dorababu
-
చంద్రబాబు వంటి నిండా అవినీతి మచ్చలే: పెండెం దొరబాబు
-
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే దొరబాబు
-
ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు జిల్లాలు పర్యటిస్తున్నారు
-
గంటా అనుచరుడు దొరబాబు ఇంట్లో సీఐడీ సోదాలు
విశాఖపట్నం: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో అరెస్టయిన ఏయూ దూరవిద్య కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) కె.దొరబాబు ఇంట్లో సీఐడీ పోలీసులు బుధవారం తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో గంటాకు అనుచరునిగా ఉంటూ అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో దొరబాబు పాత్ర ఉండటంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆయన గదిని ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏయూ దూరవిద్య కేంద్రం అధికారులు సీజ్ చేశారు. నారాయణకు మధ్యంతర ముందస్తు బెయిల్ సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో దళిత, బలహీనవర్గాల రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు బుధవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 14 వరకు మూడు నెలలు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు నెలలూ నారాయణను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తుది విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ 2020లో నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజధానికి సంబంధించిన మరో కేసులో హైకోర్టు పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, చికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ వాదనను ఏఏజీ తోసిపుచ్చారు. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉన్నందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత) -
వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉంది : దొరబాబు
-
హైపర్ ఆదిపై దొరబాబు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!
హైపర్ ఆది.. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, టైమింగ్ పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్. ఓ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్ మీనింగ్ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి శృతి మించి విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు. అయితే హైపర్ ఆది టీంలో పనిచేసే దొరబాబు, పరదేశి గతంలో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ ఘటన జరిగి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ షోలో వారిని ఉద్దేశిస్తూ ఆది వేసే పంచ్ డైలాగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ వారిని టార్గెట్ చేస్తునే ఉంటాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న దొరబాబు భార్య ఆమూల్య ఆది గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అడగ్గా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటివాడిని పెళ్లి చేసుకోమని చెబితే దొరలాంటివాడు ఎందుకని దొరబాబునే చేసుకున్నఅంటూ పంచ్ వేసింది. ఇక వెంటనే ఆది ‘నీకు ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది’ అంటూ ఆమెపై కౌంటర్ వేశాడు. ఇక ఆ తర్వాత ఆమూల్య మాట్లాడుతూ.. ‘మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరూ మాకు తోడుగా లేరు. ఇక మాకు ఎవరు లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకు వచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో మాకు సాయం చేసి ఆదుకున్నాడు. అందుకే ఆది నెంబర్‌ను మా ఫోన్లో గాడ్ అని సేవ్ చేసుకున్నాం’అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎప్పుడు ఎదుటి వారిపై పంచ్ డైలాగ్‌లు వేస్తూ ఆటపట్టించే ఆది ఈ కోణం కూడా ఉందా అంటూ నెటిజన్లను కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: వర్షపై బాడీషేమింగ్ చేసిన హైపర్ ఆది గుడ్‌న్యూస్ చెప్పిన వర్ష, ఆ వెంటనే గిఫ్ట్‌తో పార్టీకి! -
వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని కారుతో ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ
యాదమరి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం టీడీపీ రచ్చకు దిగింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దొరబాబు కారులో హల్చల్ చేశారు. ఆయన కారు ఢీకొనడంతో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. యాదమరి మండలంలో 26 పంచాయతీలకుగాను సర్పంచి పదవులకు 142 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ నాయకులను తన కారులో ఎక్కించుకుని నామినేషన్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. జోడిచింతల వద్ద రహదారి పక్కగా వెళుతున్న ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదకు దూసుకెళ్లారు. కారు ఢీకొని పడిపోయిన వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్సీ కారులో వేగంగా వెళ్లిపోయారు. ఇరువర్గాల మధ్య గొడవలు మొదలవడంతో పోలీసులు చెదరగొట్టారు. తమ పార్టీ కార్యకర్తలను కారుతో ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ప్రాథమిక విచారణ నిర్వహించిన ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి ఎమ్మెల్సీతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే టీడీపీ నాయకులు కావాలనే రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని కారుతో ఢీకొట్టిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు గుండా గిరి
సాక్షి, చిత్తూరు : పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనకు సంబంధం లేని యాదమర్రి మండలంలో తిష్ట వేసిన దొరబ్బాబు ఆదివారం నాడు హాల్ చల్ చేశారు. నామినేషన్స్ జరుగుతున్న యాదమర్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద తన అనుచరులతో రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో వచ్చిన దొరబాబు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దొరబాబు వల్ల పెరియం బాడీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దొరబాబు గుండా గిరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గుర్తు తెలియని వ్యక్తులు దొరబాబు వాహనం మీద కర్రలతో కొట్టారు. దీంతో దొరబాబు తన కారును వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదికి పోనిచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మీద స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. దొరబాబు దాదా గిరిని ఖండించారు. సంబంధం లేని మండలానికి వాక్కువహిన దొరబాబు రౌడీ ఇజం చేశారన్నారు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే యాదమర్రిలో దొరబాబు టీడీపీకి చెందిన ఓ వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతున్నారని, ఇది గిట్టని మరో వర్గం నేతలే ఆయనపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. -
శానిటైజ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు
-
పిఠాపురంలో టీడీపీకి షాక్
పిఠాపురం: తమకు కంచుకోటగా చెప్పుకునే పిఠాపురంలో టీడీపీ నేతలకు పట్టణ మహిళలు షాకిచ్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 200 మంది మహిళా నాయకులు, కార్యకర్తలు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పిఠాపురం మూడవ వార్డుకు చెందిన కె.నాగలక్ష్మి, అరుణశ్రీ ఆధ్వర్యంలో బుధవారం సుమారు 200 మంది మహిళా కార్యకర్తలు నాయకులు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. మహిళలను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే మహిళలు అధిక శాతం మంది వైఎస్సార్ సీపీలోకి వస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో మహిళలను నమ్మించి నట్టేటముంచిదని డ్వాక్రా మహిళలను అప్పుల పాలు చేసిందని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో మహిళలందరికీ అన్ని వేళలా తాను అండగా ఉంటానని పథకాలు మహిళలకు ఎటువంటి పైరవీలు లేకుండా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు బాలిపల్లి రాంబాబు పలువురు మహిళలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన మహిళలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు. -
నమ్మకాన్ని వమ్ము చేయను..
సాక్షి, పిఠాపురం (తూర్పు గోదావరి): ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా, తనపైనా అపార నమ్మకం పెట్టుకున్నారని, తనకు రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి బుధవారం వెళుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో చర్చించేలా చేస్తానని, తద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అధికారుల ద్వారా తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ అభివృద్ధి పని కూడా ప్రారంభించడం కానీ పనులు చేపట్టడం కానీ చేయలేదని ప్రజల అంటున్నాలు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో నియోజకవర్గంలో ఎవరికీ ఒక్క పైసా సక్రమంగా ఇవ్వలేదని అంటున్నారు. మాఫీ చేయకపోయినా గత పాలక పార్టీ టీడీపీ నేతలకు ఏమీ పట్టలేదని, టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉందని అంటున్నారు. ప్రజలు చేస్తున్న ఈ విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజల సమస్యలను త్రికరణ శుద్ధిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని దొరబాబు హామీ ఇచ్చారు. ఇందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల సమస్యలను వివరించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. సమస్యల చిట్టా ఏలేరు ఆధునికీకరణ చేస్తా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏలేరు ఆధునికీకరణ పనులు నియోజకవర్గంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. రైతులకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం.. అందుకు రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఏలేరు ఆధునికీకరణలో అవినీతి చోటు చేసుకుందే తప్ప పనులు మాత్రం సాగలేదని రైతుల వాదన. నిధులు విడుదల చేయగానే ఏలేరు ఆధునికీకరణ సాధించినట్లుగా స్థానికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సన్మానం చేయించుకున్నారు. ఇప్పటికింకా ఏలేరు ఆధునికీకరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. పైగా ఏలేరును ఆధునికీకరణ చేసిన కీర్తిని ఆయనే ఆపాదించుకున్నారు. ఈ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కాలేజీ సమస్య తీరుస్తా.. గత టీడీపీ ప్రభుత్వం.. పాలిటెక్నిక్ కాలేజీకి స్థల సేకరణ చేయకుండానే అడ్మిషన్లు పూర్తి చేశారు. కాలేజీలో చేరిన విద్యార్థులను వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు పంపుతున్నారు. పిఠాపురం పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు అంటూ ఎంపిక చేసిన విద్యార్థులను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విశాఖ జిల్లా అనకాపల్లి తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు పంపుతున్నారు. ఈ విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఈ కాలేజీకి సొంత భవనాలను నిర్మించలేదు. ఈ కాలేజీ వ్యవహరంపై గత టీడీపీ ప్రభుత్వ తీరును ప్రజలు దుమెత్తిపోస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడిగా ప్రారంభించిన ఈ కాలేజీని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. మినీ స్టేడియం వచ్చేలా చూస్తా... దేశంలోనే పేరెన్నికగన్న క్రీడాకారులను ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఆటలాడుకోడానికి చోటు లేకుండా ఉంది. మినీ స్టేడియం నిర్మిస్తామని టీడీపీ నేతలు చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. పైగా ఉన్న ఆట స్థలాలను వేరే నిర్మాణాలకు కేటాయించి విద్యార్థులకు ఆడుకునేందుకు చోటు లేకుండా చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తామన్న హామీని తుంగలోకి తొక్కారు. క్రీడల పరంగా వెనుకబడిపోతున్నామని క్రీడాకారులు, విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి క్రీడాకారులకు మినీ స్టేడియం అందుబాటులోకి వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. మినీ హార్బర్ నిర్మాణానికి కృషి వేలాదిమంది మత్స్యకారులకు జీవన్మరణ సమస్యగా మారిన మినీ హార్బర్ నిర్మాణం.. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది. నాలుగేళ్లుగా ఇవిగో నిధులు.. అదిగో పనులు అంటూ మభ్య పెట్టారు. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. పనులూ ప్రారంభించలేదు. దీంతో వేలాది మంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సమస్యల పరిష్కారంలో ముందున్నారు. ఆయన సహకారంతో మినీ హార్బర్ నిర్మాణం పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే దొరబాబు భరోసా ఇచ్చారు. డిగ్రీ కాలేజీ భవనానికి కృషి ఎందరో విద్యావంతులకు పుట్టినిల్లుగా ఉన్న పిఠాపురంలో డిగ్రీ కాలేజీ నిర్మాణం కోసం పట్టణ ప్రజల వినతి మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు కేటాయించారు. ఆయన మరణం తరువాత నేతలు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థుల క్లాసులన్నీ ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రెండు కాలేజీలను వంటిపూట నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. డిగ్రీ కాలేజీ భవనాలను నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. పీబీసీ ఆధునికీకరణ లేక పంటలు నాశనం నాలుగు మండలాలకు ప్రధాన సాగునీటి ఆధారమైన పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) ఆధునికీకరణను తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని రైతులు విమర్శిస్తున్నారు. ఏటా సాగునీరందక, వరదల సమయంలో ముంపునకు గురై పంటలు నాశనమవుతున్నా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. అరకొర మరమ్మతుల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో పీబీసీ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. హోటల్ మేనేజ్మెంటు కాలేజీ ఏర్పాటుకు చర్యలు మండల కేంద్రం కొత్తపల్లి హైస్కూలు స్థలంలో నిర్మాణం చేపట్టిన హోటల్ మేనేజ్మెంటు కాలేజీ నిర్మాణం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ నిర్మాణ విషయంలో ఎవరైనా వేలెత్తి చూపిస్తే వేలు తీస్తా నంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగంగా హెచ్చరించారు. ఆ కాలేజీ నిర్మాణం పూర్తి చేయించడంలో విఫలమయ్యారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఎక్కడో కేటాయించిన స్థలాన్ని మార్పు చేసి హైస్కూలు స్థలంలో ఈ కాలేజీని నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా సరే తాము కట్టి తీరుతామని చెప్పిన నేతలు తెగేసి చెప్పారు. ఈ కాలేజీ విషయంలో అందరి సహకారంతో తగిన నిర్ణయం తీసుకుని కాలేజీ పూర్తయేలా చూస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. అందుబాటులోకి రాని మంచినీటి పథకం ఎన్నో ఏళ్లుగా పూర్తిగాని పిఠాపురం తాగునీటి ప్రాజెక్టు పనులు నెల రోజుల్లో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు.. హడావుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో వాటర్ టాంకును ప్రారంభింపజేశారు. ఈ ఘనకీర్తి తమదేనంటూ చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితం నీటిని విడుదల చేసిన నాయకులు వెళ్లగానే.. నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటిని అందించక పోగా ఈ ప్రాజెక్టుకు ఆదిలోనే మరమ్మతులు చేయకతప్పలేదు. దీంతో నీటి సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు ఏ రోజున పూర్తిస్థాయిలో తాగునీటిని అందించలేదు. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితి ఆ నాటి పాలకులకు కనిపించలేదని ప్రజలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. రూ.21 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు పనులు ప్రారంభించారు. ఈ పథకాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించి నాలుగేళ్లు దాటింది. ఇప్పటికీ ఈ పథకం పనులు పూర్తి కాలేదు. ఎన్నికల ముందు మంత్రి లోకేష్ చేతుల మీదుగా కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయినా చుక్క నీరు కూడా ఇవ్వలేక పోయారు. ఈ పథకాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటి సరఫరాకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. రైతు బజార్ సమస్యను... అన్ని రకాల పంటలు పండే నియోజకవర్గంలో రైతు బజార్ లేకపోవడం సమస్యగా ఉంది. గత ఎమ్మెల్యే వర్మ రైతు బజార్ పేరిట నిర్మించిన భవనాలను అప్పటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పతో ప్రారంభింపజేశారు. అయితే ఆ భవనాలు అనధికారమైనవని లోకాయుక్తా మొట్టికాయలు వేస్తూ... ఆ భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహరం టీడీపీ పాలకుల నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. దీంతో వేలాదిమంది రైతులకు రైతు బజార్ లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారు. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పధకాలను అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కోర్టులో ఉన్న ఈ కేసు పరిష్కరించేలా చేసి రైతులకు రైతు బజార్‌ను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దొరబాబు హామీ ఇచ్చారు. పిఠాపురం మెయిన్ రోడ్డు విస్తరణకు కృషి నియోజకవర్గ కేంద్రం పిఠాపురంలో మెయిన్ రోడ్డు విస్తరణను టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. అరకొరగా> చేపట్టిన పనులకు కేటాయించిన రూ.కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయాయి. కేవలం ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయించి కొంత మేర విస్తరించి ఆపై వదిలేశారు. పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అసంపూర్తిగా ఉన్న రోడ్డును వదిలేసి ఉన్న రోడ్డులో డివైడర్లు కట్టి రోడ్డును మరింత ఇరుకు చేసిన ఘనత టీడీపీ పాలకులదే. ఈ పనులపై విచారణ చేయించి ప్రజలకు అనువుగా రోడ్డును విస్తరించేలా చూసి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు. -
ఇన్నేళ్లకు బయటపడిన.. దొరవారి దందాగిరీ
వంద రాబందులు తిన్న గొడ్డు ఒక్క తుపానుకు కొట్టుకుపోయిన చందంగా.. విశాఖలో విచ్చలవిడి దందాలు, వసూళ్లు, పంచాయితీలతో అడ్డగోలుగా కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేత కొఠారు దొరబ్బాయి అలియాస్ దొరబాబు ఇప్పుడు టీడీపీ ఫండ్ దందా కేసులో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.విశాఖ డిఫ్యూటీ మేయర్‌గా చేసిన కాలంలో ఎన్నో అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడినా.. ఎప్పటికప్పుడు బయటపడుతూ వచ్చిన ఈ దొరవారి పాపం ఇన్నేళ్లకు పండినట్లు కనిపిస్తోంది.పార్టీ ఫండ్ ఇస్తారా.. చస్తారా... అంటూ విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్ అనే పారిశ్రామికవేత్తను బెదిరించిన కేసులో దొరబాబుదే కీలకపాత్ర అని తెలుస్తోంది.టీడీపీ నేత కావడంతో ఏపీలో ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఉండదని భావించిన బాధితుడు రవికాంత్ హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడంతో దొరబాబు సహా ఈ దందాలో ఉన్న నేతలపై కేసులు కట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.కోర్టు దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దొరబాబు బండారంపై నగరంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశాల్లో మనోహర గ్రీన్స్ లాజిస్టక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్న విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్‌ను ఏకంగా సీఎం చంద్రబాబు ఇంటి నుంచే ఫోన్ చేసి బెదిరింపులకు తెగబడిన సంగతి తెలిసిందే. పార్టీ ఫండ్ ఇస్తారా.. చస్తారా.. అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు సన్నిహితులైన టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఎన్నికలైన తర్వాత ఫండ్ ఏమిటి.. నావల్ల కాదు వదిలేయండి అని మొత్తుకున్నా వదల్లేదు. రూ.8 కోట్లు ఇవ్వకుంటే ఫ్యామిలీతో సహా చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ప్రాణభయంతో రవికాంత్ హైదరాబాద్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ దందాలో విశాఖ నగరానికి చెందిన మాజీ ఢిప్యూటీ మేయర్ కొఠారు దొరబ్బాయ్ అలియాస్ దొరబాబుదే కీలక పాత్ర అని తెలుస్తోంది. తొలుత టీడీపీకి చెందిన ఓ మాజీ కేంద్రమంత్రికి సన్నిహితంగా మెలిగే వెంకట్రావు నాయుడు.. వ్యాపారి రవికాంత్‌ను సంప్రదించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి ఫండ్ ఇవ్వాలని కోరారు. అయితే తన ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున ఈసారి తాను ఏమీ ఇవ్వలేనని రవికాంత్ స్పష్టం చేశారు. ఇందుకు వెంకట్రావునాయుడు స్పందిస్తూ డబ్బు ఇవ్వాల్సిందేనని, సీఎం చంద్రబాబు మీకు రూ.8 కోట్ల ఫండ్ టార్గెట్ పెట్టారని చెప్పుకొచ్చారు. అంత మొత్తం తన వల్ల కాదని రవికాంత్ చెప్పడంతో విశాఖ మాజీ డిఫ్యూటీ మేయర్ దొరబాబు రంగంలోకి దిగారు. సీఎం గంటగంటకూ ఫాలో అప్ చేస్తున్నారని బెదిరించిన దొరబాబు దొరబాబు నేరుగా తన మొబైల్ నెంబర్ నుంచే రవికాంత్‌కు ఫోన్ చేశారు. సీఎం గంటగంటకూ ఫాలో అప్ చేస్తున్నారని, అమౌంట్ విషయం ఏమైందని ఫోన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఒత్తిడి చేశాడు. దీంతో రవికాంత్ హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెదిరింపుల పూర్వాపరాలు పరిశీలించిన పోలీసు అధికారులు కోర్టు అనుమతి తీసుకుని కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఏకంగా సీఎం పేరు చెప్పి నేరుగా తన మొబైల్ నెంబర్‌తోనే బెదిరింపుల పర్వానికి దిగిన దొరబాబు దందాల చిట్టాపై ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్ పేరిట వ్యాపారులకు ఇండెంట్లు విశాఖ నగరంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం పేరిట ఈయన చేసిన వసూళ్లు. దందాలు వ్యాపారులకు తెలియనికావు, వాస్తవానికి దివంగత ఎంవీవీఎస్ మూర్తి పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యత తీసుకుంటే.. ఆయనకు సన్నిహితంగా మెలిగిన దొరబాబు అడ్డగోలుగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. మూర్తికి తెలియకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారన్న వాదనలు ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికీ ఉన్నాయి. నగరంలోని ప్రతి వ్యాపారికి రూ.3 లక్షలు ఇండెంట్ పెట్టి వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ఇక టీడీపీలోనే ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి పార్టీ ఆఫీసులో లిఫ్ట్ ఏర్పాటు పేరిట రూ.3లక్షలు వసూలు చేసిన సదరు దొరబాబు.. అదే లిఫ్ట్ పేరిట ఇతర వ్యాపారుల వద్ద కూడా దండుకున్న ట్రాక్ రికార్డ్ ఉంది. కొన్నాళ్లుగా అమరావతిలో మకాం లోకేష్ ఓసారి నగరానికి వచ్చినప్పుడు వ్యాపారస్తులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసిన దొరబాబు ఆ తర్వాత నుంచి లోకేష్‌బాబుకు నేను ఎంత చెబితే అంత.. అని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇటీవలికాలంలో అమరావతికి మకాం మార్చారు. ఎక్కువగా అక్కడే ఉంటూ సీఎం ఇంట్లోనూ, కార్యాలయంలోనూ హల్చల్ చేస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ టికెట్ల కేటాయింపులోనూ దొరబాబు హడావుడి చేశారన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా సీఎం పేరిట బెదిరింపుల కేసులో ఉండటంతో దొరబాబు బండారం ఇన్నాళ్లకు బయటపడిందన్న చర్చ జరుగుతోంది. మొదటి నుంచి వసూళ్ల పర్వమే విశాఖలో దొరబాబు పేరు చెబితేనే వసూళ్లపర్వాలు, దందాలు గుర్తొస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం ప్రాంతానికి చెందిన దొరబాబు కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. తొలుత సాగర్‌నగర్‌లో హేచరీస్ లీజు తీసుకుని వ్యాపారం చేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట దుకాణం తెరిచి.. నమ్మి పెట్టుబడి పెట్టిన స్నేహితులనే ముంచాడన్న పేరు పొందారు. తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత అప్పటి కాంగ్రెస్ నేతల అండతో డిఫ్యూటీ మేయర్ అయ్యారు. ఈ పదవిని అడ్డుపెట్టుకుని అతను చేసిన అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చెత్త పేరిట జరిగిన కుంభకోణం బయటపెడతానని కౌన్సిల్లో హడావుడి చేసి చెత్త తొలగించే కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టులో పనులు ఇప్పిస్తానంటూ ఎంతోమంది కాంట్రాక్టర్ల వద్ద రూ.కోట్లు కొల్లగొట్టిన చరిత్రా ఉంది. దొరబాబుది మొదటి నుంచి అదే నైజం :వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి నమ్మిన స్నేహితులను కూడా నట్టేట ముంచే దొరబాబుది మొదటి నుంచి దందాలు, బెదిరింపుల నైజమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. వసూళ్లు. దందాలు అతనికి వెన్నతో పెట్టి విద్య అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసే.. 40 రోజుల్లో రూ.వేల కోట్లు దండేయాలని టీడీపీ అగ్రనేతలు ఇలా వసూళ్లు చేస్తున్నారని కొయ్య దుయ్యబట్టారు. ఇలాంటి వాటిల్లో ఆరితేరిన దొరబాబుకే చంద్రబాబు, లోకేష్‌లు ఆ బాధ్యత అప్పజెప్పారని విమర్శించారు. దొరబాబుపై తెలంగాణ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి గతంలో ఆయన చేసిన నేరాల చిట్టా కూడా బయటపెట్టాలని కొయ్య డిమాండ్ చేశారు. టీడీపీ నేతల వేధింపులతో విసిగివేశారిన రవికాంత్ అనే వ్యాపారి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించారు కాబట్టి ఈ దందా బయటికొచ్చిందన్నారు. విశాఖలో కూడా టీడీపీ నేతలు ఇలాంటి దందాలు, వసూళ్లకు పాల్పడితే వెంటనే వ్యాపారులు పోలీసులను ఆశ్రయించాలని కొయ్య విజ్ఞప్తి చేశారు. -
పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు ప్రచారం
-
నాకు టికెట్ వద్దు..
సాక్షి, చిత్తూరు, : ఎమ్మెల్సీ దొరబాబుపై చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ మీ వల్లే నష్టపోయిందని మండిపడ్డారు. చిత్తూరు కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం మొత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగింది. ఒక సామాజికవర్గాన్నే ప్రోత్సహించడం వల్ల నియోజకర్గంలో పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి తలెత్తిందని ఎమ్మెల్యే సత్యప్రభ దొరబాబుపై మండిపడ్డారు. ‘బుల్లెట్ సురేశ్‌ను పార్టీలోకి చేర్చుకుందాం అంటే స్మగ్లర్ అంటూ అడ్డుపడ్డారు. ఆయన పార్టీలోకి వచ్చి ఉంటే తమిళుల ఓట్లయినా దక్కేవి కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీసీలకు దగ్గరవుదాం అని మాపాక్షి మోహన్‌ను చేరదీస్తే అలకబూనుతారు.. అన్ని పదవులు మీ వాళ్లకే కావాలంటే పార్టీ బతికేదెట్టా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోటీ చే యను. మీ ఇష్టం వచ్చిన వాళ్లకు టికెట్ తెచ్చుకోం డి.. పని చేస్తా’ అని అందరి ముందు ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. ఇంతలోనే వసంతకుమార్ కల్పిం చుకుని అయ్యిందేదో అయ్యింది.. ఎవరో ఒక రు బాధ్యత వహించాలి. వెళ్లిన వాళ్లను వెనక్కి తెచ్చుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే కల్పించుకుని ఎవరో ఎందుకు బాధ్యత వహించాలి. దీనికి ప్రవీణే కా ర ణం. ఆయనే వెనక్కి తీసుకురావాలి అన్నారు. ‘వారి ని తీసుకొస్తే ఏం చేస్తారు.. అది చెప్పండి. ఏం చేయకుండా ఎలా వస్తారు’ అని సమాధానమిచ్చా రు. టికెట్ హామీ ఇవ్వండి టికెట్ హామీ ఇస్తే టీడీపీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని సీకే బాబు అంటున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీలో చేరితే టికెట్ తర్వాత ఆలోచిస్తామని అధిష్టానం నుంచి సమాధానం వచ్చిందని, ఆ విషయం సీకే బాబుకు తెలిపామని, ఇక ఆయన ఇష్టమని నాయకులు నిట్టూర్చారని సమాచారం. -
పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీ నాయకులను ప్రశ్నించడంలేదు
-
వర్మ.. వస్తున్నాం కాసుకో!
పిఠాపురం : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తు మీరు సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ తరుఫున ప్రజల్లోకి వస్తున్నాం కాసుకో.. అంటు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నేత కొప్పన మోహనరావు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీలో చేరి తొలిసారిగా పిఠాపురం విచ్చేసిన సందర్భంగా ఆయన స్వగృహంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వర్మపై నిప్పులు చెరిగారు. వర్మ అరాచక పాలనపై ఒంటరి పోరాటం చేసిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబుకు కొండంత అండగా ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి నేటి నుంచి కంకణం కట్టుకున్నట్లు ఆయన ప్రకటించారు. వితంతవుల పింఛన్లు సైతం కాజేయడానికి కార్యకర్తలను, నాయకులను బతికుండగానే చంపుకుంటూ నీచాతినీచంగా దిగజారిపోయిన వర్మకు పిఠాపురం నియోజకవర్గంలో పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరాచకపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, ఆయన చేయించుకున్న సర్వేలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజలనేత వైఎస్ జగన్ తండ్రి ఆశయ సాధనకు ప్రజల పక్షాన అవిరళ కృషి చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం తనను పార్టీ వైపు వచ్చేలా చేసిందని కొప్పన మోహనరావు తెలిపారు. జగన్ నేతృత్వంలో పెండెం దొరబాబుకు అండగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని తిరుగులేని పార్టీగా నిలబెట్టడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. కొప్పన రాకతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందని ఆయన సహకారంతో జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేసి పార్టీ తరుఫున ప్రజలకు అండగా ఉంటామని పెండెం దొరబాబు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు. కొప్పనకు ఘన స్వాగతం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చిన కొప్పనకు పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్పులతో భారీ ర్యాలీగా ఆయనను పిఠాపురం మండలం జల్లురు నుంచి తీసుకువచ్చారు. -
లేపాక్షి ఆలయంలో పశుగణాభివృద్ధి అధికారులు
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ దొరబాబు, జిల్లా చైర్మన్ రాధాకృష్ణయ్య శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయంలో చిత్రీకరించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, కట్టడాలు అద్భుతంగా నేటికీ ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. ఆలయంలోని నాట్య మండపం, లతామండపం, కల్యాణమండపం, సోమవార మండపాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయాధికారులు వారిని సన్మానించారు. -
25వేలకే తులం బంగారం ఇస్తానంటూ..!
హైదరాబాద్: ఆయన పేరు దొరబాబు. నిజాంపేటలో అశోకా జెమ్స్ అండు జువెల్లరీ పేరిట ఓ బంగారు అభరణాల దుకాణాన్ని నిర్వహిస్తున్న దొరబాబు గతంలో మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కస్టమ్స్ అధికారులు చాలామంది తనకు తెలుసునని, వారి ద్వారా కేవలం రూ. 25వేలకు తులం బంగారం ఇప్పిస్తానని మహిళల్ని నమ్మించాడు. దీంతో 20 మహిళలు అతనికి ఏకంగా రూ. 80 లక్షల వరకు చెల్లించారు. ఇదిగో బంగారం అదిగో బంగారం అంటూ ఊరించిన దొరబాబు చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు. అతడు ఎంతకూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. నిజాంపేట్‌లో రూ.25వేలకే తులం బంగారం పేరిట మహిళల్ని మోసం చేసిన దొరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
కృష్ణా పుష్కరాల్లో విషాదం
కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికని నదిలోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశామని గప్పాలు కొట్టిన ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో ఘటనలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలోని పున్నమిఘాట్ సమీపంలో ఏపీ టూరిజం విహార యాత్ర బోటు నుంచి ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు. ఇది గుర్తించిన బోటు డ్రైవర్ గజ ఈతగాళ్ల సాయంతో అతన్ని కాపాడి భవానీపురం పోలీసులకు అప్పగించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారానికి చెందిన దొరబాబు(33)గా గుర్తించారు. భార్యతో మనస్పర్థలు, కుటుంబ కలహాలతోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఎనిమిరెడ్డి..‘కమల దళపతి’
►దొరబాబుపై 11 ఓట్ల ఆధిక్యతతో గెలుపు ► ఉత్కంఠభరితంగాబీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన ఎనిమిరెడ్డిని అభినందిస్తున్న ప్రత్యర్థి దొరబాబు బోట్‌క్లబ్ (కాకినాడ) : గత 24 సంవత్సరాలుగా ఏకగ్రీవంగానే జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక ఈసారి.. ఇద్దరి మధ్య ‘నువ్వా, నేనా’ అన్న రీతిలో ఉత్కంఠభరితంగా జరిగింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య.. కోనసీమకు చెందిన నేత యూళ్ల దొరబాబుపై 11 ఓట్ల ఆధిక్యతతో మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యూరు. బీజేపీ ఇదివరకు ఎన్నడూ లేనన్ని ఎంపీ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టడంతో పాటు 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకశక్తిగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో.. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష స్థానానికి మునుపెన్నడూ లేనంత పోటీ పెరిగింది. జిల్లా నాయకులు మూడు రోజుల క్రితం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఎన్నిక నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలిపారు. దీంతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎన్నిక నిర్వహించింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కోనసీమకు చెందిన నేత యాళ్ల దొరబాబు పోటీ పడ్డారు. పార్టీ నియమావళి ప్రకారం మండల అధ్యక్షుడు, మండల ప్రతినిధి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాన్నిబట్టి జిల్లాలో 116 ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా 111 మంది ఓట్లు వేశారు. ఎనిమిరెడ్డికి 61 ఓట్లు, దొరబాబుకు 50 ఓట్లు వచ్చాయి. 2010 నుంచి 2013 వరకూ పార్టీ జిల్లా సారథిగా ఉన్న ఎనిమిరెడ్డి 11 ఓట్ల ఆధిక్యతతో ఆ పదవికి మరోసారి ఎన్నికయ్యూరు. త్రిసభ్య కమిటీ సభ్యులుగా పార్టీ జాతీయ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు చల్లపల్లి నరసింహారెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, ఉప ఎన్నికల అధికారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీపతిరాజా వ్యవహరించారు. ఫలించని త్రిసభ్య కమిటీ యత్నం ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా కోర్ కమిటీ సభ్యులతో, పార్టీ నేతలతో మధ్యాహ్నం వరకూ జరిపిన చర్చలు ఫలించలేదు. దాంతో సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకూ ఓటింగ్ నిర్వహించి, అనంతరం ఫలితం వెల్లడించారు. ఎన్నిక సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల అభిమానులతో ఆర్ అండ్ బీ అతిథి గృహం కిక్కిరిసిపోయింది. ఎన్నికైన అనంతరం ఎనిమిరెడ్డిని బీజేపీ నాయకులు అభినందించారు. -
డెంగ్యూతో బాలుని మృతి
చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పళని, పద్మావతి దంపతుల కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి పలు ఆసుత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. -
కాకినాడ ‘దేశం’..ఆధిపత్య సమరం..
టీడీపీ నేతల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు పార్టీ నగర అధ్యక్షుడు దొరబాబు, వాణిజ్య విభాగం నేత బాబ్జీ వర్గాల మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కాకినాడ :కాకినాడ తీరంలో తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరులో కొట్టుకుపోతున్నారు. పలు అంశాల్లో పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంక్ ఓనర్స్ అసోసియేషన్, కాకినాడ పోర్ట వర్కర్స్ యూనియన్ల వ్యవహారాలు, మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. ఇలా అనేక విషయాల్లో ‘దేశం’ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూండడంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ అంశాల్లో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, పార్టీ వాణిజ్య విభాగం నాయకుడు, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. చివరకు ఈ వివాదం.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో సోమవారం రాత్రి బాబ్జీకి చెందిన ధనలక్ష్మి ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవానికి మంత్రులు దూరమయ్యే పరిస్థితికి దారి తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ దొరబాబు, బాబ్జీ చెట్టపట్టాలేసుకునే తిరిగారు. అనంతరం కాకినాడ దిగుమర్తివారివీధిలో వినాయక చవితి పందిరి విషయంలో వారిమధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడవి చినికిచినికి గాలివానగా మారి, రెండు వర్గాలుగా విడిపోయే వరకూ వెళ్లింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న సాకుతో చవితి పందిరిని తొలగించేందుకు ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బాబ్జీ ఒత్తిడి తెచ్చారు. దీనిని దొరబాబు వర్గీయులు వ్యతిరేకించడంతో వారిమధ్య వివాదం మొదలైందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ విషయంలో దొరబాబుదే పైచేయి అయింది. దీంతో దొరబాబు వర్గానికి బాబ్జీ దూరంగానే ఉంటున్నారు. దీనికి ఆర్థికపరమైన సర్దుబాట్లలో తలెత్తిన విభేదాలు కూడా తోడవడంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి పార్టీ నగర అధ్యక్షుడైన దొరబాబును ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించి, కేవలం దొరబాబును మాత్రమే విస్మరించడం కావాలని చేసింది కాక మరేమిటని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై ముఖ్యనేతల వద్ద తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దొరబాబు వర్గీయులు ధనలక్ష్మి ఫౌండేషన్ వార్షికోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకుండా చేయగలిగారని చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి ఎమ్మెల్యే కొండబాబు హాజరవడాన్ని దొరబాబు వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాకున్నా అందరినీ ఆహ్వానించి, తనను పిలవకపోవడాన్ని అవమానంగా భావించి.. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ కయ్యం.. మేయర్ పీఠం కోసమేనా! బాబ్జీ, దొరబాబులు రెండు వర్గాలు కావడానికి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా మరో కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు. అసలు జరుగుతాయో లేదో తెలియని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కోసమే వారు పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన కాపు సామాజికవర్గానికే మేయర్ సీటు కట్టబెట్టాలని దొరబాబు, వైశ్య సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బాబ్జీ చెరో అజెండాతో వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఆర్థికంగా చేయూతనిచ్చిన అంశాన్ని తెరపైకి తెచ్చి, తన కుటుంబ సభ్యులకు మేయర్ సీటు ఇప్పించుకొనేందుకు బాబ్జీ ప్రయత్నిస్తున్నారని దొరబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. అదే జరిగితే ఎంతకైనా వెళతామని వారు చెబుతున్నారు. ఈ విభేదాలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వర్గ విభేదాలను ఎమ్మెల్యే కొండబాబు ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాల్సిందే. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి అస్వస్థత
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబు అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తూ దొరబాబు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కాకినాడ సేఫ్ ఆస్పత్రికి తరలించారు.