Jabardasth Comedian Dorababu Wife Amulya Shocking Comments On Hyper Aadi - Sakshi
Sakshi News home page

హైపర్‌ ఆదిపై దొరబాబు భార్య కామెంట్స్‌, ఈ కోణం కూడా ఉందా!

Apr 30 2021 3:32 PM | Updated on Apr 30 2021 5:42 PM

Dorababu Wife Amulya Interesting Comments On Hyper Aadi - Sakshi

హైపర్‌ ఆది.. కామెడీ, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, టైమింగ్‌ పంచ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌. ఓ కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ  హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి శృతి మించి విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు.

అయితే హైపర్ ఆది టీంలో పనిచేసే దొరబాబు, పరదేశి గతంలో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ ఘటన జరిగి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ షోలో వారిని ఉద్దేశిస్తూ ఆది వేసే పంచ్‌ డైలాగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ వారిని టార్గెట్ చేస్తునే ఉంటాడు. ఇక ఇటీవల ఓ షోలో పాల్గొన్న దొరబాబు భార్య ఆమూల్య ఆది గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అడగ్గా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటివాడిని పెళ్లి చేసుకోమని చెబితే దొరలాంటివాడు ఎందుకని దొరబాబునే చేసుకున్నఅంటూ పంచ్ వేసింది.

ఇక వెంటనే ఆది ‘నీకు ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది’ అంటూ ఆమెపై కౌంటర్ వేశాడు. ఇక ఆ తర్వాత ఆమూల్య మాట్లాడుతూ.. ‘మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరూ మాకు తోడుగా లేరు. ఇక మాకు ఎవరు లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకు వచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో మాకు సాయం చేసి ఆదుకున్నాడు. అందుకే ఆది నెంబర్‌ను మా ఫోన్‌లో గాడ్‌ అని సేవ్ చేసుకున్నాం’అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఎప్పుడు ఎదుటి వారిపై పంచ్‌ డైలాగ్‌లు వేస్తూ ఆటపట్టించే ఆది ఈ కోణం కూడా ఉందా అంటూ నెటిజన్లను కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: 
వర్షపై బాడీషేమింగ్‌ చేసిన హైపర్‌ ఆది
గుడ్‌న్యూస్‌ చెప్పిన వర్ష, ఆ వెంటనే గిఫ్ట్‌తో పార్టీకి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement