్... ఇప్పటి వరకు వందల ప్రదర్శనలిచ్చాడు. చీరచుట్టి, గజ్జెకట్టి విక్రమ్ అచ్చమైన స్త్రీమూర్తిలా వేదిక మీద ఆడుతుంటే... చూసినవాళ్లంతా సొగసు చూడతరమా అంటూ మైమరచిపోతారు. ఓసారి అలా ప్రదర్శన ఇస్తున్నప్పుడు చూసిన అతడి అమ్మమ్మ, తాతయ్యలు... తమకు మనవరాలు లేని లోటును విక్రమ్‌తోనే ఎందుకు తీర్చుకోకూడదు అనుకున్నారు. అందుకే పనిగట్టుకుని స్త్రీ వేషంలో వివిధ పాత్రల కోసం శిక్షణ ఇప్పించారు. నాటి నుంచి నేటి వరకూ విక్రమ్ స్త్రీ పాత్రల్లో అలరిస్తూనే ఉన్నాడు. తారంగం, భామనే సత్యభామనే, భామాకలాపం, జతీస్వరం, బ్రహ్మాంజలి, సప్తపది, కృష్ణశబ్దం, శివపాదం, మంజీరనాదం తదితర నృత్యాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శించి మన్ననలందుకున్నాడు విక్రమ్. ‘కాంచన’ సినిమాలోని ఓ పాటలో కూడా నర్తించాడు. అయితే కేవలం స్త్రీవేషంలో మాత్రమే నర్తించడు విక్రమ్. అబ్బాయి వేషంలో కూడా అదరగొట్టేస్తాడు. ఇతని ప్రతిభ చూసి ‘షిరిడీ జైసాయిరాం’ చిత్రంలో ఓ నృత్యప్రదర్శనకు చాన్స్ ఇచ్చారు. అదే విధంగా పలు చిత్రాలలోనూ నటించే అవకాశాలు దగ్గరకు వచ్చాయి.