సాక్షి, చిత్తూరు : పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనకు సంబంధం లేని యాదమర్రి మండలంలో తిష్ట వేసిన దొరబ్బాబు ఆదివారం నాడు హాల్ చల్ చేశారు. నామినేషన్స్ జరుగుతున్న యాదమర్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద తన అనుచరులతో రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో వచ్చిన దొరబాబు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దొరబాబు వల్ల పెరియం బాడీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దొరబాబు గుండా గిరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గుర్తు తెలియని వ్యక్తులు దొరబాబు వాహనం మీద కర్రలతో కొట్టారు. దీంతో దొరబాబు తన కారును వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీదికి పోనిచ్చి దురుసుగా ప్రవర్తించారు.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మీద స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. దొరబాబు దాదా గిరిని ఖండించారు. సంబంధం లేని మండలానికి వాక్కువహిన దొరబాబు రౌడీ ఇజం చేశారన్నారు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే యాదమర్రిలో దొరబాబు టీడీపీకి చెందిన ఓ వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతున్నారని, ఇది గిట్టని మరో వర్గం నేతలే ఆయనపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment