Sathyaprabha
-
భారీ గిఫ్ట్.. ఇవ్వాల్సిందే
సాక్షి, చిత్తూరు :ఎన్నికలు రావడంతో ‘గిఫ్ట్’ సమర్పించుకోవాలని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను పార్టీ అధిష్టానం ఆదేశించడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె మొండికేసినా పాత చిట్టాలు వెలికి తీయడంతోపాటు ఓ బంగ్లా వివాదాన్ని తెరపైకి తెచ్చి గుర్తు చేశారట. దీంతో ఇక తప్పనిసరై ఆమె బరిలోకి దిగారని ఆ పార్టీ నేతలు గుసగుసలుపోతున్నారు. చిత్తూరు అసెంబ్లీ సీటును త్యాగం చేసి.. రాజంపేట ఎంపీ సీటు నుంచి బరిలో నిలవాల్సొచ్చిందని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఖర్చు భరించడంతోపాటు చంద్రగిరి ఎన్నికల ఖర్చు కూడా భరించాలని షరతు విధించారట. బాబు తీరుతో లోలోన రగిలిపోతూనే పైకి నవ్వుతూ నటించాల్సి వస్తోందని ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ రాజకీయాలు నాకొద్దు!
చిత్తూరు టీడీపీలో ముసలం తీవ్ర రూపం దాల్చింది. అసంతృప్తి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఏఎస్ మనోహర్ పేరును ఆపార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించేసింది. అయితే మనోహర్‌ను తొలగించి సత్యప్రభకే సీటు ఇవ్వాలంటూ పలువురు టీడీపీ కార్పొరేటర్లు.. పార్టీ నాయకులు సోమవారం రోడ్డుపై నిరసన వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే టీడీపీను ప్రజలు ఛీకొడతారంటూ అధిష్టానం యోచిస్తోంది. చిత్తూరు అర్బన్: రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా తాను నష్టపోవడంతో పాటు ప్రశాంతత లేకుండాపోయిందంటూ సత్యప్రభ తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. చిత్తూరు నుంచి పోటీ చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్న కార్యకర్తలతో సత్యప్రభ గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘సొంత డబ్బు పెట్టి గెలిస్తే.. ఎందుకూ పనికిరానివారి వద్ద మాటపడ్డాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నోటికొచ్చినట్లు నన్ను మాట్లాడినారు. ఇక చాలు.. నన్ను వదిలేయండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. నాకు ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంలేదు. ఎవరినైనా నిలబెట్టండి, ఎవరికైనా పనిచేసుకోండి..’ అంటూ సత్యప్రభ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. మోసపోనున్న మనోహర్ చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏఎస్ మనోహర్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేసుకున్నారు. తనకున్న పాత పరిచయస్తుల ఇళ్లకు వెళ్లడం.. ఈసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. ఆర్థికంగా కూడా మందీ మార్బలాన్నికూడగట్టుకుని ప్రధాన టీడీపీ నేతలను కలుస్తున్నారు. ఇలాంటి సమయంలో సత్యప్రభకు టికెట్టు ఇవ్వాలంటూ ఆమె మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి రావడం అంతా పథకం ప్రకారమే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని నమ్మి వచ్చిన మనోహర్‌ను మోసం చేసి వెన్నుపోటు పొడవనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు మనోహర్ వద్ద ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక స్థోమత లేదని కూడా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడం ఒక ఎత్తయితే ద్వితీయశ్రేణి నాయకులకు సత్యప్రభ నుంచి పెద్ద మొత్తంలో ఆర్థికసాయం అందదనేది అసలు సత్యం. చిత్తూరు టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ కొందరు సీఎం ఎదుట పంచాయతీ పెట్టడానికి అమరావతికి బయలుదేరగా మరికొందరు ఓ అడుగు ముందుకేసి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో బీ–ఫామ్ చేతికొచ్చేంత వరకు టీడీపీ అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతున్నారు. కోడ్ లెక్కలేదా? మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నవేళ టీడీపీ నేతలు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. రాత్రిళ్లు గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నినాదాలు చేయడం, గుమి కూడడం ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పోలీసు శాఖ స్పందించకుండా కలెక్టర్ చూసుకోవాలని, రెవెన్యూ అధికారులు పరిశీలించాలని తప్పించుకుంటున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులపట్ల వ్యవహరిస్తున్న తీరుకు ఇదే నిదర్శమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. -
నాకు టికెట్ వద్దు..
సాక్షి, చిత్తూరు, : ఎమ్మెల్సీ దొరబాబుపై చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ మీ వల్లే నష్టపోయిందని మండిపడ్డారు. చిత్తూరు కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం మొత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగింది. ఒక సామాజికవర్గాన్నే ప్రోత్సహించడం వల్ల నియోజకర్గంలో పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే సత్యప్రభ దొరబాబుపై మండిపడ్డారు. ‘బుల్లెట్ సురేశ్‌ను పార్టీలోకి చేర్చుకుందాం అంటే స్మగ్లర్ అంటూ అడ్డుపడ్డారు. ఆయన పార్టీలోకి వచ్చి ఉంటే తమిళుల ఓట్లయినా దక్కేవి కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీసీలకు దగ్గరవుదాం అని మాపాక్షి మోహన్‌ను చేరదీస్తే అలకబూనుతారు.. అన్ని పదవులు మీ వాళ్లకే కావాలంటే పార్టీ బతికేదెట్టా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోటీ చే యను. మీ ఇష్టం వచ్చిన వాళ్లకు టికెట్ తెచ్చుకోం డి.. పని చేస్తా’ అని అందరి ముందు ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. ఇంతలోనే వసంతకుమార్ కల్పిం చుకుని అయ్యిందేదో అయ్యింది.. ఎవరో ఒక రు బాధ్యత వహించాలి. వెళ్లిన వాళ్లను వెనక్కి తెచ్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే కల్పించుకుని ఎవరో ఎందుకు బాధ్యత వహించాలి. దీనికి ప్రవీణే కా ర ణం. ఆయనే వెనక్కి తీసుకురావాలి అన్నారు. ‘వారి ని తీసుకొస్తే ఏం చేస్తారు.. అది చెప్పండి. ఏం చేయకుండా ఎలా వస్తారు’ అని సమాధానమిచ్చా రు. టికెట్ హామీ ఇవ్వండి టికెట్ హామీ ఇస్తే టీడీపీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని సీకే బాబు అంటున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీలో చేరితే టికెట్ తర్వాత ఆలోచిస్తామని అధిష్టానం నుంచి సమాధానం వచ్చిందని, ఆ విషయం సీకే బాబుకు తెలిపామని, ఇక ఆయన ఇష్టమని నాయకులు నిట్టూర్చారని సమాచారం. -
దేశంలో సం‘కుల’ సమరం!
చిత్తూరు ఎమ్మెల్యే, మేయర్ మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు అభివృద్ధి పనుల్లో సంప్రదించడంలేదని ఎమ్మెల్యే సత్యప్రభ మండిపాటు కమిషనర్ బదిలీ వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇటీవల ఎమ్మెల్యే ఇఫ్తార్ విందుకు మేయర్ వర్గం గైర్హాజరు మేయర్ వైఖరిపై లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తెలుగుదేశంలో సం‘కుల’ సమరం మొదలైంది. అధికారం చేపట్టిన అనతికాలంలోనే చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కఠారి అనూరాధ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అభివృద్ధి పనుల్లో తనను సంప్రదించడం లేదని మేయర్‌పై సత్యప్రభ ఆగ్రహంగా ఉండగా.. అభివృద్ధి విషయంలో ప్రతి చోటా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మేయర్ భర్త కఠారిమోహన్ మండిపడుతున్నారు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలు చినికిచినికి లోకేశ్‌కు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లాయి. దీన్నిబట్టే చిత్తూరులో ఇద్దరు ‘మహిళా సారథుల’ మధ్య వర్గపోరు ఏ స్థాయిలో నడుస్తుందో ఇట్టే తెలుస్తోంది. సాక్షి, చిత్తూరు: చిత్తూరు కేంద్రలోని కీలక అధికార పీఠాలను ముగ్గురూ మహిళలే అధిరోహించారు. ఎమ్మెల్యేగా డీకే.సత్యప్రభ, మేయర్‌గా కఠారి అనురాధ, జెడ్పీ చైర్‌పర్సన్‌గా గీర్వాణి అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఏ కార్యక్రమానికి వెళ్లినా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. ముగ్గురూ మహిళలే కావడంతో ‘పీఠం మహిళలకు..పెత్తనం మగాళ్లకు’ అనే రీతిలో పాలన సాగుతోంది. జెడ్పీ చైర్పర్సన్ వ్యవహారాలను భర్త చం ద్రప్రకాశ్, మేయర్ నిర్ణయాలను ఆమె భర్త కఠారి మోహ న్, ఎమ్మెల్యే సత్యప్రభకు అండగా బద్రీనారాయణ, ఆయన తనయుడు శ్రీనివాస్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత దొరబాబు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్తూరు పాలన వీరి చేతులమీదుగానే నడుస్తోం ది. ఈ అంశమే వివాదాలకు కారణమైంది. అయితే ప్రస్తు తం ఎమ్మెల్యే, మేయర్ మధ్యనే వివాదం నడుస్తోంది. వివాదానికి బీజం ఇక్కడే దొడ్డిపల్లె సబ్‌స్టేషన్‌లో సిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కోసం ఎమ్మెల్యే, మేయర్ చెరో వ్యక్తిని సిఫార్సు చేస్తూ ఎస్పీడీసీఎల్ అధికారులకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఎమ్మె ల్యే, ఎంపీలు సిఫార్సు చేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అధికారులు చెప్పారు. అయినప్పటికీ మేయర్ తన లేఖ ను వెనక్కు తీసుకోలేదని, దీంతో సత్యప్రభ మండిపాటుకు గురయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అక్క డి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. అలాగే చిత్తూరు అభివృద్ధి కోసం డీకే.సత్యప్రభ 21 అంశాలతో ఓ నివేదికను తయారు చేసుకుని సీఎం చంద్రబాబును కలిశారు. దీనికి సీఎం ఆమోదముద్ర వేసి, జాబితాలోని అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో చిత్తూరు కార్పొరేషన్‌కు సంబంధించి కలెక్టర్, ఎమ్మెల్యే సత్యప్రభ కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను పిలిచి సమీక్ష నిర్వహించారు. దీనిపై మేయర్ భర్త కఠారి మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమకు తెలీకుండా సమావేశానికి ఎలా వెళ్లారని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన సమావేశంపై మేయర్‌ను ఆహ్వానించక పోవడం, కమిషనర్‌ను పిలవడంపై ఎమ్మెల్యేపై కఠారి మోహన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించాలని మోహన్ గట్టిగా ఉన్నట్టు సమాచారం. కమిషనర్‌ను బదిలీ చేయించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సత్యప్రభ అదేస్థాయిలో స్వరం వినిపించినట్టు తెలిసింది. మరింత వివాదం రేపిన రూ.5 కోట్ల పనులు కార్పొరేషన్లో శానిటేషన్, వాటర్ ట్యాంకర్లు, పైపులైన్ల తో పాటు పలు పనులకు సంబంధించి రూ.5 కోట్ల టెండర్లను శేఖర్‌బాబు అనే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు మేయర్ వర్గం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మంచినీళ్ల సరఫరా టెండర్‌ను దక్కించుకున్న శేఖర్‌బాబుకు తక్కిన పనులు ఈనెల 11న జరగబోయే పాలకవర్గ సమావేశంలో దక్కనున్నాయి. ఈ పనులు శేఖర్ బినామీగా కఠారి మోహన్ దక్కించుకుంటున్నారని కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.5 కోట్ల పనులు తమకు తెలీకుండా, తమ ప్రమేయం లేకుండా ఎలా కట్టబెడతారని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నించినట్టు తెలిసింది. తమతో చర్చించి నిర్ణయం తీసుకోకుండా ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడగా, తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల్లో మీ జోక్యం ఏమిటని ఎమ్మెల్యేపై అదేస్థాయిలో మోహన్ స్పందించినట్టు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో గత నెల 27న ఎమ్మెల్యే తన ఇంట్లో ‘ఇఫ్తార్ విందు’ను ఏర్పాటు చేశారు. దీనికి జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు టీడీపీలోని అన్ని వర్గాలు హాజరయ్యాయి. అయితే మేయర్ వర్గం పూర్తిగా గైర్హాజరైంది. ఈ క్రమంలో రెండురోజుల కిందట నారా లోకేశ్‌ను సత్యప్రభ కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 5 నెలల పాటు వేచి చూద్దామని లోకేశ్ సూచించినట్టు టీడీపీ జిల్లా కార్యదర్శి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను సామరస్యంగా చేసుకుంటూ పోతుంటే ఎమ్మెల్యే ఇలా తమపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారని, అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని మోహన్ టీడీపీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రెన్నెళ్లలోనే విభేదాల నడుమ పాలన సాగిస్తున్న వీరు ఐదేళ్ల పాటు ఎలా కలిసి ప్రయాణం సాగిస్తారో వేచి చూడాల్సిందే!