సత్యప్రభ దొరబాబు
సాక్షి, చిత్తూరు, : ఎమ్మెల్సీ దొరబాబుపై చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ మీ వల్లే నష్టపోయిందని మండిపడ్డారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 8 మంది కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం మొత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగింది. ఒక సామాజికవర్గాన్నే ప్రోత్సహించడం వల్ల నియోజకర్గంలో పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే సత్యప్రభ దొరబాబుపై మండిపడ్డారు. ‘బుల్లెట్ సురేశ్‌ను పార్టీలోకి చేర్చుకుందాం అంటే స్మగ్లర్ అంటూ అడ్డుపడ్డారు.
ఆయన పార్టీలోకి వచ్చి ఉంటే తమిళుల ఓట్లయినా దక్కేవి కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీసీలకు దగ్గరవుదాం అని మాపాక్షి మోహన్‌ను చేరదీస్తే అలకబూనుతారు.. అన్ని పదవులు మీ వాళ్లకే కావాలంటే పార్టీ బతికేదెట్టా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోటీ చే యను. మీ ఇష్టం వచ్చిన వాళ్లకు టికెట్ తెచ్చుకోం డి.. పని చేస్తా’ అని అందరి ముందు ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. ఇంతలోనే వసంతకుమార్ కల్పిం చుకుని అయ్యిందేదో అయ్యింది.. ఎవరో ఒక రు బాధ్యత వహించాలి. వెళ్లిన వాళ్లను వెనక్కి తెచ్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే కల్పించుకుని ఎవరో ఎందుకు బాధ్యత వహించాలి. దీనికి ప్రవీణే కా ర ణం. ఆయనే వెనక్కి తీసుకురావాలి అన్నారు. ‘వారి ని తీసుకొస్తే ఏం చేస్తారు.. అది చెప్పండి. ఏం చేయకుండా ఎలా వస్తారు’ అని సమాధానమిచ్చా రు.
టికెట్ హామీ ఇవ్వండి
టికెట్ హామీ ఇస్తే టీడీపీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని సీకే బాబు అంటున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీలో చేరితే టికెట్ తర్వాత ఆలోచిస్తామని అధిష్టానం నుంచి సమాధానం వచ్చిందని, ఆ విషయం సీకే బాబుకు తెలిపామని, ఇక ఆయన ఇష్టమని నాయకులు నిట్టూర్చారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment